Mark · chapter 7 · verse 19
Mark 7:19 in Telugu
అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్బూమిలో విడువబడును; ఇట్లు అది భోజనపదార్థము లన్ని టిని పవిత్రపరచును.
Adi vaani hrudayamulo praveshimpaka kadupulone praveshinchi bahirboomilo viduvabadunu; itlu adi bhojanapadaarthamu lanni tini pavitraparachunu.
Mark 7:19 in English
- King James Version (KJV)
- Because it entereth not into his heart, but into the belly, and goeth out into the draught, purging all meats?
- World English Bible (WEB)
- because it doesn’t go into his heart, but into his stomach, then into the latrine, making all foods clean?”
- American Standard Version (ASV)
- because it goeth not into his heart, but into his belly, and goeth out into the draught? [This he said], making all meats clean.
- Bible in Basic English (BBE)
- Because it goes not into the heart but into the stomach, and goes out with the waste? He said this, making all food clean.
- Darby Translation (DBY)
- because it does not enter into his heart but into his belly, and goes out into the draught, purging all meats?
- Webster's Bible (WBS)
- Because it entereth not into his heart, but into the belly, and goeth out into the draught, purging all kinds of food.
- Young's Literal Translation (YLT)
- because it doth not enter into his heart, but into the belly, and into the drain it doth go out, purifying all the meats.'
Read in context
- 17ఆయన జనసమూహమును విడిచి యింటి లోనికి వచ్చినప్పుడు, ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయన నడుగగా
- 18ఆయన వారితో ఇట్లనెనుమీరును ఇంత అవివేకులై యున్నారా? వెలుపలినుండి మనుష్యుని లోపలికి పోవునదేదియు వాని నపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా?
- 19అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్బూమిలో విడువబడును; ఇట్లు అది భోజనపదార్థము లన్ని టిని పవిత్రపరచును.
- 20మనుష్యుని లోపలినుండి బయలు వెళ్లునది మనుష్యుని అపవిత్రపరచును.
- 21లోపలినుండి, అనగా మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును
Cross references
- Matthew 15:17 మత్తయి 15:17నోటిలోనికి పోవున దంతయు కడుపులోపడి బహిర్భూమిలో విడువబడును గాని
- 1 Corinthians 6:13 1 కొరింథీయులకు 6:13భోజనపదార్థములు కడుపునకును కడుపు భోజనపదార్థములకును నియమింపబడి యున్నవి; దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని, ప్రభువు నిమిత్తమే; ప్రభువు దేహము నిమిత్తమే.
- Romans 14:1–12 రోమీయులకు 14:1–12విశ్వాసము విషయమై బలహీనుడైనవానిని చేర్చు కొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ము చున్నాడు, మరియొకడు బలహీనుడై యుండి, కూర గాయలనే తినుచున్నాడు. తినువాడు తిననివాని తృణీ కరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు; ఏలయనగా దేవుడతనిని చేర్చుకొనెను. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు? అతడు నిలిచియుండుట యైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు. ఒకడు ఒక దినముకంటె మరియొక దినము మంచి దినమని యెంచుచున్నాడు; మరియొకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు; ప్రతివాడు తనమట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచు కొనవలెను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు; తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు, తిననివాడు ప్రభువు కోసము తినుటమాని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడును తన కోసమే బ్రదుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రదికినను ప్రభువు కోసమే బ్రదుకుచున్నాము; చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రదికినను చనిపోయినను ప్రభువువారమై యున్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై యుండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరల బ్రదికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేల? నీ సహోదరుని నిరాకరింపనేల? మనమందరము దేవుని న్యాయ పీఠము ఎదుట నిలుతుము. నా తోడు, ప్రతి మోకాలును నా యెదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడియున్నది గనుక మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను.
- Colossians 2:16 కొలొస్సయులకు 2:16కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి.
- Acts 11:9 అపొస్తలుల కార్యములు 11:9రెండవమారు ఆ శబ్దము ఆకాశము నుండిదేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరమిచ్చెను.
- Luke 11:41 లూకా 11:41కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీ కన్నియు శుద్ధిగా ఉండును.
- Acts 10:15 అపొస్తలుల కార్యములు 10:15దేవుడు పవిత్రము చేసినవాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరల రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడెను.
- Colossians 2:21–22 కొలొస్సయులకు 2:21–22మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించిచేత పట్టుకొనవద్దు, రుచిచూడవద్దు, ముట్టవద్దు అను విధు లకు మీరు లోబడనేల? అవన్నియు వాడుకొనుటచేత నశించిపోవును.