Lamentations · chapter 3 · verse 32
Lamentations 3:32 in Telugu
ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధినిబట్టి జాలిపడును.
Aayana baadhapettinanu tana krupaasamruddhinibatti jaalipadunu.
Lamentations 3:32 in English
- King James Version (KJV)
- But though he cause grief, yet will he have compassion according to the multitude of his mercies.
- World English Bible (WEB)
- For though he causes grief, yet he will have compassion according to the multitude of his loving kindnesses.
- American Standard Version (ASV)
- For though he cause grief, yet will he have compassion according to the multitude of his lovingkindnesses.
- Bible in Basic English (BBE)
- For though he sends grief, still he will have pity in the full measure of his love.
- Darby Translation (DBY)
- but if he have caused grief, he will have compassion according to the multitude of his loving-kindnesses:
- Webster's Bible (WBS)
- But though he causeth grief, yet will he have compassion according to the multitude of his mercies.
- Young's Literal Translation (YLT)
- For though He afflicted, yet He hath pitied, According to the abundance of His kindness.
Read in context
- 30అతడు తన్ను కొట్టువానితట్టు తన చెంపను త్రిప్ప వలెను. అతడు నిందతో నింపబడవలెను
- 31ప్రభువు సర్వకాలము విడనాడడు.
- 32ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధినిబట్టి జాలిపడును.
- 33హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు.
- 34దేశమునందు చెరపట్టబడినవారినందరిని కాళ్లక్రింద త్రొక్కుటయు
Cross references
- Psalm 78:38 కీర్తనలు 78:38అయితే ఆయన వాత్సల్యసంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించు వాడు. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణచుకొనువాడు.
- Psalm 30:5 కీర్తనలు 30:5ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి, రాత్రి యుండినను ఉదయమున సంతోషము కలుగును.
- Psalm 103:11 కీర్తనలు 103:11భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనయందు భయభక్తులు గలవారియెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది.
- Psalm 106:43–45 కీర్తనలు 106:43–45అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగు బాటు చేయుచువచ్చిరి. తమ దోషముచేత హీనదశనొందిరి. అయినను వారిరోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను తన కృపాబాహుళ్యమునుబట్టి వారిని కరుణించెను.
- Judges 10:16 న్యాయాధిపతులు 10:16యెహోవాను సేవింపవలెనని తమ మధ్యనుండి అన్యదేవతలను తొలగింపగా, ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేక పోయెను.
- Hosea 11:8 హోషేయ 11:8ఎఫ్రాయిమూ, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలూ, నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మానువలె నిన్ను నేను ఎట్లు చేతును? సెబో యీమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును? నా మనస్సు మారినది, సహింపలేకుండ నా యంతరంగము మండు చున్నది.
- Exodus 3:7 నిర్గమకాండము 3:7మరియు యెహోవా యిట్లనెను - నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టువారినిబట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి.
- Luke 15:20 లూకా 15:20వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను.
- Jeremiah 31:20 యిర్మీయా 31:20ఎఫ్రాయిము నా కిష్టమైన కుమారుడా? నాకు ముద్దు బిడ్డా? నేనతనికి విరోధముగ మాటలాడునప్పుడెల్ల అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది, అతనిగూర్చి నా కడుపులో చాలా వేదనగా నున్నది, తప్పక నేనతని కరుణింతును; ఇదే యెహోవా వాక్కు.
- 2 Kings 13:23 2 రాజులు 13:23గాని యెహోవా వారిమీద జాలిపడి వారియందు దయయుంచి, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసియున్ననిబంధననుబట్టి వారియందు లక్ష్యము నిలిపి, వారిని నాశము చేయనొల్లక యిప్పటికిని తన సముఖములోనుండి వారిని వెళ్లగొట్టక యుండెను.
- Lamentations 3:22 విలాపవాక్యములు 3:22యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము.
- Exodus 2:23 నిర్గమకాండము 2:23ఆలాగున అనేక దినములు జరిగినమీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులనుబట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టు చుండగా, తమ వెట్టి పనులనుబట్టి వారుపెట్టిన మొర దేవునియొద్దకు చేరెను.