Luke · chapter 11 · verse 52
Luke 11:52 in Telugu
అయ్యో, ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమను తాళపు చెవిని ఎత్తికొని పోతిరి; మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించువారిని అడ్డగింతురని చెప్పెను.
Ayyo, dharmashaastropadeshakulaaraa, meeru jnyaanamanu taalapu chevini ettikoni potiri; meerunu lopala praveshimparu, praveshinchuvaarini addaginturani cheppenu.
Luke 11:52 in English
- King James Version (KJV)
- Woe unto you, lawyers! for ye have taken away the key of knowledge: ye entered not in yourselves, and them that were entering in ye hindered.
- World English Bible (WEB)
- Woe to you lawyers! For you took away the key of knowledge. You didn’t enter in yourselves, and those who were entering in, you hindered.”
- American Standard Version (ASV)
- Woe unto you lawyers! for ye took away the key of knowledge: ye entered not in yourselves, and them that were entering in ye hindered.
- Bible in Basic English (BBE)
- A curse is on you, teachers of the law! for you have taken away the key of knowledge: you did not go in yourselves, and you got in the way of those who were going in.
- Darby Translation (DBY)
- Woe unto you, the doctors of the law, for ye have taken away the key of knowledge; yourselves have not entered in, and those who were entering in ye have hindered.
- Webster's Bible (WBS)
- Woe to you, lawyers! for ye have taken away the key of knowledge: ye have not entered in yourselves, and them that were entering in ye hindered.
- Young's Literal Translation (YLT)
- 'Woe to you, the lawyers, because ye took away the key of the knowledge; yourselves ye did not enter; and those coming in, ye did hinder.'
Read in context
- 50వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు.
- 51కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరము నకును మధ్యను నశించిన జెకర్యా రక్తమువరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు; నిశ్చయముగా ఈ తరమువారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పు చున్నాను.
- 52అయ్యో, ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమను తాళపు చెవిని ఎత్తికొని పోతిరి; మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించువారిని అడ్డగింతురని చెప్పెను.
- 53ఆయన అక్కడనుండి వెళ్లినప్పుడు శాస్త్రులును పరిసయ్యులును ఆయన మీద నిండ పగబట్టి ఆయన మీద నేరము మోపవలెనని యుండి,
- 54ఆయన నోట నుండి వచ్చు ఏమాటనైనను పట్టుకొనుటకు పొంచి, వెదకుచు చాల సంగతులనుగూర్చి ఆయనను మాటలాడింపసాగిరి.
Cross references
- Matthew 23:13 మత్తయి 23:13అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యు లారా, మీరు మనుష్యులయెదుట పరలోకరాజ్యమును మూయుదురు;
- Malachi 2:7 మలాకీ 2:7యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారినోట ధర్మశాస్త్రవిధులను నేర్చుకొందురు, వారు జ్ఞాన మునుబట్టి బోధింపవలెను.
- Acts 4:17–18 అపొస్తలుల కార్యములు 4:17–18అయినను ఇది ప్రజలలో ఇంక వ్యాపింపకుండుటకై ఇకమీదట ఈ నామమునుబట్టి యే మనుష్యులతోనైనను మాటలాడ కూడదని మనము వారిని బెదరుపెట్టవలెనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించిమీరు యేసు నామమునుబట్టి యెంతమాత్రమును మాటలాడకూడదు, బోధింపనుకూడదని వారికాజ్ఞాపించిరి.
- Luke 11:45–46 లూకా 11:45–46అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు బోధకుడా, యీలాగు చెప్పి మమ్మునుకూడ నిందించుచున్నావని ఆయ నతో చెప్పగా ఆయన అయ్యో, ధర్మ శాస్త్రోపదేశకులారా, మోయ శక్యముకాని బరువులను మీరు మనుష్యులమీద మోపుదురు గాని మీరు ఒక వ్రేలితోనైనను ఆ బరువులను ముట్టరు.
- John 9:24–34 యోహాను 9:24–34కాబట్టి వారు గ్రుడ్డివాడైయుండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి దేవుని మహిమపరచుము; ఈ మనుష్యుడు పాపియని మేమెరుగుదుమని వానితో చెప్పగా వాడు ఆయన పాపియో కాడో నేనెరుగను; ఒకటి మాత్రము నేనెరుగు దును; నేను గ్రుడ్డివాడనైయుండి ఇప్పుడు చూచుచున్నా ననెను. అందుకు వారు ఆయన నీకేమి చేసెను? నీ కన్నులు ఏలాగు తెరచెనని మరల వానిని అడుగగా వాడు ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి; మీరెందుకు మరల వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా యేమి అని వారితో అనెను. అందుకు వారు నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము; దేవుడు మోషేతో మాటలాడెనని యెరుగుదుము గాని వీడెక్కడనుండి వచ్చెనో యెరుగమని చెప్పి వానిని దూషించిరి. అందుకు ఆ మనుష్యుడు ఆయన ఎక్కడనుండి వచ్చెనో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే; అయినను ఆయన నా కన్నులు తెరచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము; ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తముచొప్పున జరిగించినయెడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టు గ్రుడ్డివాని కన్నులెవరైన తెరచినట్టు లోకము పుట్టినప్పటినుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కానియెడల ఏమియు చేయనేరడని వారితో చెప్పెను. అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింప వచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి.
- John 7:47–52 యోహాను 7:47–52అందుకు పరిసయ్యులు మీరుకూడ మోస పోతిరా? అధికారులలో గాని పరిసయ్యులలో గాని యెవడైనను ఆయనయందు విశ్వాసముంచెనా? అయితే ధర్మశాస్త్ర మెరుగని యీ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. అంతకుమునుపు ఆయనయొద్దకు వచ్చిన నీకొదేము వారిలో ఒకడు. అతడు ఒక మనుష్యుని మాట వినకమునుపును, వాడు చేసినది తెలిసికొనక మునుపును, మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా వారు నీవును గలిలయుడవా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి.
- Luke 19:39–40 లూకా 19:39–40ఆ సమూ హములో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచివీరు ఊరకుండినయెడల ఈ రాళ్లు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాననెను.
- Acts 5:40 అపొస్తలుల కార్యములు 5:40వారతని మాటకు సమ్మతించి, అపొస్తలులను పిలిపించి కొట్టించియేసు నామమునుబట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి.