Leviticus · chapter 18 · verse 25
Leviticus 18:25 in Telugu
ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దానిమీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్లగ్రక్కి వేయుచున్నది.
Aa deshamu apavitrata kaladi ganuka nenu daanimeeda daani dosha shikshanu mopuchunnaanu. Aa deshamandu kaapuramunna vaarini vellagrakki veyuchunnadi.
Leviticus 18:25 in English
- King James Version (KJV)
- And the land is defiled: therefore I do visit the iniquity thereof upon it, and the land itself vomiteth out her inhabitants.
- World English Bible (WEB)
- The land was defiled. Therefore I punished its iniquity, and the land vomited out her inhabitants.
- American Standard Version (ASV)
- and the land is defiled: therefore I do visit the iniquity thereof upon it, and the land vomiteth out her inhabitants.
- Bible in Basic English (BBE)
- And the land itself has become unclean; so that I have sent on it the reward of its wrongdoing, and the land itself puts out those who are living in it.
- Darby Translation (DBY)
- And the land hath become unclean; and I visit the iniquity thereof upon it, and the land vomiteth out its inhabitants.
- Webster's Bible (WBS)
- And the land is defiled: therefore I do visit its iniquity upon it, and the land itself vomiteth out her inhabitants.
- Young's Literal Translation (YLT)
- and the land is defiled, and I charge its iniquity upon it, and the land vomiteth out its inhabitants:
Read in context
- 23ఏ జంతువు నందును నీ స్ఖలనముచేసి దాని వలన అపవిత్రత కలుగజేసికొనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని యెదుట నిలువరాదు, అది విపరీతము.
- 24వీటిలో దేనివలనను అపవిత్రత కలుగజేసికొన కూడదు. నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనములు వా టన్నిటివలన అపవిత్రులైరి.
- 25ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దానిమీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్లగ్రక్కి వేయుచున్నది.
- 26కాబట్టి ఆ దేశము మీకంటె ముందుగానున్న ప్రజలను వెళ్లగ్రక్కివేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్లగ్రక్కి వేయకుండునట్లు మీరు,
- 27అనగా స్వదేశియేగాని మీలో నివసించు పరదేశియేగాని యీ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక,
Cross references
- Leviticus 18:28 లేవీయకాండము 18:28యీ నా కట్ట డలను నా విధులను ఆచరింపవలెను.
- Jeremiah 2:7 యిర్మీయా 2:7దాని ఫలములను శ్రేష్ఠపదార్థములను తినునట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మును రప్పింపగా మీరు ప్రవేశించి, నా దేశమును అపవిత్రపరచి నా స్యాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి.
- Leviticus 20:22–23 లేవీయకాండము 20:22–23కాబట్టి మీరు నివసించునట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసికొని పోవుచున్నానో ఆ దేశము మిమ్మును కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలన్నిటిని నా విధు లన్నిటిని అనుసరించి నడుచు కొనవలెను. నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నియు చేసిరి గనుక నేను వారియందు అసహ్య పడితిని.
- Psalm 106:38 కీర్తనలు 106:38నిరపరాధ రక్తము, అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి కనానుదేశపువారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి ఆ రక్తమువలన దేశము అపవిత్రమాయెను
- Jeremiah 9:9 యిర్మీయా 9:9నేను ఈ సంగతులను తెలిసికొని వారిని శిక్షింపకపోదునా? ఇట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు.
- Numbers 35:33–34 సంఖ్యాకాండము 35:33–34మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు; నరహత్య దేశమును అపవిత్రపర చును గదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తమువలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేనివలనను కలుగదు. మీరు నివసించు దేశ మును అపవిత్ర పరచకూడదు. అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను. నిజముగా యెహోవా అను నేను ఇశ్రాయేలీయులమధ్య నివసించుచున్నాను.
- Ezekiel 36:17–18 యెహెజ్కేలు 36:17–18నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశములో నివసించి, దుష్ప్రవర్తనచేతను దుష్క్రియలచేతను దానిని అపవిత్రపరచిరి, వారి ప్రవర్తన బహిష్టయైన స్త్రీయొక్క అపవిత్రతవలె నా దృష్టికి కనబడుచున్నది. కాబట్టి దేశములో వారు చేసిన నరహత్య విషయమైయును, విగ్రహములను పెట్టుకొని వారు దేశమును అపవిత్రపరచినదాని విషయమైయును నేను నా క్రోధమును వారిమీద కుమ్మరించి
- Isaiah 26:21 యెషయా 26:21నీవు వెళ్లి నీ అంతఃపురములలో ప్రవేశించుము నీవు వెళ్లి నీ తలుపులు వేసికొనుము ఉగ్రత తీరిపోవువరకు కొంచెముసేపు దాగియుండుము.
- Jeremiah 14:10 యిర్మీయా 14:10యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ జనులు తమ కాళ్లకు అడ్డములేకుండ తిరుగులాడుటకు ఇచ్ఛగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు; ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసికొనును; వారి పాపములనుబట్టి వారిని శిక్షించును.
- Jeremiah 23:2 యిర్మీయా 23:2ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులనుగూర్చి యీలాగున సెలవిచ్చుచున్నాడు మీరు నా గొఱ్ఱెలనుగూర్చి విచారణచేయక, నేను మేపుచున్న గొఱ్ఱెలను చెదరగొట్టి పారదోలితిరి; ఇదిగో మీ దుష్క్రియలనుబట్టి మిమ్మును శిక్షింపబోవుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.
- Hosea 2:13 హోషేయ 2:13అది నన్ను మరచిపోయి నగలుపెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపమువేసి యుండుటను బట్టియు దాని విటకాండ్రను వెంటాడియుండుటనుబట్టియు నేను దానిని శిక్షింతును; ఇది యెహోవా వాక్కు.
- Deuteronomy 18:12 ద్వితీయోపదేశకాండము 18:12వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయము లైన వాటినిబట్టి నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి ఆ జనములను వెళ్లగొట్టుచున్నాడు.