Leviticus · chapter 3 · verse 1
Leviticus 3:1 in Telugu
అతడు అర్పించునది సమాధానబలియైనయెడల అతడు గోవులలోనిది తీసికొని వచ్చినయెడల అది మగదేగాని ఆడుదేగాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసికొనిరావలెను.
Atadu arpinchunadi samaadhaanabaliyainayedala atadu govulalonidi teesikoni vachchinayedala adi magadegaani aadudegaani yehovaa sannidhiki nirdoshamaina daanini teesikoniraavalenu.
Leviticus 3:1 in English
- King James Version (KJV)
- And if his oblation [be] a sacrifice of peace offering, if he offer [it] of the herd; whether [it be] a male or female, he shall offer it without blemish before the LORD.
- World English Bible (WEB)
- “‘If his offering is a sacrifice of peace offerings, if he offers it from the herd, whether male or female, he shall offer it without defect before the LORD.
- American Standard Version (ASV)
- And if his oblation be a sacrifice of peace-offerings; if he offer of the herd, whether male or female, he shall offer it without blemish before Jehovah.
- Bible in Basic English (BBE)
- And if his offering is given for a peace-offering; if he gives of the herd, male or female, let him give it without any mark on it, before the Lord.
- Darby Translation (DBY)
- And if his offering be a sacrifice of peace-offering, — if he present [it] of the herd, whether a male or female, he shall present it without blemish before Jehovah.
- Webster's Bible (WBS)
- And if his oblation [shall be] a sacrifice of peace-offering, if he shall offer [it] of the herd, whether a male or female; he shall offer it without blemish before the LORD.
- Young's Literal Translation (YLT)
- 'And if his offering [is] a sacrifice of peace-offerings, if out of the herd he is bringing near, whether male or female, a perfect one he doth bring near before Jehovah,
Read in context
- 1అతడు అర్పించునది సమాధానబలియైనయెడల అతడు గోవులలోనిది తీసికొని వచ్చినయెడల అది మగదేగాని ఆడుదేగాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసికొనిరావలెను.
- 2తాను అర్పించు దాని తలమీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున దానిని వధింపవలెను. యాజ కులగు అహరోను కుమారులు బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.
- 3అతడు ఆ సమాధాన బలి పశువుయొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును ఆంత్ర ములమీది క్రొవ్వంతటిని రెండు మూత్ర గ్రంధులను వాటిమీదను
Cross references
- Leviticus 1:3 లేవీయకాండము 1:3అతడు దహనబలిరూపముగా అర్పించునది గోవులలోనిదైనయెడల నిర్దోషమైన మగ దానిని తీసికొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వార మునకు దానిని తీసికొని రావలెను.
- Numbers 6:14 సంఖ్యాకాండము 6:14అప్పుడతడు దహనబలిగాను నిర్దోషమైన యేడాది మగ గొఱ్ఱెపిల్లను, పాపపరిహారార్థబలిగాను నిర్దోషమైన యేడాది ఆడు గొఱ్ఱెపిల్లను, సమాధాన బలిగాను నిర్దోష మైన యొక పొట్టేలును,
- Romans 5:1–2 రోమీయులకు 5:1–2కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము మరియు ఆయనద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయ పడుచున్నాము.
- Hebrews 10:22 హెబ్రీయులకు 10:22మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునై యుండి, విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్ని ధానమునకు చేరుదము.
- Leviticus 7:11–34 లేవీయకాండము 7:11–34ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధానబలిని గూర్చిన విధి యేదనగా వాడు కృతజ్ఞతార్పణముగా దాని నర్పించునప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలి గాక నూనెతో కలిసినవియు పొంగనివియునైన పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనివియునైన పలచని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమపిండి వంట లను అర్పింపవలెను. ఆ పిండివంటలేకాక సమాధానబలి రూపమైన కృతజ్ఞతాబలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను. మరియు ఆ అర్పణములలో ప్రతి దానిలోనుండి ఒకదాని యెహోవాకు ప్రతిష్ఠార్పణ ముగా అర్పింపవలెను. అది సమాధానబలిపశురక్తమును ప్రోక్షించిన యాజకునిది, అది అతనిదగును. సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతాబలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలెను; దానిలోనిది ఏదియు మరునాటికి ఉంచుకొనకూడదు. అతడు అర్పించుబలి మ్రొక్కుబడియేగాని స్వేచ్ఛార్పణయేగాని అయినయెడల అతడు దాని నర్పించు నాడే తినవలెను. మిగిలినది మరు నాడు తినవచ్చును; మూడవనాడు ఆ బలిపశువు మాంస ములో మిగిలినదానిని అగ్నితో కాల్చి వేయవలెను. ఒకడు తన సమాధానబలి పశువుమాంసములో కొంచె మైనను మూడవనాడు తినినయెడల అది అంగీకరింపబడదు; అది అర్పించినవానికి సమాధానబలిగా ఎంచబడదు; అది హేయము; దాని తినువాడు తన దోషశిక్షను భరించును. అపవిత్రమైన దేనికైనను తగిలిన మాంసమును తిన కూడదు; అగ్నితో దానిని కాల్చివేయవలెను; మాంసము విషయమైతే పవిత్రులందరు మాంసమును తినవచ్చును గాని ఒకడు తనకు అపవిత్రత కలిగియుండగా యెహో వాకు అర్పించు సమాధానబలి పశువుమాంసములో కొంచె మైనను తినినయెడల వాడు ప్రజలలోనుండి కొట్టివేయ బడును. ఎవడు మనుష్యుల అపవిత్రతనేగాని అపవిత్ర మైన జంతువునేగాని యే అపవిత్రమైన వస్తువునేగాని తాకి యెహోవాకు అర్పించు సమాధానబలిపశువు మాంస మును తినునో వాడు ప్రజలలోనుండి కొట్టివేయబడును. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముఎద్దుదేగాని గొఱ్ఱెదేగాని మేకదేగాని దేని క్రొవ్వును మీరు తిన కూడదు. చచ్చినదాని క్రొవ్వును చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనను వినియోగపరచవచ్చును గాని దాని నేమాత్ర మును తినకూడదు. ఏలయనగా మనుష్యులు యెహో వాకు హోమముగా అర్పించు జంతువులలో దేని క్రొవ్వు నైనను తినినవాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును. మరియు పక్షిదేగాని జంతువుదేగాని యే రక్తమును మీ నివాసములన్నిటిలో తినకూడదు. ఎవడు రక్తము తినునో వాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముఎవడు యెహో వాకు సమాధానబలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములలోనుండి తాను అర్పించునది యెహోవా సన్నిధికి తేవలెను. అతడు తన చేతుల లోనే యెహోవాకు హోమద్రవ్యములను, అనగా బోరమీది క్రొవ్వును తేవలెను. యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దానిని తేవలెను. యాజకుడు బలిపీఠముమీద ఆ క్రొవ్వును దహింపవలెను గాని, బోర అహరోనుకును అతని సంతతివారికిని చెందును. సమాధానబలిపశువులలోనుండి ప్రతిష్ఠార్పణముగా యాజ కునికి కుడి జబ్బనియ్యవలెను. అహరోను సంతతివారిలో ఎవడు సమాధానబలియగు పశువురక్తమును క్రొవ్వును అర్పించునో కుడిజబ్బ వానిదగును. ఏలయనగా ఇశ్రా యేలీయుల యొద్దనుండి, అనగా వారి సమాధానబలి ద్రవ్యములలోనుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసికొని, నిత్యమైన కట్టడచొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతివారికిని ఇచ్చియున్నాను.
- Amos 5:22 ఆమోసు 5:22నాకు దహనబలులను నైవేద్యములను మీరర్పించినను నేను వాటిని అంగీకరింపను; సమాధాన బలులుగా మీరర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను.
- Leviticus 22:19–21 లేవీయకాండము 22:19–21వాడు అంగీకరింపబడినట్లు, గోవులలోనుండి యైనను గొఱ్ఱెమేకలలో నుండియైనను దోషములేని మగదానిని అర్పింప వలెను. దేనికి కళంకముండునో దానిని అర్పింప కూడదు; అది మీ పక్షముగా అంగీకరింపబడదు. ఒకడు మ్రొక్కుబడిని చెల్లించుటకేగాని స్వేచ్ఛార్పణము అర్పించుటకేగాని సమాధానబలిరూపముగా గోవునైనను గొఱ్ఱెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడునట్లు దోషము లేనిదై యుండవలెను; దానిలో కళంకమేదియు నుండకూడదు.
- 1 John 1:3 1 యోహాను 1:3మాతోకూడ మీకును సహవాసము కలుగునట్లు మేము చూచినదానిని వినినదానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు తోకూడను ఉన్నది.
- Ezekiel 45:15 యెహెజ్కేలు 45:15మరియు ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై నైవేద్యమునకును దహనబలికిని సమాధాన బలికిని మంచి మేపుతగిలిన గొఱ్ఱె లలో మందకు రెండువందలలో ఒకదానిని తేవలెను.
- Exodus 20:24 నిర్గమకాండము 20:24మంటి బలిపీఠమును నాకొరకు చేసి, దానిమీద నీ దహన బలులను సమాధానబలులను నీ గొఱ్ఱెలను నీ యెద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగానుంచు ప్రతి స్థలములోను నీయొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను.
- Proverbs 7:14 సామెతలు 7:14సమాధానబలులను నేను అర్పింపవలసియుంటిని నేడు నా మ్రొక్కుబళ్లు చెల్లించియున్నాను
- Malachi 1:8 మలాకీ 1:8గ్రుడ్డిదానిని తీసికొని బలిగా అర్పించినయెడల అది దోషముకాదా? కుంటిదానినైనను రోగముగలదానినైనను అర్పించిన యెడల అది దోషముకాదా? అట్టివాటిని నీ యధికారికి నీవిచ్చిన యెడల అతడు నీకు దయచూపునా? నిన్ను అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు.