Leviticus · chapter 7 · verse 14
Leviticus 7:14 in Telugu
మరియు ఆ అర్పణములలో ప్రతి దానిలోనుండి ఒకదాని యెహోవాకు ప్రతిష్ఠార్పణ ముగా అర్పింపవలెను. అది సమాధానబలిపశురక్తమును ప్రోక్షించిన యాజకునిది, అది అతనిదగును.
Mariyu aa arpanamulalo prati daanilonundi okadaani yehovaaku pratishthaarpana mugaa arpimpavalenu. Adi samaadhaanabalipashuraktamunu prokshinchina yaajakunidi, adi atanidagunu.
Leviticus 7:14 in English
- King James Version (KJV)
- And of it he shall offer one out of the whole oblation [for] an heave offering unto the LORD, [and] it shall be the priest’s that sprinkleth the blood of the peace offerings.
- World English Bible (WEB)
- Of it he shall offer one out of each offering for a heave offering to the LORD. It shall be the priest’s who sprinkles the blood of the peace offerings.
- American Standard Version (ASV)
- And of it he shall offer one out of each oblation for a heave-offering unto Jehovah; it shall be the priest’s that sprinkleth the blood of the peace-offerings.
- Bible in Basic English (BBE)
- And let him give one out of every offering to be lifted up before the Lord; that it may be for the priest who puts the blood of the peace-offering on the altar.
- Darby Translation (DBY)
- And of it he shall present one out of the whole offering as a heave-offering to Jehovah; to the priest that sprinkleth the blood of the peace-offering, to him it shall belong.
- Webster's Bible (WBS)
- And of it he shall offer one out of the whole oblation [for] a heave-offering to the LORD, [and] it shall be the priest's that sprinkleth the blood of the peace-offerings.
- Young's Literal Translation (YLT)
- and he hath brought near out of it one of the whole offering — a heave-offering to Jehovah; to the priest who is sprinkling the blood of the peace-offerings — it is his;
Read in context
- 12వాడు కృతజ్ఞతార్పణముగా దాని నర్పించునప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలి గాక నూనెతో కలిసినవియు పొంగనివియునైన పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనివియునైన పలచని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమపిండి వంట లను అర్పింపవలెను.
- 13ఆ పిండివంటలేకాక సమాధానబలి రూపమైన కృతజ్ఞతాబలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను.
- 14మరియు ఆ అర్పణములలో ప్రతి దానిలోనుండి ఒకదాని యెహోవాకు ప్రతిష్ఠార్పణ ముగా అర్పింపవలెను. అది సమాధానబలిపశురక్తమును ప్రోక్షించిన యాజకునిది, అది అతనిదగును.
- 15సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతాబలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలెను; దానిలోనిది ఏదియు మరునాటికి ఉంచుకొనకూడదు.
- 16అతడు అర్పించుబలి మ్రొక్కుబడియేగాని స్వేచ్ఛార్పణయేగాని అయినయెడల అతడు దాని నర్పించు నాడే తినవలెను.
Cross references
- Numbers 18:19 సంఖ్యాకాండము 18:19ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్ఠార్పణములన్నిటిని నేను నీకును నీ కుమారులకును నీ కుమా ర్తెలకును నిత్యమైన కట్టడనుబట్టి యిచ్చితిని. అది నీకును నీతోపాటు నీ సంతతికిని యెహోవా సన్ని ధిని నిత్యమును స్థిరమైన నిబంధన.
- Exodus 29:27–28 నిర్గమకాండము 29:27–28ప్రతిష్ఠితమైన ఆ పొట్టేలులో అనగా అహరోనుదియు అతని కుమారులదియునైన దానిలో అల్లాడింపబడిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపవలెను. అది ప్రతిష్టార్పణ గనుక నిత్యమైన కట్టడ చొప్పున అది ఇశ్రాయేలీయులనుండి అహ రోనుకును అతని కుమారులకు నగును. అది ఇశ్రాయేలీయులు అర్పించు సమాధానబలులలోనుండి తాము చేసిన ప్రతిష్ఠార్పణ, అనగా వారు యెహోవాకు చేసిన ప్రతిష్ఠార్పణగా నుండును.
