Leviticus · chapter 27 · verse 25
Leviticus 27:25 in Telugu
నీ వెలలన్నియు పరిశుద్ధ స్థలముయొక్క వెలచొప్పున నిర్ణయింపవలెను. ఒక తులము ఇరువది చిన్నములు.
Nee velalanniyu parishuddha sthalamuyokka velachoppuna nirnayimpavalenu. Oka tulamu iruvadi chinnamulu.
Leviticus 27:25 in English
- King James Version (KJV)
- And all thy estimations shall be according to the shekel of the sanctuary: twenty gerahs shall be the shekel.
- World English Bible (WEB)
- All your valuations shall be according to the shekel of the sanctuary: twenty gerahs to the shekel.
- American Standard Version (ASV)
- And all thy estimations shall be according to the shekel of the sanctuary: twenty gerahs shall be the shekel.
- Bible in Basic English (BBE)
- And let all your values be based on the shekel of the holy place, that is, twenty gerahs to the shekel.
- Darby Translation (DBY)
- And all thy valuation shall be according to the shekel of the sanctuary: twenty gerahs shall be the shekel.
- Webster's Bible (WBS)
- And all thy estimations shall be according to the shekel of the sanctuary: twenty gerahs shall be the shekel.
- Young's Literal Translation (YLT)
- And all thy valuation is by the shekel of the sanctuary: twenty gerahs is the shekel.
Read in context
- 23యాజకుడు సునాదసంవత్సరమువరకు నిర్ణయించిన వెల చొప్పున అతనికి నియమింపవలెను. ఆ దినమందే నీవు నిర్ణయించిన వెల మేరచొప్పున యెహోవాకు ప్రతిష్ఠితముగా దాని చెల్లింపవలెను.
- 24సునాదసంవత్సరమున ఆ భూమి యెవని పిత్రార్జితమైనదో వానికి, అనగా ఆ పొలమును అమ్మిన వానికి అది తిరిగిరావలెను.
- 25నీ వెలలన్నియు పరిశుద్ధ స్థలముయొక్క వెలచొప్పున నిర్ణయింపవలెను. ఒక తులము ఇరువది చిన్నములు.
- 26అయితే జంతువులలో తొలిపిల్ల యెహోవాది గనుక యెవడును దాని ప్రతిష్ఠింపకూడదు; అది ఎద్దయిననేమి గొఱ్ఱెమేకల మందలోనిదైననేమి యెహోవాదగును.
- 27అది అపవిత్రజంతువైనయెడల వాడు నీవు నిర్ణయించు వెలలో అయిదవవంతు దానితో కలిపి దాని విడిపింపవచ్చును. దాని విడిపింపనియెడల నీవు నిర్ణయించిన వెలకు దాని అమ్మవలెను.
Cross references
- Exodus 30:13 నిర్గమకాండము 30:13వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడినవారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధస్థలముయొక్క తులమునుబట్టి అరతులము ఇయ్యవలెను. ఆ తులము యిరువది చిన్నములు. ఆ అరతులము యెహోవాకు ప్రతిష్ఠార్పణ.
- Numbers 3:47 సంఖ్యాకాండము 3:47పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసికొనవలెను.
- Numbers 18:16 సంఖ్యాకాండము 18:16అపవిత్ర జంతువుల తొలిచూలి పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను. విడిపింపవలసిన వాటిని పుట్టిన నెలనాటికి నీవు ఏర్పరచిన వెలచొప్పున, పరిశుద్ధమందిరముయొక్క తులపు పరిమాణ మునుబట్టి అయిదు తులముల వెండియిచ్చి వాటిని విడిపింపవలెను. తులము ఇరువది చిన్నములు.
- Ezekiel 45:12 యెహెజ్కేలు 45:12తులమొకటింటికి ఇరువది చిన్న ముల యెత్తును, అరవీసె యొకటింటికి ఇరువది తులముల యెత్తును, ఇరువదియైదు తులముల యెత్తును పదునైదు తులముల యెత్తును ఉండవలెను.
- Leviticus 27:3 లేవీయకాండము 27:3నీవు నిర్ణయింపవలసిన వెల యేదనగా, ఇరువది ఏండ్లు మొదలుకొని అరువది ఏండ్ల వయస్సు వరకు మగవానికి పరిశుద్ధస్థలముయొక్క తులమువంటి యేబది తులముల వెండి నిర్ణయింపవలెను.