Proverbs · chapter 18 · verse 9
Proverbs 18:9 in Telugu
పనిలో జాగుచేయువాడు నష్టము చేయువానికి సోదరుడు.
Panilo jaagucheyuvaadu nashtamu cheyuvaaniki sodarudu.
Proverbs 18:9 in English
- King James Version (KJV)
- He also that is slothful in his work is brother to him that is a great waster.
- World English Bible (WEB)
- One who is slack in his work is brother to him who is a master of destruction.
- American Standard Version (ASV)
- He also that is slack in his work Is brother to him that is a destroyer.
- Bible in Basic English (BBE)
- He who does not give his mind to his work is brother to him who makes destruction.
- Darby Translation (DBY)
- He also who is indolent in his work is brother of the destroyer.
- Webster's Bible (WBS)
- He also that is slothful in his work is brother to him that is a great waster.
- Young's Literal Translation (YLT)
- He also that is remiss in his work, A brother he [is] to a destroyer.
Read in context
- 7బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును.
- 8కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు అవి లోకడుపులోనికి దిగిపోవును.
- 9పనిలో జాగుచేయువాడు నష్టము చేయువానికి సోదరుడు.
- 10యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును.
- 11ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము వాని దృష్టికి అది యెత్తయిన ప్రాకారము.
Cross references
- Proverbs 10:4 సామెతలు 10:4బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును.
- Hebrews 6:12 హెబ్రీయులకు 6:12మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించు చున్నాము.
- Proverbs 24:30–34 సామెతలు 24:30–34సోమరివాని చేను నేను దాటి రాగా తెలివిలేనివాని ద్రాక్షతోట నేను దాటి రాగా ఇదిగో దానియందంతట ముండ్ల తుప్పలు బలిసి యుండెను. దూలగొండ్లు దాని కప్పియుండెను దాని రాతి గోడ పడియుండెను. నేను దాని చూచి యోచన చేసికొంటిని దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని. ఇంక కొంచెము నిద్ర యింక కొంచెము కునుకుపాటు పరుండుటకై యింక కొంచెము చేతులు ముడుచు కొనుట వీటివలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీమీదికి వచ్చును.
- Romans 12:11 రోమీయులకు 12:11ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రతగలవారై ప్రభువును సేవించుడి.
- Proverbs 23:20–21 సామెతలు 23:20–21ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగాతినువారితోనైనను సహవాసము చేయకుము. త్రాగుబోతులును తిండిపోతులును దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును.
- Proverbs 28:24 సామెతలు 28:24తన తలిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహముకాదనుకొనువాడు నశింపజేయువానికి జతకాడు.
- Matthew 25:26 మత్తయి 25:26అందుకు అతని యజమానుడు వానిని చూచి సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తనిచోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొనువాడనని నీవు ఎరుగుదువా?
- Luke 15:13–14 లూకా 15:13–14కొన్నిదినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమై పోయి, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారమువలన పాడుచేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరవు రాగా వాడు ఇబ్బంది పడ సాగి,
- Luke 16:1–2 లూకా 16:1–2మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను ఒక ధనవంతునియొద్ద ఒక గృహనిర్వాహకుడుండెను. వాడతని ఆస్తిని పాడుచేయుచున్నాడని అతనియొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాని పిలిపించి నిన్నుగూర్చి నేను వినుచున్న యీ మాట ఏమిటి? నీ గృహనిర్వాహకత్వపు లెక్క అప్పగించుము; నీవు ఇక మీదట గృహనిర్వాహకుడవై యుండ వల్లకాదని వానితో చెప్పెను.
- Job 30:29 యోబు 30:29నేను నక్కలకు సోదరుడనైతిని నిప్పుకోళ్ల జతకాడనైతిని.