Mark · chapter 9 · verse 23
Mark 9:23 in Telugu
అందుకు యేసు (నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే యని అతనితో చెప్పెను.
Anduku yesu (nammuta) neevalananaite, nammuvaaniki samastamunu saadhyame yani atanito cheppenu.
Mark 9:23 in English
- King James Version (KJV)
- Jesus said unto him, If thou canst believe, all things [are] possible to him that believeth.
- World English Bible (WEB)
- Jesus said to him, “If you can believe, all things are possible to him who believes.”
- American Standard Version (ASV)
- And Jesus said unto him, If thou canst! All things are possible to him that believeth.
- Bible in Basic English (BBE)
- And Jesus said to him, If you are able! All things are possible to him who has faith.
- Darby Translation (DBY)
- And Jesus said to him, The 'if thou couldst' is [if thou couldst] believe: all things are possible to him that believes.
- Webster's Bible (WBS)
- Jesus said to him, If thou canst believe, all things [are] possible to him that believeth.
- Young's Literal Translation (YLT)
- And Jesus said to him, 'If thou art able to believe! all things are possible to the one that is believing;'
Read in context
- 21అప్పుడాయన ఇది వీనికి సంభవించి యెంతకాలమైనదని వాని తండ్రి నడుగగా అతడు బాల్యమునుండియే;
- 22అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీవలననైతే మామీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను.
- 23అందుకు యేసు (నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే యని అతనితో చెప్పెను.
- 24వెంటనే ఆ చిన్నవాని తండ్రినమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండ సహాయము చేయుమని బిగ్గరగా చెప్పెను.
- 25జనులు గుంపుకూడి తనయొద్దకు పరు గెత్తికొనివచ్చుట యేసు చూచి మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలోప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను.
Cross references
- John 11:40 యోహాను 11:40అందుకు యేసు నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను;
- Hebrews 11:6 హెబ్రీయులకు 11:6విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.
- Matthew 17:20 మత్తయి 17:20అందుకాయనమీ అల్పవిశ్వాసము చేతనే; మీకు ఆవగింజంత విశ్వాసముండినయెడల ఈ కొండను చూచి ఇక్కడనుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును;
- Mark 11:23 మార్కు 11:23ఎవడైనను ఈ కొండను చూచినీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడు మని చెప్పి, తన మనస్సులో సందే హింపక తాను చెప్పినది జరుగునని నమ్మినయెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
- Matthew 21:21–22 మత్తయి 21:21–22అందుకు యేసు–మీరు విశ్వాసముగలిగి సందేహపడకుండినయెడల, ఈ అంజూరపుచెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాకని చెప్పినయెడల, ఆలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమ్మినయెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను.
- Luke 17:6 లూకా 17:6ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళిచెట్టును చూచినీవు వేళ్లతోకూడ పెల్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును.
- 2 Chronicles 20:20 2 దినవృత్తాంతములు 20:20అంతట వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి; వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడియూదావారలారా, యెరూషలేము కాపురస్థులారా, నా మాట వినుడి; మీ దేవుడైన యెహో వాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు; ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురనిచెప్పెను.
- John 4:48–50 యోహాను 4:48–50యేసుసూచక క్రియలను మహత్కార్యములను చూడ కుంటే మీరెంతమాత్రము నమ్మరని అతనితో చెప్పెను. అందుకా ప్రధాని ప్రభువా, నా కుమారుడు చావక మునుపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు నీవు వెళ్లుము, నీ కుమారుడు బ్రదికియున్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్లి పోయెను.
- Acts 14:9 అపొస్తలుల కార్యములు 14:9అతడు పౌలు మాట లాడుట వినెను. పౌలు అతనివైపు తేరి చూచి, స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి