Mark · chapter 13 · verse 29
Mark 13:29 in Telugu
ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలిసికొనుడి.
Aa prakaarame meeru ee sangatulu jaruguta choochunappudu aayana sameepamunane dvaaramu daggarane unnaadani telisikonudi.
Mark 13:29 in English
- King James Version (KJV)
- So ye in like manner, when ye shall see these things come to pass, know that it is nigh, [even] at the doors.
- World English Bible (WEB)
- even so you also, when you see these things coming to pass, know that it is near, at the doors.
- American Standard Version (ASV)
- even so ye also, when ye see these things coming to pass, know ye that he is nigh, [even] at the doors.
- Bible in Basic English (BBE)
- Even so, when you see these things taking place, you may be certain that he is near, even at the doors.
- Darby Translation (DBY)
- Thus also ye, when ye see these things happening, know that it is near, at the doors.
- Webster's Bible (WBS)
- So ye in like manner, when ye shall see these things come to pass, know that it is nigh, [even] at the doors.
- Young's Literal Translation (YLT)
- so ye, also, when these ye may see coming to pass, ye know that it is nigh, at the doors.
Read in context
- 27అప్పుడాయన తన దూతలను పంపి, భూమ్యంతము మొదలుకొని ఆకాశాంతమువరకు నలుదిక్కులనుండి తాను ఏర్పరచుకొనినవారిని పోగు చేయించును.
- 28అంజూరపు చెట్టును చూచి యొక ఉపమానము నేర్చు కొనుడి. దాని కొమ్మ యింక లేతదై చిగిరించునప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియును.
- 29ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలిసికొనుడి.
- 30ఇవన్నియు జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను.
- 31ఆకాశమును భూమియును గతించునుగాని నా మాటలు గతింపవు.
Cross references
- 1 Peter 4:17–18 1 పేతురు 4:17–18తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చి యున్నది; అది మనయొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి యేమవును? మరియు నీతి మంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు?
- James 5:9 యాకోబు 5:9సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకనిమీదనొకడు సణగకుడి; ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు.
- Hebrews 10:25–37 హెబ్రీయులకు 10:25–37ఆ దినము సమీపించుట మీరు చూచినకొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. మనము సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాప ములకు బలియికను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించినయెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీద, కనికరింపకుండ వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని, పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును? పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పినవానిని ఎరుగుదుము గదా. జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము. అయితే మీరు వెలిగింపబడినమీదట, శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపుదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే, మీరు నిందలను బాధలను అనుభవించుటచేత పదిమందిలో ఆరడిపడితిరి; మరియొక విధముగా చూచితే, వాటి ననుభ వించినవారితో పాలివారలైతిరి. ఏలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి, మీకు మరి శ్రేష్ఠమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని యెరిగి, మీ ఆస్తి కోలుపోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి; దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చినవారై, వాగ్దానముపొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై యున్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యముచేయక వచ్చును.
- Ezekiel 12:25–28 యెహెజ్కేలు 12:25–28యెహోవానైన నేను మాటయిచ్చుచున్నాను, నే నిచ్చు మాట యికను ఆలస్యములేక జరుగును. తిరుగుబాటు చేయువారలారా, మీ దినములలో నేను మాటయిచ్చి దాని నెరవేర్చెదను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరల యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను నరపుత్రుడా వీనికి కనబడిన దర్శనము నెరవేరుటకు బహుదినములు జరుగవలెననియు బహు కాలము జరిగిన తరువాత కలుగు దానిని వీడు ప్రవచించుచున్నాడనియు ఇశ్రాయేలీయులు చెప్పుకొను చున్నారు గదా కాబట్టి నీవు వారితో ఇట్లనుము ఇకను ఆలస్యములేక నేను చెప్పిన మాటలన్నియు జరుగును, నేను చెప్పినమాట తప్పకుండ జరుగును, ఇదే యెహోవా వాక్కు.
- Ezekiel 7:10–12 యెహెజ్కేలు 7:10–12ఇదిగో యిదే ఆ దినము, అది వచ్చేయున్నది, ఆ దుర్దినము ఉదయించు చున్నది, ఆ దండము పూచియున్నది, ఆ గర్వము చిగిరించియున్నది, బలాత్కారము పుట్టి దుష్టులను దండించున దాయెను. వారిలోనైనను వారి గుంపులోనైనను వారి ఆస్తిలోనైనను వారికున్న ప్రభావములోనైనను ఏమియు శేషింపదు. కాలము వచ్చుచున్నది, దినము సమీప మాయెను, వారి సమూహమంతటిమీద ఉగ్రత నిలిచి యున్నది గనుక కొనువారికి సంతోషముండ పనిలేదు, అమ్మువానికి దుఃఖముండ పనిలేదు.