Luke · chapter 7 · verse 13
Luke 7:13 in Telugu
ప్రభువు ఆమెను చూచి ఆమెయందుకనికరపడి - ఏడువవద్దని ఆమెతో చెప్పి, దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి.
Prabhuvu aamenu choochi aameyandukanikarapadi - eduvavaddani aameto cheppi, daggaraku vachchi paadenu muttagaa moyuchunnavaaru nilichiri.
Luke 7:13 in English
- King James Version (KJV)
- And when the Lord saw her, he had compassion on her, and said unto her, Weep not.
- World English Bible (WEB)
- When the Lord saw her, he had compassion on her and said to her, “Don’t cry.”
- American Standard Version (ASV)
- And when the Lord saw her, he had compassion on her, and said unto her, Weep not.
- Bible in Basic English (BBE)
- And when the Lord saw her, he had pity on her and said to her, Be not sad.
- Darby Translation (DBY)
- And the Lord, seeing her, was moved with compassion for her, and said to her, Weep not;
- Webster's Bible (WBS)
- And when the Lord saw her, he had compassion on her, and said to her, Weep not.
- Young's Literal Translation (YLT)
- And the Lord having seen her, was moved with compassion towards her, and said to her, 'Be not weeping;'
Read in context
- 11వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్లు చుండగా, ఆయన శిష్యులును బహు జనసమూహమును ఆయనతో కూడ వెళ్లుచుండిరి.
- 12ఆయన ఆ ఊరి గవినియొద్దకు వచ్చి నప్పుడు, చనిపోయిన యొకడు వెలుపలికి మోసికొని పోబడుచుండెను; అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు; ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడ ఉండిరి.
- 13ప్రభువు ఆమెను చూచి ఆమెయందుకనికరపడి - ఏడువవద్దని ఆమెతో చెప్పి, దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి.
- 14ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా
- 15ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను; ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను.
Cross references
- Isaiah 63:9 యెషయా 63:9వారి యావద్బాధలో ఆయన బాధనొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమచేతను తాలిమిచేతను వారిని విమోచించెను పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను.
- Psalm 103:13 కీర్తనలు 103:13తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును.
- Lamentations 3:32–33 విలాపవాక్యములు 3:32–33ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధినిబట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు.
- Hebrews 4:15 హెబ్రీయులకు 4:15మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.
- Psalm 86:15 కీర్తనలు 86:15ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములుగల దేవుడవు ధీర్ఘశాంతుడవు కృపాసత్యములతో నిండినవాడవు
- Jeremiah 31:20 యిర్మీయా 31:20ఎఫ్రాయిము నా కిష్టమైన కుమారుడా? నాకు ముద్దు బిడ్డా? నేనతనికి విరోధముగ మాటలాడునప్పుడెల్ల అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది, అతనిగూర్చి నా కడుపులో చాలా వేదనగా నున్నది, తప్పక నేనతని కరుణింతును; ఇదే యెహోవా వాక్కు.
- Luke 8:52 లూకా 8:52అందరును ఆమె నిమిత్తమై యేడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా, ఆయన వారితో - ఏడ్వవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చప్పెను.
- Psalm 86:5 కీర్తనలు 86:5ప్రభువా, నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు నీకు మొఱ్ఱపెట్టువారందరియెడల కృపాతిశయము గల వాడవు.
- John 11:33–35 యోహాను 11:33–35ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని నెక్కడ నుంచితిరని అడుగగా, వారుప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను.
- Hebrews 2:17 హెబ్రీయులకు 2:17కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్నివిషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను.
- John 20:15 యోహాను 20:15యేసు అమ్మా, యందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెదకు చున్నావు? అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా, నీవు ఆయనను మోసికొని పొయినయెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తికొని పోదునని చెప్పెను.
- Judges 10:16 న్యాయాధిపతులు 10:16యెహోవాను సేవింపవలెనని తమ మధ్యనుండి అన్యదేవతలను తొలగింపగా, ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేక పోయెను.