Luke · chapter 18 · verse 31
Luke 18:31 in Telugu
ఆయన తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి ఇదిగో యెరూషలేమునకు వెళ్లుచున్నాము; మనుష్యకుమారుని గూర్చి ప్రవక్తలచేత వ్రాయబడిన మాటలన్నియు నెరవేర్చబడును.
Aayana tana pandrendumandi shishyulanu pilichi idigo yerooshalemunaku velluchunnaamu; manushyakumaaruni goorchi pravaktalacheta vraayabadina maatalanniyu neraverchabadunu.
Luke 18:31 in English
- King James Version (KJV)
- Then he took [unto him] the twelve, and said unto them, Behold, we go up to Jerusalem, and all things that are written by the prophets concerning the Son of man shall be accomplished.
- World English Bible (WEB)
- He took the twelve aside and said to them, “Behold, we are going up to Jerusalem, and all the things that are written through the prophets concerning the Son of Man will be completed.
- American Standard Version (ASV)
- And he took unto him the twelve, and said unto them, Behold, we go up to Jerusalem, and all the things that are written through the prophets shall be accomplished unto the Son of man.
- Bible in Basic English (BBE)
- And he took with him the twelve and said to them, Now we are going up to Jerusalem, and all the things which were said by the prophets will be done to the Son of man.
- Darby Translation (DBY)
- And he took the twelve to [him] and said to them, Behold, we go up to Jerusalem, and all things that are written of the Son of man by the prophets shall be accomplished;
- Webster's Bible (WBS)
- Then he took the twelve, and said to them, Behold, we go up to Jerusalem, and all things that are written by the prophets concerning the Son of man shall be accomplished.
- Young's Literal Translation (YLT)
- And having taken the twelve aside, he said unto them, 'Lo, we go up to Jerusalem, and all things shall be completed — that have been written through the prophets — to the Son of Man,
Read in context
- 29ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై యింటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తలిదండ్రుల నైనను పిల్లలనైనను విడిచిపెట్టినవాడెవడును,
- 30ఇహమందు చాలరెట్లును పరమందు నిత్యజీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను.
- 31ఆయన తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి ఇదిగో యెరూషలేమునకు వెళ్లుచున్నాము; మనుష్యకుమారుని గూర్చి ప్రవక్తలచేత వ్రాయబడిన మాటలన్నియు నెరవేర్చబడును.
- 32ఆయన అన్యజనుల కప్పగింపబడును; వారు ఆయనను అపహసించి, అవమానపరచి, ఆయనమీద ఉమ్మి వేసి,
- 33ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు; మూడవ దినమున ఆయన మరల లేచునని చెప్పెను.
Cross references
- Matthew 20:17–19 మత్తయి 20:17–19యేసు యెరూషలేమునకు వెళ్లనైయున్నప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులను ఏకాంతముగా తీసికొనిపోయి, మార్గమందు వారితో ఇట్లనెను. ఇదిగో యెరూషలేమునకు వెళ్లుచున్నాము; అక్కడ మనుష్యకుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించు టకును కొరడాలతో కొట్టుటకును సిలువవేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు; మూడవ దినమున ఆయన మరల లేచును.
- Isaiah 53:1–12 యెషయా 53:1–12మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేతమొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయనయెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు. అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతివిు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితివిు. మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది. మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱెపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు. అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలో చించినవారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసినవారినిగూర్చి విజ్ఞాపనముచేసెను
- Mark 10:32–34 మార్కు 10:32–34వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్లుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయ మొందిరి, వెంబడించువారు భయపడిరి. అప్పుడాయన మరల పండ్రెండుగురు శిష్యులను పిలుచుకొని, తనకు సంభవింపబోవువాటిని వారికి తెలియజెప్పనారంభించి ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్లుచున్నాము; మనుష్య కుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింప బడును; వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్య జనుల కప్పగించెదరు. వారు ఆయనను అపహసించి, ఆయన మీద ఉమ్మివేసి, కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు; మూడు దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను.
- Psalm 22:1–31 కీర్తనలు 22:1–31నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు? నా దేవా, పగలు నేను మొఱ్ఱపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుట లేదు అయినను నీవు నా కుత్తరమియ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రములమీద ఆసీనుడవై యున్నావు. మా పితరులు నీయందు నమ్మిక యుంచిరి వారు నీయందు నమ్మిక యుంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొఱ్ఱపెట్టి విడుదల నొందిరి నీయందు నమ్మిక యుంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను నేను పురుగును నరులచేత నిందింపబడినవాడను ప్రజలచేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచువారందరు పెదవులు విరిచి తల ఆడిం చుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవామీద నీ భారము మోపుము ఆయన వానిని విడిపించునేమోవాడు ఆయనకు ఇష్టుడు గదా ఆయన వానిని తప్పించు నేమో అందురు. గర్భమునుండి నన్ను తీసినవాడవు నీవే గదా నేను నా తల్లియొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చియున్నది, సహాయము చేయువాడెవడును లేడు నాకు దూరముగా నుండకుము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని యున్నవి బాషానుదేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి యున్నవి. చీల్చుచును గర్జించుచునుండు సింహమువలె వారు నోళ్లు తెరచుచున్నారు నేను నీళ్లవలె పారబోయబడి యున్నాను నా యెముకలన్నియు స్థానము తప్పియున్నవినా హృదయము నా అంతరంగమందు మైనమువలె కరగియున్నది. నా బలము యెండిపోయి చిల్లపెంకువలె ఆయెను నా నాలుక నా దౌడను అంటుకొని యున్నదినీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి యున్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని యున్నవి దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారువారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు. నా యెముకలన్నియు నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరముగా నుండకుము నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము. ఖడ్గమునుండి నా ప్రాణమును కుక్కల బలమునుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోటనుండి నన్ను రక్షింపుము గురుపోతుల కొమ్ములలోనుండి నన్ను రక్షించి నాకుత్తరమిచ్చి యున్నావు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను సమాజమధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవాయందు భయభక్తులు గలవారలారా, ఆయ నను స్తుతించుడి యాకోబు వంశస్థులారా, మీరందరు ఆయనను ఘన పరచుడి ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరు ఆయనకు భయపడుడి ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించెను. మహా సమాజములో నిన్నుగూర్చి నేను కీర్తన పాడెదను ఆయనయందు భయభక్తులు గలవారియెదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనముచేసి తృప్తిపొందెదరు యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రదుకును. భూదిగంతముల నివాసులందరు జ్ఞాపకము చేసికొని యెహోవాతట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరు నీ సన్నిధిని నమస్కారము చేసెదరు రాజ్యము యెహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే. భూమిమీద వర్థిల్లుచున్నవారందరు అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరుతమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరు ఆయన సన్నిధిని మోకరించెదరు ఒక సంతతివారు ఆయనను సేవించెదరు రాబోవుతరమునకు ప్రభువునుగూర్చి వివరింతురు. వారు వచ్చిఆయన దీని చేసెనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురుఆయన నీతిని వారికి ప్రచురపరతురు.
- Matthew 16:21 మత్తయి 16:21అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్లిపెద్దలచేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా
- Luke 24:44–46 లూకా 24:44–46అంతట ఆయన–మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడిన వన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి మూడవ దిన మున మృతులలోనుండి లేచుననియు
- Luke 9:51 లూకా 9:51ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణ మగుచున్నప్పుడు
- Zechariah 13:7 జెకర్యా 13:7ఖడ్గమా, నా గొఱ్ఱెల కాపరిమీదను నా సహకారి మీదను పడుము; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కుగొఱ్ఱెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారిమీద నేను నా హస్తమునుంచుదును; ఇదే యెహోవా వాక్కు.
- Luke 9:22 లూకా 9:22మనుష్యకుమారుడు బహు శ్రమలు పొంది, పెద్దల చేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను విసర్జింపబడి, చంపబడి, మూడవ దినమున లేచుట అగత్య మని చెప్పెను.
- Mark 8:30–31 మార్కు 8:30–31అప్పుడు తన్ను గూర్చిన యీ సంగతి ఎవని తోను చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పెను. మరియు మనుష్యకుమారుడు అనేక హింసలుపొంది, పెద్దల చేతను ప్రధానయాజకుల చేతను శాస్త్రులచేతను ఉపేక్షింప బడి చంపబడి, మూడు దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింప నారంభించెను.
- Daniel 9:26 దానియేలు 9:26ఈ అరువది రెండు వారములు జరిగిన పిమ్మట ఏమియు లేకుండ అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు, వాని అంతము హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధకాలాంతమువరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను.
