Luke · chapter 6 · verse 16
Luke 6:16 in Telugu
యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా అను వారు.
Yaakobu sahodarudaina yoodaa, drohiyagu iskariyotu yoodaa anu vaaru.
Luke 6:16 in English
- King James Version (KJV)
- And Judas [the brother] of James, and Judas Iscariot, which also was the traitor.
- World English Bible (WEB)
- Judas the son of James; and Judas Iscariot, who also became a traitor.
- American Standard Version (ASV)
- and Judas [the son] of James, and Judas Iscariot, who became a traitor;
- Bible in Basic English (BBE)
- And Judas, the son of James, and Judas Iscariot, he who was false to him.
- Darby Translation (DBY)
- [and] Judas [brother] of James, and Judas Iscariote, who was also [his] betrayer;
- Webster's Bible (WBS)
- And Judas [the brother] of James, and Judas Iscariot, who also was the traitor.
- Young's Literal Translation (YLT)
- Judas of James, and Judas Iscariot, who also became betrayer;)
Read in context
- 14వీరెవరనగా ఆయన ఎవనికి పేతురు అను మారుపేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి,
- 15మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను,
- 16యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా అను వారు.
- 17ఆయన వారితో కూడ దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును, ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుట కును యూదయ దేశమంతటినుండియు, యెరూషలేము నుండియు, తూరు సీదోనను పట్టణముల సముద్ర తీరముల నుండియు వచ్చిన బహుజనసమూహ మును,
- 18అపవిత్రాత్మల చేత బాధింపబడినవారును వచ్చి స్వస్థతనొందిరి.
Cross references
- John 6:70–71 యోహాను 6:70–71అందుకు యేసు నేను మిమ్మును పండ్రెండుగురిని ఏర్పరచు కొనలేదా? మీలో ఒకడు సాతాను అనివారితో చెప్పెను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా పండ్రెండు మందిలో ఒకడైయుండి ఆయన నప్పగింపబోవు చుండెను గనుక వానిగూర్చియే ఆయన ఈ మాట చెప్పెను.
- Jude 1:1 యూదా 1:1యేసుక్రీస్తు దాసుడును, యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడినవారికి శుభమని చెప్పి వ్రాయునది.
- Matthew 27:3–5 మత్తయి 27:3–5అప్పుడాయనను అప్పగించిన యూదా, ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి, ఆ ముప్పది వెండి నాణములు ప్రధానయాజకులయొద్దకును పెద్దలయొద్దకును మరల తెచ్చి నేను నిరపరాధరక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారుదానితో మాకేమి? నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణ ములు దేవాలయములో పారవేసి, పోయి ఉరిపెట్టు కొనెను.
- Matthew 26:14–16 మత్తయి 26:14–16అప్పుడు పండ్రెండుమందిలో నొకడగు ఇస్కరియోతు యూదా, ప్రధానయాజకులయొద్దకు వెళ్లి నేనాయనను మీకప్పగించినయెడల నాకేమి ఇత్తురని వారినడిగెను. అందుకు వారు ముప్పది వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటినుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టు చుండెను.
- John 14:22 యోహాను 14:22ఇస్కరియోతు కాని యూదా ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరచుకొనుటకేమి సంభవించెనని అడుగగా
- Mark 3:18 మార్కు 3:18అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను,
- Matthew 10:3 మత్తయి 10:3ఫిలిప్పు, బర్తొలొమయి; తోమా, సుంకరియైన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయియను మారుపేరుగల లెబ్బయి;
- Acts 1:25 అపొస్తలుల కార్యములు 1:25తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన యీ పరిచర్యలోను అపొస్తలత్వములోను పాలుపొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనినవానిని కనబరచుమనిరి.
- Acts 1:16–20 అపొస్తలుల కార్యములు 1:16–20సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదానుగూర్చి పరిశుద్ధాత్మ దావీదుద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి యుండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడినవాడై యీ పరిచర్యలో పాలుపొందెను. ఈ యూదా ద్రోహమువలన సంపాదించిన రూకల నిచ్చి యొక పొలము కొనెను. అతడు తలక్రిందుగాపడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నియు బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికందరికి తెలియ వచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అనబడియున్నది; దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని యిల్లు పాడైపోవునుగాక దానిలో ఎవడును కాపురముండక పోవునుగాక అతని యుద్యోగము వేరొకడు తీసికొనునుగాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడియున్నది.