Luke · chapter 23 · verse 45
Luke 23:45 in Telugu
సూర్యుడు అదృశ్యుడాయెను; గర్భా లయపు తెర నడిమికి చినిగెను.
Sooryudu adrushyudaayenu; garbhaa layapu tera nadimiki chinigenu.
Luke 23:45 in English
- King James Version (KJV)
- And the sun was darkened, and the veil of the temple was rent in the midst.
- World English Bible (WEB)
- The sun was darkened, and the veil of the temple was torn in two.
- American Standard Version (ASV)
- the sun’s light failing: and the veil of the temple was rent in the midst.
- Bible in Basic English (BBE)
- The light of the sun went out, and the curtain in the Temple was parted in two.
- Darby Translation (DBY)
- And the sun was darkened, and the veil of the temple rent in the midst.
- Webster's Bible (WBS)
- And the sun was darkened, and the vail of the temple was rent in the midst.
- Young's Literal Translation (YLT)
- and the sun was darkened, and the vail of the sanctuary was rent in the midst,
Read in context
- 43అందు కాయన వానితోనేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా ననెను.
- 44అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటిమీద చీకటి కమ్మెను;
- 45సూర్యుడు అదృశ్యుడాయెను; గర్భా లయపు తెర నడిమికి చినిగెను.
- 46అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి - తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను.
- 47శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై యుండెనని చెప్పి దేవుని మహిమపరచెను.
Cross references
- Hebrews 10:19–22 హెబ్రీయులకు 10:19–22సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను, దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునై యుండి, విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్ని ధానమునకు చేరుదము.
- Matthew 27:51 మత్తయి 27:51అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను; భూమి వణకెను; బండలు బద్దలాయెను;
- Hebrews 9:3–8 హెబ్రీయులకు 9:3–8రెండవ తెరకు ఆవల అతిపరిశుద్ధస్థలమను గుడారముండెను. అందులో సువర్ణధూపార్తియు, అంతటను బంగారురేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతికఱ్ఱయు,, నిబంధన పలకలును ఉండెను. దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటినిగూర్చి యిప్పుడు వివరముగా చెప్ప వల్లపడదు. ఇవి ఈలాగు ఏర్పరచబడి నప్పుడు యాజకులు సేవచేయుచు, నిత్యమును ఈ మొదటి గుడారములోనికి వెళ్లుదురు గాని సంవత్సరమునకు ఒక్క సారి మాత్రమే ప్రధాన యాజకుడొక్కడే రక్తముచేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తనకొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడర్పించును. దీనినిబట్టి ఆ మొదటి గుడార మింక నిలుచుచుండగా అతిపరిశుద్ధస్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయు చున్నాడు.
- Mark 15:38 మార్కు 15:38అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు రెండుగా చినిగెను.
- Ephesians 2:14–18 ఎఫెసీయులకు 2:14–18ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను. ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి, తన సిలువవలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధానపరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రిసన్నిధికి చేరగలిగియున్నాము.
- Leviticus 16:12–16 లేవీయకాండము 16:12–16యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీదనుండి ధూపార్తెడు నిప్పులను, తన పిడికెళ్లతో పరి మళధూపచూర్ణమును తీసికొని అడ్డతెరలోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు, యెహోవా సన్నిధిని ఆ అగ్నిమీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను. అప్పుడతడు ఆ కోడెరక్తములో కొంచెము తీసికొని తూర్పుప్రక్కను కరుణాపీఠముమీద తన వ్రేలితో ప్రోక్షించి, కరుణాపీఠము ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలెను. అప్పుడతడు ప్రజలర్పించు పాపపరిహారార్ధబలియగు మేకను వధించి అడ్డ తెరలోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడెరక్త ముతో చేసినట్లు దీని రక్తముతోను చేసి, కరుణాపీఠము మీదను కరుణాపీఠము ఎదుటను దాని ప్రోక్షింపవలెను. అట్లు అతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టియు, అనగా వారి అపవిత్రతను బట్టియు, వారి అతి క్రమములనుబట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారిమధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్ర మగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను.
- Hebrews 6:19 హెబ్రీయులకు 6:19ఈ నిరీక్షణ నిశ్చలమును, స్థిరమునై, మన ఆత్మకు లంగరువలెనుండి తెరలోపల ప్రవేశించుచున్నది.
- 2 Chronicles 3:14 2 దినవృత్తాంతములు 3:14అతడు నీలి నూలుతోను ఊదా నూలుతోను ఎఱ్ఱ నూలుతోను సన్నపు నారనూలుతోను ఒక తెరను చేయించి దానిమీద కెరూబులను కుట్టించెను.