Luke · chapter 5 · verse 6
Luke 5:6 in Telugu
వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా
Vaaraalaagu chesi vistaaramaina chepalu pattiri, anducheta vaari valalu pigilipovuchundagaa
Luke 5:6 in English
- King James Version (KJV)
- And when they had this done, they inclosed a great multitude of fishes: and their net brake.
- World English Bible (WEB)
- When they had done this, they caught a great multitude of fish, and their net was breaking.
- American Standard Version (ASV)
- And when they had done this, they inclosed a great multitude of fishes; and their nets were breaking;
- Bible in Basic English (BBE)
- And when they had done this, they got such a great number of fish that it seemed as if their nets would be broken;
- Darby Translation (DBY)
- And having done this, they enclosed a great multitude of fishes. And their net broke.
- Webster's Bible (WBS)
- And when they had done this, they inclosed a great multitude of fishes: and their net broke.
- Young's Literal Translation (YLT)
- And having done this, they enclosed a great multitude of fishes, and their net was breaking,
Read in context
- 4ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా
- 5సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితివిు గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను.
- 6వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా
- 7వారు వేరొక దోనె లోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి; వారు వచ్చి రెండు దోనెలు మునుగునట్లు నింపిరి.
- 8సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్లయెదుట సాగిలపడి ప్రభువా, నన్నువిడిచి పొమ్ము, నేను పాపాత్ముడ నని చెప్పెను.
Cross references
- 1 Corinthians 15:58 1 కొరింథీయులకు 15:58కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.
- John 21:6–11 యోహాను 21:6–11లేదని వారాయనతో చెప్పిరి. అప్పుడాయనదోనె కుడిప్రక్కను వల వేయుడి మీకు దొరుకునని చెప్పెను గనుక వారాలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని, వస్త్రహీనుడై యున్నందున పైబట్టవేసి సముద్రములో దుమికెను. దరి యించుమించు ఇన్నూరు మూరల దూర మున్నందున తక్కిన శిష్యులు చేపలుగల వల లాగుచు ఆ చిన్న దోనెలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులును వాటిమీద ఉంచబడిన చేపలును రొట్టెయు కనబడెను. యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసికొని రండని వారితో చెప్పగా సీమోను పేతురు దోనె ఎక్కి వలను దరికిలాగెను; అది నూట ఏబది మూడు గొప్ప చేపలతో నిండియుండెను;
- Ecclesiastes 11:6 ప్రసంగి 11:6ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తియ్యక విత్తుము, అది ఫలించునో యిది ఫలించునో లేక రెండును సరిసమానముగా ఎదుగునో నీ వెరుగవు.
- 2 Kings 4:3–7 2 రాజులు 4:3–7అతడునీవు బయటికి పోయి, నీ యిరుగు పొరుగు వారందరియొద్ద దొరుకగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరవు పుచ్చుకొనుము; అప్పుడు నీవు నీ యింటిలోకి వచ్చి నీవును నీ కుమారులును లోపల నుండి తలుపుమూసి, ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి, నిండినవి యొకతట్టున ఉంచుమని ఆమెతో సెలవియ్యగా ఆమె అతని యొద్దనుండి పోయి, తానును కుమారులును లోపలనుండి తలుపుమూసి, కువ రులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నియు నిండిన తరువాత ఇంక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడుమరేమియు లేవని చెప్పెను. అంతలొనూనె నిలిచి పోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడునీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలినదానితో నీవును నీ పిల్లలును బ్రదుకుడని ఆమెతో చెప్పెను.
- Galatians 6:9 గలతీయులకు 6:9మనము మేలుచేయుటయందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంట కోతుము.