Malachi · chapter 3 · verse 12
Malachi 3:12 in Telugu
అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరును మిమ్మును ధన్యులందురని సైన్య ములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
Appudu aanandakaramaina deshamulo meeru nivasinturu ganuka anyajanulandarunu mimmunu dhanyulandurani sainya mulaku adhipatiyagu yehovaa selavichchuchunnaadu.
Malachi 3:12 in English
- King James Version (KJV)
- And all nations shall call you blessed: for ye shall be a delightsome land, saith the LORD of hosts.
- World English Bible (WEB)
- “All nations shall call you blessed, for you will be a delightful land,” says the LORD of Armies.
- American Standard Version (ASV)
- And all nations shall call you happy; for ye shall be a delightsome land, saith Jehovah of hosts.
- Bible in Basic English (BBE)
- And you will be named happy by all nations: for you will be a land of delight, says the Lord of armies.
- Darby Translation (DBY)
- And all nations shall call you blessed; for ye shall be a delightsome land, saith Jehovah of hosts.
- Webster's Bible (WBS)
- And all nations shall call you blessed: for ye shall be a delightsome land, saith the LORD of hosts.
- Young's Literal Translation (YLT)
- And declared you happy have all the nations, For ye are a delightful land, said Jehovah of Hosts.
Read in context
- 10నా మందిరములో ఆహారముండునట్లు పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.
- 11మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమిపంటను నాశనముచేయవు, మీ ద్రాక్షచెట్లు అకాలఫలములను రాల్పకయుండునని సైన్య ములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు
- 12అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరును మిమ్మును ధన్యులందురని సైన్య ములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- 13యెహోవా సెలవిచ్చునదేమనగానన్నుగూర్చి మీరు బహు గర్వపుమాటలు పలికినిన్నుగూర్చి యేమి చెప్పితి మని మీరడుగుదురు.
- 14దేవుని సేవచేయుట నిష్ఫల మనియు, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుటవలన ప్రయోజనమేమనియు,
Cross references
- Isaiah 61:9 యెషయా 61:9జనములలో వారి సంతతి తెలియబడును జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధినొందును వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచినవారందరు ఒప్పుకొందురు
- Isaiah 62:4 యెషయా 62:4విడువబడినదానివని ఇకమీదట నీవనబడవు పాడైనదని ఇకను నీ దేశమునుగూర్చి చెప్పబడదు హెప్సీబా అని నీకును బ్యూలా అని నీ భూమికిని పేళ్లు పెట్టబడును. యెహోవా నిన్నుగూర్చి ఆనందించుచున్నాడు నీ దేశము వివాహితమగును.
- Zechariah 8:23 జెకర్యా 8:23సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ దినములలో ఆయా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది యొక యూదుని చెంగుపట్టుకొనిదేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడ వత్తుమని చెప్పుదురు.
- Luke 1:48 లూకా 1:48నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను.
- Jeremiah 33:9 యిర్మీయా 33:9భూజనులందరియెదుట వారు నాకిష్టమైన పేరుగాను స్తోత్రకారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు, నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులువిని నేను వారికి కలుగజేయు సమస్తక్షేమమును బట్టియు సమస్తమైన మేలును బట్టియు భయపడుచు దిగులు నొందుదురు.
- Daniel 8:9 దానియేలు 8:9ఈ కొమ్ములలో ఒక దానిలోనుండి యొక చిన్నకొమ్ము మొలిచెను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనందదేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను.
- 2 Chronicles 32:23 2 దినవృత్తాంతములు 32:23అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదా రాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి యిచ్చిరి. అందు వలన అతడు అప్పటినుండి సకల జనముల దృష్టికి ఘనత నొందిన వాడాయెను.
- Deuteronomy 8:7–10 ద్వితీయోపదేశకాండము 8:7–10నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులును, లోయలలో నుండియు కొండలలో నుండియు పారు ఊటలును అగాధ జలములును గల దేశము. అది గోధుమలు యవలు ద్రాక్షచెట్లు అంజూరపుచెట్లు దానిమ్మపండ్లును గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. కరవు అనుకొనకుండ నీవు ఆహారము తిను దేశము; అందులో నీకు ఏ లోపముండదు. అది యినుపరాళ్లు గల దేశము; దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తిపొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమునుబట్టి ఆయనను స్తుతింపవలెను.
- Psalm 72:17 కీర్తనలు 72:17అతని పేరు నిత్యము నిలుచును అతని నామము సూర్యుడున్నంతకాలము చిగుర్చు చుండును అతనినిబట్టి మనుష్యులు దీవింపబడుదురు అన్యజనులందరును అతడు ధన్యుడని చెప్పుకొందురు.
- Zephaniah 3:19–20 జెఫన్యా 3:19–20ఆ కాలమున నిన్ను హింసపెట్టువారినందరిని నేను శిక్షింతును, కుంటుచు నడుచువారిని నేను రక్షింతును, చెదరగొట్టబడినవారిని సమకూర్చుదును, ఏ యే దేశములలో వారు అవమానము నొందిరో అక్కడనెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసెదను, ఆ కాలమున మీరు చూచు చుండగా నేను మిమ్మును చెరలోనుండి రప్పించి, మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును; నిజముగా భూమిమీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును; ఇదే యెహోవా వాక్కు.
- Daniel 11:41 దానియేలు 11:41అతడు ఆనందదేశమున ప్రవేశించుటవలన అనేకులు కూలుదురు గాని ఎదోమీయులును మోయాబీయులును అమ్మోనీయు లలో ముఖ్యులును అతని చేతిలోనుండి తప్పించు కొనెదరు.
- Deuteronomy 11:12 ద్వితీయోపదేశకాండము 11:12అది ఆకాశవర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవు డైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతమువరకు ఎల్లప్పుడు దానిమీద ఉండును.