Leviticus · chapter 7 · verse 11
Leviticus 7:11 in Telugu
ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధానబలిని గూర్చిన విధి యేదనగా
Okadu yehovaaku arpimpavalasina samaadhaanabalini goorchina vidhi yedanagaa
Leviticus 7:11 in English
- King James Version (KJV)
- And this [is] the law of the sacrifice of peace offerings, which he shall offer unto the LORD.
- World English Bible (WEB)
- “‘This is the law of the sacrifice of peace offerings, which one shall offer to the LORD:
- American Standard Version (ASV)
- And this is the law of the sacrifice of peace-offerings, which one shall offer unto Jehovah.
- Bible in Basic English (BBE)
- And this is the law for the peace-offerings offered to the Lord.
- Darby Translation (DBY)
- And this is the law of the sacrifice of peace-offering, which [a man] shall present to Jehovah.
- Webster's Bible (WBS)
- And this [is] the law of the sacrifice of peace-offerings, which he shall offer to the LORD.
- Young's Literal Translation (YLT)
- 'And this [is] a law of the sacrifice of the peace-offerings which [one] bringeth near to Jehovah:
Read in context
- 9పొయ్యిమీద వండిన ప్రతి నైవేద్యమును, కుండలోనేగాని పెనముమీదనేగాని కాల్చినది యావత్తును, దానిని అర్పించిన యాజకునిది, అది అతనిదగును.
- 10అది నూనె కలిసినదేగాని పొడిదేగాని మీ నైవేద్యములన్నిటిని అహరోను సంతతివారు సమముగా పంచుకొనవలెను.
- 11ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధానబలిని గూర్చిన విధి యేదనగా
- 12వాడు కృతజ్ఞతార్పణముగా దాని నర్పించునప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలి గాక నూనెతో కలిసినవియు పొంగనివియునైన పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనివియునైన పలచని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమపిండి వంట లను అర్పింపవలెను.
- 13ఆ పిండివంటలేకాక సమాధానబలి రూపమైన కృతజ్ఞతాబలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను.
Cross references
- Ezekiel 45:15 యెహెజ్కేలు 45:15మరియు ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై నైవేద్యమునకును దహనబలికిని సమాధాన బలికిని మంచి మేపుతగిలిన గొఱ్ఱె లలో మందకు రెండువందలలో ఒకదానిని తేవలెను.
- Leviticus 22:18–21 లేవీయకాండము 22:18–21నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇశ్రా యేలీయులందరితోను ఇట్లు చెప్పుముఇశ్రాయేలీ యుల యింటివారిలోనేగాని ఇశ్రాయేలీయులలో నివ సించు పరదేశులలోనేగాని యెవడు యెహోవాకు దహన బలిగా స్వేచ్ఛార్పణములనైనను మ్రొక్కు బళ్లనైనను అర్పించునొ వాడు అంగీకరింపబడినట్లు, గోవులలోనుండి యైనను గొఱ్ఱెమేకలలో నుండియైనను దోషములేని మగదానిని అర్పింప వలెను. దేనికి కళంకముండునో దానిని అర్పింప కూడదు; అది మీ పక్షముగా అంగీకరింపబడదు. ఒకడు మ్రొక్కుబడిని చెల్లించుటకేగాని స్వేచ్ఛార్పణము అర్పించుటకేగాని సమాధానబలిరూపముగా గోవునైనను గొఱ్ఱెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడునట్లు దోషము లేనిదై యుండవలెను; దానిలో కళంకమేదియు నుండకూడదు.
- Leviticus 3:1–17 లేవీయకాండము 3:1–17అతడు అర్పించునది సమాధానబలియైనయెడల అతడు గోవులలోనిది తీసికొని వచ్చినయెడల అది మగదేగాని ఆడుదేగాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసికొనిరావలెను. తాను అర్పించు దాని తలమీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున దానిని వధింపవలెను. యాజ కులగు అహరోను కుమారులు బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను. అతడు ఆ సమాధాన బలి పశువుయొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును ఆంత్ర ములమీది క్రొవ్వంతటిని రెండు మూత్ర గ్రంధులను వాటిమీదను డొక్కలమీదనున్న క్రొవ్వును కాలే జముమీదను మూత్రగ్రంథుల మీదనున్న వపను యెహోవాకు హోమముగా అర్పింవలెను. అహరోను కుమారులు బలిపీఠముమీద, అనగా అగ్నిమీది కట్టె లపైనున్న దహనబలి ద్రవ్యముపైని దానిని దహింప వలెను. అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము. యెహోవాకు సమాధానబలిగా ఒకడు అర్పించునది గొఱ్ఱె మేకలలోనిదైనయెడల అది మగదేగాని ఆడుదేగాని నిర్దోషమైనదాని తీసికొని రావలెను. అతడర్పించు అర్ప ణము గొఱ్ఱెపిల్లయైన యెడల యెహోవా సన్నిధికి దానిని తీసికొని రావలెను. తాను అర్పించు దాని తలమీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము నెదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను. ఆ సమాధాన బలి పశువుయొక్క క్రొవ్వును ముడ్డిపూస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని ఆంత్రములలోని క్రొవ్వును ఆంత్రములమీది క్రొవ్వు అంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటిమీది డొక్కల పైనున్న క్రొవ్వును మూత్ర గ్రంథులమీది కాలేజముయొక్క వపను తీసి యెహోవాకు హోమము చేయవలెను. యాజకుడు బలి పీఠముమీద దానిని దహింపవలెను. అది యెహోవాకు హోమరూపమైన ఆహారము. అతడు అర్పించునది మేక యైనయెడల యెహోవా సన్నిధికి దానిని తీసికొని రావలెను. తాను దాని తలమీద చెయ్యి ఉంచి ప్రత్య క్షపు గుడారము నెదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను. తాను దానిలో అర్పించు ఆంత్రములను కప్పు క్రొవ్వును ఆంత్రములమీది క్రొవ్వు అంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటిమీది డొక్కలపైనున్న క్రొవ్వును రెండు మూత్ర గ్రంథులపైనున్న కాలేజముయొక్క వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. యాజకుడు బలిపీఠముమీద వాటిని దహింప వలెను. క్రొవ్వంతయు యెహోవాదే; అది సువాసనగల హోమ రూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు. అది మీ తరతరములకు మీ నివాసస్థలములన్నిటిలోను నిత్యమైన కట్టడ.