Mark · chapter 14 · verse 32
Mark 14:32 in Telugu
వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు, ఆయన - నేను ప్రార్థనచేసి వచ్చువరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి
Vaaru getsemane anabadina chotunaku vachchinappudu, aayana - nenu praarthanachesi vachchuvaraku meerikkada koorchundudani tana shishyulato cheppi
Mark 14:32 in English
- King James Version (KJV)
- And they came to a place which was named Gethsemane: and he saith to his disciples, Sit ye here, while I shall pray.
- World English Bible (WEB)
- They came to a place which was named Gethsemane. He said to his disciples, “Sit here while I pray.”
- American Standard Version (ASV)
- And they come unto a place which was named Gethsemane: and he saith unto his disciples, Sit ye here, while I pray.
- Bible in Basic English (BBE)
- And they came to a place which was named Gethsemane: and he said to his disciples, Be seated here while I say a prayer.
- Darby Translation (DBY)
- And they come to a place of which the name [is] Gethsemane, and he says to his disciples, Sit here while I shall pray.
- Webster's Bible (WBS)
- And they came to a place which was named Gethsemane: and he saith to his disciples, Sit ye here, while I shall pray.
- Young's Literal Translation (YLT)
- And they come to a spot, the name of which [is] Gethsemane, and he saith to his disciples, 'Sit ye here till I may pray;'
Read in context
- 30యేసు అతని చూచినేటి రాత్రి కోడి రెండుమారులు కూయకమునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా ననెను.
- 31అతడు మరి ఖండితముగానేను నీతో కూడ చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనే చెప్పననెను. అట్లు వారందరుననిరి.
- 32వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు, ఆయన - నేను ప్రార్థనచేసి వచ్చువరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి
- 33పేతురును యాకోబును యోహానును వెంటబెట్టు కొనిపోయి, మిగుల విభ్రాంతి నొందుటకును చింతా క్రాంతుడగుటకును ఆరం భించెను
- 34అప్పుడాయననా ప్రాణము మరణమగు నంతగా దుఃఖములో మునిగియున్నది; మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి
Cross references
- Mark 14:36 మార్కు 14:36నాయనా తండ్రీ, నీకు సమస్తము సాధ్యము; ఈ గిన్నె నాయొద్దనుండి తొలగించుము; అయినను నా యిష్ట ప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్ము అనెను.
- Psalm 18:5–6 కీర్తనలు 18:5–6పాతాళపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవునికి ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను నా మొఱ్ఱ ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చెను.
- Mark 14:39 మార్కు 14:39తిరిగి పోయి, యింతకుముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించెను.
- Psalm 109:4 కీర్తనలు 109:4నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నామీద పగ పట్టియున్నారు అయితే నేను మానక ప్రార్థనచేయుచున్నాను.
- John 18:1–11 యోహాను 18:1–11యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతోకూడ కెద్రోను వాగు దాటి పోయెను. అక్కడ ఒక తోట యుండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతోకూడ వెళ్లెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్లు చుండువాడు గనుక, ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసియుండెను. కావున యూదా సైనికులను, ప్రధానయాజకులు పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకొని, దివిటీలతోను దీపములతోను ఆయుధముల తోను అక్కడికివచ్చెను. యేసు తనకు సంభవింపబోవున వన్నియు ఎరిగినవాడై వారియొద్దకు వెళ్లి - మీరెవని వెదకుచున్నారని వారిని అడిగెను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను; ఆయనను అప్పగించిన యూదాయు వారియొద్ద నిలుచుండెను. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేలమీద పడిరి. మరల ఆయన - మీరు ఎవనిని వెదకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు - నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో - నేనే ఆయనని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెదకుచున్నయెడల వీరిని పోనియ్యుడని చెప్పెను. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు చెప్పెను. సీమోను పేతురునొద్ద కత్తియుండినందున అతడు దానిని దూసి, ప్రధానయాజకుని దాసుని కొట్టి అతని కుడిచెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసుకత్తి ఒరలో ఉంచుము; తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను.
- Matthew 26:36–46 మత్తయి 26:36–46అంతట యేసు వారితోకూడ గెత్సేమనే అనబడిన చోటికి వచ్చినేను అక్కడికి వెళ్లి ప్రార్థనచేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి యిద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి, దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది;మీరు ఇక్కడ నిలిచి, నాతోకూడ మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్లి, సాగిలపడి నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరల శిష్యులయొద్దకు వచ్చి, వారు నిద్రించుట చూచిఒక గడియయైనను నాతోకూడ మేల్కొనియుండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీన మని పేతురుతో చెప్పి మరల రెండవమారు వెళ్లినా తండ్రీ, నేను దీనిని త్రాగితేనే గాని యిది నాయొద్దనుండి తొలగి పోవుట సాధ్యముకానియెడల, నీ చిత్తమే సిద్ధించు గాక అని ప్రార్థించి తిరిగి వచ్చి, వారు మరల నిద్రించుట చూచెను; ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరల విడిచి వెళ్లి, ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థనచేసెను. అప్పుడాయన తన శిష్యులయొద్దకు వచ్చిఇక నిద్రపోయి అలసట తీర్చు కొనుడి; ఇదిగో ఆ గడియవచ్చి యున్నది; మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడుచున్నాడు; లెండి వెళ్లుదము; ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి యున్నాడని వారితో చెప్పెను.
- Psalm 22:1–2 కీర్తనలు 22:1–2నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు? నా దేవా, పగలు నేను మొఱ్ఱపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుట లేదు అయినను నీవు నా కుత్తరమియ్యకున్నావు.
- Luke 22:39–46 లూకా 22:39–46తరువాత ఆయన బయలుదేరి, తన వాడుక చొప్పున ఒలీవలకొండకు వెళ్లగా శిష్యులును ఆయనవెంట వెళ్లిరి. ఆ చోటు చేరి ఆయన వారితోమీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థనచేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్లి మోకాళ్లూని తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చితమైతే తొలగించుము; అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకమునుండి యొకదూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యులయొద్దకు వచ్చి, వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించు చున్నారు? శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను.
- Psalm 88:1–3 కీర్తనలు 88:1–3యెహోవా, నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొఱ్ఱపెట్టునాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక నా మొఱ్ఱకు చెవి యొగ్గుము నేను ఆపదలతో నిండియున్నాను నా ప్రాణము పాతాళమునకు సమీపించియున్నది.