- Psalm 69:1–36 కీర్తనలు 69:1–36దేవా, జలములు నా ప్రాణముమీద పొర్లుచున్నవి నన్ను రక్షింపుము. నిలుక యియ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను అగాధ జలములలో నేను దిగబడియున్నాను వరదలు నన్ను ముంచివేయుచున్నవి. నేను మొఱ్ఱపెట్టుటచేత అలసియున్నాను నా గొంతుక యెండిపోయెను నా దేవునికొరకు కనిపెట్టుటచేత నా కన్నులు క్షీణించిపోయెను. నిర్నిమిత్తముగా నామీద పగపట్టువారు నా తలవెండ్రుకలకంటె విస్తారముగా ఉన్నారు అబద్ధమునుబట్టి నాకుశత్రువులై నన్ను సంహరింప గోరువారు అనేకులు నేను దోచుకొననిదానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసేయున్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు. ప్రభువా, సైన్యములకధిపతివగు యెహోవా, నీకొరకు కనిపెట్టుకొనువారికి నావలన సిగ్గు కలుగ నియ్యకుము ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదకువారిని నావలన అవమానము నొంద నియ్యకుము. నీ నిమిత్తము నేను నిందనొందినవాడనైతిని నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. నా సహోదరులకు నేను అన్యుడనైతిని నా తల్లి కుమారులకు పరుడనైతిని. నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది నిన్ను నిందించినవారి నిందలు నామీద పడియున్నవి. ఉపవాసముండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయెను. నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని. గుమ్మములలో కూర్చుండువారు నన్నుగూర్చి మాట లాడుకొందురు త్రాగుబోతులు నన్నుగూర్చి పాటలు పాడుదురు. యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపాబాహుళ్యమునుబట్టి నీ రక్షణ సత్యమునుబట్టి నాకుత్తరమిమ్ము. నేను దిగిపోకుండ ఊబిలోనుండి నన్ను తప్పించుము నా పగవారిచేతిలోనుండి అగాధజలములలోనుండి నన్ను తప్పించుము. నీటివరదలు నన్ను ముంచనియ్యకుము అగాధసముద్రము నన్ను మింగనియ్యకుము గుంట నన్ను మింగనియ్యకుము. యెహోవా, నీ కృప ఉత్తమత్వమునుబట్టి నాకు ఉత్తర మిమ్ము నీ వాత్సల్యబాహుళ్యతనుబట్టి నాతట్టు తిరుగుము. నీ సేవకునికి విముఖుడవై యుండకుము నేను ఇబ్బందిలోనున్నాను త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నాయొద్దకు సమీపించి నన్ను విమోచింపుము. నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగెననినీకు తెలిసియున్నది. నా విరోధులందరు నీకు కనబడుచున్నారు. నిందకు నా హృదయము బద్దలాయెను నేను బహుగా కృశించియున్నాను కరుణించువారికొరకు కనిపెట్టుకొంటినిగాని యెవరును లేకపోయిరి. ఓదార్చువారికొరకు కనిపెట్టుకొంటినిగాని యెవరును కానరారైరి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పియైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. వారి భోజనము వారికి ఉరిగా నుండును గాక వారు నిర్భయులై యున్నప్పుడు అది వారికి ఉరిగా నుండును గాక. వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మును గాక వారి నడుములకు ఎడతెగని వణకు పుట్టించుము. వారిమీద నీ ఉగ్రతను కుమ్మరించుము నీ కోపాగ్ని వారిని పట్టుకొనును గాక వారి పాళెము పాడవును గాక వారి గుడారములలో ఎవడును ఉండకపోవును గాక నీవు మొత్తినవానిని వారు తరుముచున్నారు నీవు గాయపరచినవారి వేదనను వివరించుచున్నారు. దోషముమీద దోషము వారికి తగులనిమ్ము నీ నీతి వారికి అందనీయకుము. జీవగ్రంథములోనుండి వారి పేరును తుడుపు పెట్టుము నీతిమంతుల పట్టీలో వారి పేరులు వ్రాయకుము. నేను బాధపడినవాడనై వ్యాకులపడుచున్నాను దేవా, నీ రక్షణ నన్ను ఉద్ధరించును గాక. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను ఘనపరచెదను ఎద్దుకంటెను, కొమ్ములును డెక్కలునుగల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము బాధపడువారు దాని చూచి సంతోషించుదురు దేవుని వెదకువారలారా, మీ ప్రాణము తెప్పరిల్లును గాక. యెహోవా దరిద్రుల మొఱ్ఱ ఆలకించువాడు ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించు వాడు కాడు. భూమ్యాకాశములు ఆయనను స్తుతించును గాక సముద్రములును వాటియందు సంచరించు సమస్త మును ఆయనను స్తుతించును గాక. దేవుడు సీయోనును రక్షించును ఆయన యూదా పట్టణములను కట్టించును జనులు అక్కడ నివసించెదరు అది వారివశమగును. ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించు కొనును ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించెదరు.