Malachi · chapter 1 · verse 9
Malachi 1:9 in Telugu
దేవుడు మనకు కటా క్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి; మీ చేతనే గదా అది జరిగెను. ఆయన మిమ్మునుబట్టి యెవరినైన అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు.
Devudu manaku kataa kshamu choopunatlu aayananu shaantiparachudi; mee chetane gadaa adi jarigenu. Aayana mimmunubatti yevarinaina angeekarinchunaa? Ani sainyamulaku adhipatiyagu yehovaa aduguchunnaadu.
Malachi 1:9 in English
- King James Version (KJV)
- And now, I pray you, beseech God that he will be gracious unto us: this hath been by your means: will he regard your persons? saith the LORD of hosts.
- World English Bible (WEB)
- “Now, please entreat the favor of God, that he may be gracious to us. With this, will he accept any of you?” says the LORD of Armies.
- American Standard Version (ASV)
- And now, I pray you, entreat the favor of God, that he may be gracious unto us: this hath been by your means: will he accept any of your persons? saith Jehovah of hosts.
- Bible in Basic English (BBE)
- And now, make request for the grace of God so that he may have mercy on us: this has been your doing: will he give his approval to any of you? says the Lord of armies.
- Darby Translation (DBY)
- And now, I pray you, beseech God that he will be gracious unto us. This hath been of your hand: will he accept any of your persons? saith Jehovah of hosts.
- Webster's Bible (WBS)
- And now, I pray you, beseech God that he will be gracious to us: this hath been by your means: will he regard your person? saith the LORD of hosts.
- Young's Literal Translation (YLT)
- And now, appease, I pray thee, the face of God, And He doth favour us; From your own hand hath this been, Doth He accept of you appearances? Said Jehovah of Hosts.
Read in context
- 7నా బలి పీఠముమీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరచితిమని మీరందురు. యెహోవా భోజనపుబల్లను నీచపరచినందుచేతనే గదా
- 8గ్రుడ్డిదానిని తీసికొని బలిగా అర్పించినయెడల అది దోషముకాదా? కుంటిదానినైనను రోగముగలదానినైనను అర్పించిన యెడల అది దోషముకాదా? అట్టివాటిని నీ యధికారికి నీవిచ్చిన యెడల అతడు నీకు దయచూపునా? నిన్ను అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు.
- 9దేవుడు మనకు కటా క్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి; మీ చేతనే గదా అది జరిగెను. ఆయన మిమ్మునుబట్టి యెవరినైన అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు.
- 10మీలో ఒకడు నా బలిపీఠముమీద నిరర్థకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మూయువాడొకడు మీలో ఉండినయెడల మేలు; మీయందు నాకిష్టములేదు, మీచేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- 11తూర్పుదిశ మొదలుకొని పడమటి దిశవరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచ బడును, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన యర్పణయును అర్పింపబడును, అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
Cross references
- 1 Peter 1:17 1 పేతురు 1:17పక్షపాతము లేకుండ క్రియలనుబట్టి ప్రతివానిని తీర్పుతీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థనచేయుచున్నారు గనుక మీరు పరదేశులై యున్నంతకాలము భయముతో గడుపుడి.
- John 9:31 యోహాను 9:31దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము; ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తముచొప్పున జరిగించినయెడల ఆయన వాని మనవి ఆలకించును.
- Exodus 32:11 నిర్గమకాండము 32:11మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొనియెహోవా, నీవు మహాశక్తివలన బాహుబలము వలన ఐగుప్తు దేశములోనుండి రప్పించిన నీ ప్రజలమీద నీ కోపము మండనేల?
- Jeremiah 27:18 యిర్మీయా 27:18వారు ప్రవక్తలైనయెడల, యెహోవా వాక్కు వారికి తోడైయుండినయెడల, యెహోవా మందిరములోను యూదారాజు మందిరములోను యెరూషలేములోను శేషించియుండు ఉపకరణములు బబులోనునకు కొనిపోబడకుండునట్లు వారు సైన్యములకధిపతియగు యెహోవాను బతిమాలుకొనుట మేలు.
- Hebrews 7:26–27 హెబ్రీయులకు 7:26–27పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశ మండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మ శాస్త్రము బలహీనతగల మనుష్యులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధిపొందిన కుమారుని నియమించెను గనుక,
- Romans 2:11 రోమీయులకు 2:11దేవునికి పక్షపాతములేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసినవారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు;
- Jeremiah 26:19 యిర్మీయా 26:19అట్లు పలికి నందున యూదారాజైన హిజ్కియాయైనను యూదా జనులందరిలో మరి ఎవడైనను అతని చంపిరా? యెహోవా వారికి చేసెదనని తాను చెప్పిన కీడును చేయక సంతాప పడునట్లు రాజు యెహోవాయందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనెను గదా? మనము ఈ కార్యము చేసినయెడల మనమీదికే గొప్ప కీడు తెచ్చు కొందుము అని చెప్పిరి.
- 2 Chronicles 30:27 2 దినవృత్తాంతములు 30:27అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారిమాటలు వినబడెను; వారి ప్రార్థన ఆకాశముననున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను.
- Acts 19:15–16 అపొస్తలుల కార్యములు 19:15–16అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలునుకూడ ఎరుగుదును, గాని మీరెవరని అడుగగా ఆ దయ్యముపట్టినవాడు ఎగిరి, వారిమీద పడి, వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను; అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ యింటనుండి పారిపోయిరి.
- Lamentations 2:19 విలాపవాక్యములు 2:19నీవు లేచి రేయి మొదటి జామున మొఱ్ఱపెట్టుము నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణముకొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధిమొగను అకలిగొని వారు మూర్ఛిల్లు చున్నారు
- Joel 2:17 యోవేలు 2:17యెహోవాకు పరిచర్యచేయు యాజకులు మంటపము నకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు యెహోవా, నీ జనులయెడల జాలిచేసి కొని, అన్య జనులు వారిమీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమున కప్పగింపకుము; లేనియెడల అన్యజనులువారి దేవుడు ఏమాయెనందురు గదా యని వేడుకొనవలెను.
- Zechariah 3:1–5 జెకర్యా 3:1–5మరియు యెహోవా దూతయెదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాదియై అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనుపరచెను. సాతానూ, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును ఇతడు అగ్నిలోనుండి తీసిన కొరవివలెనే యున్నాడుగదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించినవాడై దూత సముఖములో నిలువబడియుండగా దూత దగ్గర నిలిచియున్నవారిని పిలిచిఇతని మైలబట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించినేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. అతని తలమీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవిచేయగా వారు అతని తలమీద తెల్లని పాగాపెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి; యెహోవా దూత దగ్గర నిలు చుండెను.