- Numbers 18:8–11 సంఖ్యాకాండము 18:8–11మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెనుఇదిగో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించువాటన్నిటిలో నా ప్రతి ష్ఠార్పణములను కాపాడు పని నీకిచ్చి యున్నాను; అభి షేకమునుబట్టి నిత్యమైన కట్టడవలన నీకును నీ కుమారులకును నేనిచ్చియున్నాను. అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవేవనగా, వారి నైవేద్యములన్నిటిలోను, వారి పాపపరిహారార్థ బలులన్ని టిలోను, వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోను వారు నాకు తిరిగి చెల్లించు అర్పణములన్నియు నీకును నీ కుమారులకును అతిపరిశుద్ధమైనవగును, అతిపరి శుద్ధస్థలములో మీరు వాటిని తినవలెను. ప్రతి మగ వాడును దానిని తినవలెను; అది నీకు పరిశుద్ధముగా ఉండును. మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడి నదియు, ఇశ్రాయేలీయులు అల్లాడించు అర్పణములన్నియు నీవగును. నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడవలన వాటి నిచ్చితిని; నీ యింటిలోని పవిత్రులందరును వాటిని తినవచ్చును.
- Numbers 31:41 సంఖ్యాకాండము 31:41యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును, అనగా యెహోవాకు చెల్లవలసిన ప్రతిష్ఠార్పణమును యాజకుడైన ఎలియాజరున కిచ్చెను.
- Leviticus 6:26 లేవీయకాండము 6:26పాపపరిహారార్థ బలిగా దాని నర్పించిన యాజకుడు దానిని తినవలెను; పరి శుద్ధస్థలమందు, అనగా ప్రత్యక్షపు గుడారముయొక్క ఆవరణములో దానిని తినవలెను.
- Numbers 15:19–21 సంఖ్యాకాండము 15:19–21మీరు ఆ దేశపు ఆహారమును తినునప్పుడు ప్రతిష్ఠార్పణ మును యెహోవాకు అర్పింపవలెను. మీరు మీ మొదటి పిండిముద్ద రొట్టెను ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను; కళ్లపు అర్పణమువలె దాని అర్పింపవలెను. మీ తరతరములకు మీ మొదటి పిండిముద్దలోనుండి ప్రతిష్ఠార్పణమును యెహోవాకు అర్పింపవలెను.
- Numbers 31:29 సంఖ్యాకాండము 31:29యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా యాజకుడైన ఎలియాజరుకు ఇయ్యవలెను.
- Numbers 18:24–32 సంఖ్యాకాండము 18:24–32అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతి ష్ఠార్పణముగా అర్పించు దశమభాగములను నేను లేవీయు లకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. అందుచేతను వారు ఇశ్రా యేలీయుల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పితిని. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను నీవు లేవీయులతో ఇట్లనుమునేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమభాగమును మీరు వారియొద్ద పుచ్చుకొనునప్పుడు మీరు దానిలో, అనగా ఆ దశమభాగములో దశమభాగమును యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా చెల్లింపవలెను. మీకు వచ్చు ప్రతిష్ఠార్పణము కళ్లపు పంటవలెను ద్రాక్షల తొట్టి ఫలమువలెను ఎంచవలెను. అట్లు మీరు ఇశ్రాయేలీ యులయొద్ద పుచ్చుకొను మీ దశమభాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్ఠార్పణమును యెహోవాకు చెల్లింప వలెను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజ కుడైన అహరోనుకు ఇయ్యవలెను. మీకియ్యబడు వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలోనుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును, అనగా దాని ప్రతిష్ఠితభాగమును దానిలోనుండి ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు వారితో మీరు దానిలోనుండి ప్రశస్తభాగ మును అర్పించిన తరువాత మిగిలినది కళ్లపువచ్చుబడివలెను ద్రాక్షతొట్టి వచ్చుబడివలెను లేవీయులదని యెంచవలెను. మీరును మీ కుటుంబికులును ఏ స్థలమందైనను దానిని తినవచ్చును; ఏలయనగా ప్రత్యక్షపు గుడారములో మీరు చేయు సేవకు అది మీకు జీతము. మీరు దానిలోనుండి ప్రశస్తభాగమును అర్పించిన తరువాత దానినిబట్టి పాప శిక్షను భరింపకుందురు; మీరు చావకుండునట్లు ఇశ్రాయేలీ యుల ప్రతిష్ఠితమైనవాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము.