Luke · chapter 6 · verse 27
Luke 6:27 in Telugu
వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలు చేయుడి,
Vinuchunna meeto nenu cheppunademanagaa mee shatruvulanu preminchudi, mimmunu dveshinchuvaariki melu cheyudi,
Luke 6:27 in English
- King James Version (KJV)
- But I say unto you which hear, Love your enemies, do good to them which hate you,
- World English Bible (WEB)
- “But I tell you who hear: love your enemies, do good to those who hate you,
- American Standard Version (ASV)
- But I say unto you that hear, Love your enemies, do good to them that hate you,
- Bible in Basic English (BBE)
- But I say to you who give ear to me, Have love for those who are against you, do good to those who have hate for you,
- Darby Translation (DBY)
- But to you that hear I say, Love your enemies; do good to those that hate you;
- Webster's Bible (WBS)
- But I say to you who hear, Love your enemies, do good to them who hate you,
- Young's Literal Translation (YLT)
- 'But I say to you who are hearing, Love your enemies, do good to those hating you,
Read in context
- 25అయ్యో యిప్పుడు (కడుపు) నిండియున్న వారలారా, మీరాకలిగొందురు. అయ్యో యిప్పుడు నవ్వుచున్నవారలారా, మీరు దుఃఖించి యేడ్తురు.
- 26మనుష్యులందరు మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ; వారి పితరులు అబద్ధప్రవక్తలకు అదే విధముగా చేసిరి.
- 27వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలు చేయుడి,
- 28మిమ్మును శపించువారిని దీవించుడి, మిమ్మును బాధించువారికొరకు ప్రార్థనచేయుడి.
- 29నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంపకూడ త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తికొని పోవువానిని, నీ అంగీని కూడ ఎత్తి కొనిపోకుండ అడ్డగింపకుము.
Cross references
- 1 Thessalonians 5:15 1 థెస్సలొనీకయులకు 5:15ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి;మీరు ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి.
- Luke 6:35 లూకా 6:35మీరైతే ఎట్టి వారిని గూర్చియైనను నిరాశ చేసికొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలుచేయుడి, అప్పు ఇయ్యుడి; అప్పుడు మీ ఫలము గొప్పదైయుండును, మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు. ఆయన, కృతజ్ఞతలేనివారియెడ లను దుష్టులయెడలను ఉపకారియై యున్నాడు.
- Romans 12:17–21 రోమీయులకు 12:17–21కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యు లందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగి యుండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది. కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.
- Proverbs 24:17 సామెతలు 24:17నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము వాడు తొట్రిల్లినప్పుడు నీవు మనస్సున నుల్లసింపకుము.
- Proverbs 25:21–22 సామెతలు 25:21–22నీ పగవాడు ఆకలిగొనినయెడల వానికి భోజనము పెట్టుము దప్పిగొనినయెడల వానికి దాహమిమ్ము అట్లు చేయుటచేత వాని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును.
- Matthew 5:43–45 మత్తయి 5:43–45నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా; నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతి మంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.
- Galatians 6:10 గలతీయులకు 6:10కాబట్టి మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేష ముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము.
- Mark 4:24 మార్కు 4:24మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును, మరి ఎక్కువగా మీ కియ్యబడును.
- Exodus 23:4–5 నిర్గమకాండము 23:4–5నీ శత్రువుని యెద్దయినను గాడిదయైనను తప్పిపోవు చుండగా అది నీకు కనబడినయెడల అగత్యముగా దాని తోలుకొనివచ్చి వాని కప్పగింపవలెను. నీవు నీ పగవాని గాడిద బరువుక్రింద పడియుండుట చూచి, దానినుండి తప్పింపకయుందునని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాని విడిపింపవలెను.
- Luke 23:34 లూకా 23:34యేసు తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లువేసిరి.
- 3 John 1:11 3 యోహాను 1:11ప్రియుడా, చెడుకార్య మును కాక మంచికార్యము ననుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడుచేయువాడు దేవుని చూచినవాడుకాడు.
- Acts 10:38 అపొస్తలుల కార్యములు 10:38అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెనను నదియే. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాదిచేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను.