Mark · chapter 12 · verse 17
Mark 12:17 in Telugu
అందుకు యేసుకైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారాయననుగూర్చి బహుగా ఆశ్చర్యపడిరి.
Anduku yesukaisaruvi kaisarunakunu devunivi devunikini chellinchudani vaarito cheppagaa vaaraayananugoorchi bahugaa aashcharyapadiri.
Mark 12:17 in English
- King James Version (KJV)
- And Jesus answering said unto them, Render to Cæsar the things that are Cæsar’s, and to God the things that are God’s. And they marvelled at him.
- World English Bible (WEB)
- Jesus answered them, “Give to Caesar the things that are Caesar’s, and to God the things that are God’s.” They marveled greatly at him.
- American Standard Version (ASV)
- And Jesus said unto them, Render unto Cæsar the things that are Cæsar’s, and unto God the things that are God’s. And they marvelled greatly at him.
- Bible in Basic English (BBE)
- And Jesus said to them, Give to Caesar the things which are Caesar's, and to God the things which are God's. And they were full of wonder at him.
- Darby Translation (DBY)
- And Jesus answering said to them, Pay what is Caesar's to Caesar, and what is God's to God. And they wondered at him.
- Webster's Bible (WBS)
- And Jesus answering, said to them, Render to Cesar the things that are Cesar's, and to God the things that are God's. And they wondered at him.
- Young's Literal Translation (YLT)
- and Jesus answering said to them, 'Give back the things of Caesar to Caesar, and the things of God to God;' and they did wonder at him.
Read in context
- 15ఇచ్చెదమా ఇయ్యకుందుమా? అని ఆయన నడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగిమీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను.
- 16వారు తెచ్చిరి, ఆయనఈ రూపమును, పై వ్రాతయు, ఎవరివని వారి నడుగగా వారుకైసరువి అనిరి.
- 17అందుకు యేసుకైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారాయననుగూర్చి బహుగా ఆశ్చర్యపడిరి.
- 18పునరుత్థానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు ఆయన యొద్దకువచ్చి
- 19బోధకుడా, తనభార్య బ్రదికియుండగా ఒకడు పిల్లలు లేక చనిపోయినయెడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతా నము కలుగజేయవలెనని మోషే మాకు వ్రాసియిచ్చెను.
Cross references
- Romans 13:7 రోమీయులకు 13:7ఇందుకే గదా మీరు పన్నుకూడ చెల్లించుచున్నారు? కాబట్టి యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవనియెడల భయముండ వలెనో వానియెడల భయమును, ఎవనియెడల సన్మాన ముండవలెనో వాని యెడల సన్మానమును కలిగియుండి, అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి.
- 1 Peter 2:17 1 పేతురు 2:17అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి.
- 1 Corinthians 14:24–25 1 కొరింథీయులకు 14:24–25అయితే అందరు ప్రవచించుచుండగా అవిశ్వాసియైనను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చినయెడల, అందరి బోధవలన తాను పాపినని గ్రహించి, అందరివలన విమర్శింపబడును. అప్పుడతని హృదయరహస్యములు బయలుపడును. ఇందు వలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురముచేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును.
- 2 Corinthians 5:14–15 2 కొరింథీయులకు 5:14–15క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు, జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించు కొనుచున్నాము.
- Job 5:12–13 యోబు 5:12–13వంచకులు తమ పన్నాగములను నెరవేర్చ నేరకుండ ఆయన వారి ఉపాయములను భంగపరచును జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును కపటుల ఆలోచనను తలక్రిందుచేయును
- Proverbs 24:21 సామెతలు 24:21నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము రాజును ఘనపరచుము ఆలాగు చేయనివారి జోలికి పోకుము.
- Matthew 22:46 మత్తయి 22:46ఎవడును మారుమాట చెప్పలేకపోయెను. మరియు ఆ దినమునుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగ తెగింపలేదు.
- Acts 4:19–20 అపొస్తలుల కార్యములు 4:19–20అందుకుపేతురును యోహానును వారినిచూచి దేవుని మాట వినుటకంటె మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి; మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి;
- Matthew 22:22 మత్తయి 22:22వారీమాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్లి పోయిరి.
- Malachi 1:6 మలాకీ 1:6కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా; నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు? అని సైన్యముల కధిపతియగు యెహోవా మిమ్మునడుగగాఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందురు.
- Matthew 17:25–27 మత్తయి 17:25–27అతడు ఇంటిలోనికి వచ్చి మాట లాడకమునుపే యేసు ఆ సంగతి యెత్తిసీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలుచేయుదురు? కుమారులయొద్దనా అన అతడు అన్యులయొద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే. అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి, గాలము వేసి, మొదట పైకివచ్చు చేపను పట్టుకొని, దాని నోరు తెరచినయెడల ఒక షెకెలు దొరకును; దానిని తీసికొని నా కొరకును నీకొరకును వారికిమ్మని అతనితో చెప్పెను.
- Ecclesiastes 5:4–5 ప్రసంగి 5:4–5నీవు దేవునికి మ్రొక్కుబడి చేసికొనినయెడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము;బుద్ధిహీనులయందు ఆయన కిష్టము లేదు. నీవు మ్రొక్కుకొనినదాని చెల్లించుము, నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుటకంటె మ్రొక్కుకొన కుండుటయే మేలు.