Matthew · chapter 11 · verse 7
Matthew 11:7 in Telugu
వారు వెళ్లిపోవుచుండగా యేసు యోహానునుగూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్లితిరి? గాలికి కదలు చున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్లితిరి?
Vaaru vellipovuchundagaa yesu yohaanunugoorchi janasamoohamulato eelaagu cheppasaagenu meeremi choochutaku aranyamuloniki vellitiri? Gaaliki kadalu chunna rellunaa? Mari emi chooda vellitiri?
Matthew 11:7 in English
- King James Version (KJV)
- And as they departed, Jesus began to say unto the multitudes concerning John, What went ye out into the wilderness to see? A reed shaken with the wind?
- World English Bible (WEB)
- As these went their way, Jesus began to say to the multitudes concerning John, “What did you go out into the wilderness to see? A reed shaken by the wind?
- American Standard Version (ASV)
- And as these went their way, Jesus began to say unto the multitudes concerning John, What went ye out into the wilderness to behold? a reed shaken with the wind?
- Bible in Basic English (BBE)
- And when they were going away, Jesus, talking of John, said to all the people, What went you out into the waste land to see? a tall stem moving in the wind?
- Darby Translation (DBY)
- But as they went [away], Jesus began to say to the crowds concerning John, What went ye out into the wilderness to see? a reed moved about by the wind?
- Webster's Bible (WBS)
- And as they departed, Jesus began to say to the multitudes concerning John, What went ye out into the wilderness to see? a reed shaken with the wind?
- Young's Literal Translation (YLT)
- And as they are going, Jesus began to say to the multitudes concerning John, 'What went ye out to the wilderness to view? — a reed shaken by the wind?
Read in context
- 5గ్రుడ్డివారు చూపుపొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది.
- 6మరియు నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని యుత్తర మిచ్చెను.
- 7వారు వెళ్లిపోవుచుండగా యేసు యోహానునుగూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్లితిరి? గాలికి కదలు చున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్లితిరి?
- 8సన్నపు బట్టలు ధరించుకొన్న మనుష్యునా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకొనువారు రాజగృహములలో నుందురు గదా.
- 9మరి ఏమి చూడ వెళ్లితిరి? ప్రవక్తనా? అవునుగాని ప్రవక్తకంటె గొప్పవానినని మీతో చెప్పుచున్నాను.
Cross references
- James 1:6 యాకోబు 1:6అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును.
- John 5:35 యోహాను 5:35అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైయుండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందిచుటకు ఇష్ట పడితిరి.
- Luke 8:18 లూకా 8:18కలిగినవానికి ఇయ్యబడును, లేనివానియొద్దనుండి తనకు కలదని అనుకొనునదికూడ తీసివేయబడునుగనుక మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడని చెప్పెను.
- Mark 1:3–5 మార్కు 1:3–5ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకనిశబ్దము అని ప్రవక్తయైన యెషయాచేత వ్రాయబడినట్టు బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణనిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తి స్మము ప్రకటించుచు వచ్చెను. అంతట యూదయ దేశస్థు లందరును, యెరూషలేము వారందరును, బయలుదేరి అతని యొద్దకు వచ్చి, తమ పాపములను ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి.
- Luke 7:24–30 లూకా 7:24–30యోహాను దూతలు వెళ్లిన తరువాత, ఆయన యోహానునుగూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెనుమీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్లితిరి? గాలికి కదలుచున్న రెల్లునా? మరేమి చూడ వెళ్లితిరి? సన్నపు బట్టలు ధరించుకొనిన వానినా? ఇదిగో ప్రశస్తవస్త్రములు ధరించుకొని, సుఖముగా జీవించువారు రాజగృహములలో ఉందురు. అయితే మరేమి చూడవెళ్లితిరి? ప్రవక్తనా? అవునుగాని ప్రవక్తకంటె గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపు చున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధ పరచును అని యెవరినిగూర్చి వ్రాయబడెనో అతడే యీ యోహాను. స్త్రీలు కనినవారిలో యోహానుకంటె గొప్పవాడెవడును లేడు. అయినను దేవుని రాజ్యములో అల్పుడైనవాడు అతనికంటె గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. ప్రజలందరును సుంకరులును (యోహాను బోధ) విని, అతడిచ్చిన బాప్తిస్మము పొందినవారై, దేవుడు న్యాయవంతుడని యొప్పుకొనిరి గాని పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులును అతనిచేత బాప్తిస్మము పొందక, తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి.
- Ephesians 4:14 ఎఫెసీయులకు 4:14అందువలన మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయో పాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడినవారమైనట్లుండక
- Genesis 49:4 ఆదికాండము 49:4నీళ్లవలె చంచలుడవై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచముమీది కెక్కితివి దానిని అపవిత్రము చేసితివి అతడు నా మంచముమీది కెక్కెను.
- 2 Corinthians 1:17–18 2 కొరింథీయులకు 1:17–18కావున నేనీలాగు ఉద్దేశించి చపలచిత్తుడనుగా నడుచుకొంటినా? అవును అవునని చెప్పుచు, కాదు కాదనునట్టు ప్రవర్తింపవలెనని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా? దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనునట్టుగా ఉండలేదు.
- Matthew 3:1–3 మత్తయి 3:1–3ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడినవాడితడే.
- Matthew 21:25 మత్తయి 21:25యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడనుండి కలిగినది? పరలోకమునుండి కలిగినదా, మనుష్యులనుండి కలిగినదా? అని వారినడిగెను. వారుమనము పరలోక మునుండి అని చెప్పితిమా, ఆయనఆలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనలనడుగును;
- Matthew 3:5 మత్తయి 3:5ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యొర్దాను నదీప్రాంతముల వారందరును, అతనియొద్దకు వచ్చి,
- Luke 3:3–7 లూకా 3:3–7అంతట అతడు వచ్చి, పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము పొందవ లెనని యొర్దాను నదీ ప్రదేశమందంతట ప్రకటించు చుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళముచేయుడి ప్రతి పల్లము పూడ్చబడును ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును వంకర మార్గములు తిన్ననివగును కరకు మార్గములు నున్ననివగును సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలువేయుచున్న యొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను. అతడు తనచేత బాప్తిస్మము పొందవచ్చిన జనసమూహములను చూచి సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు?