Matthew · chapter 13 · verse 46
Matthew 13:46 in Telugu
అతడు అమూల్యమైన యొక ముత్యమును కనుగొని, పోయి తనకు కలిగిన దంతయు అమ్మి దాని కొనును.
Atadu amoolyamaina yoka mutyamunu kanugoni, poyi tanaku kaligina dantayu ammi daani konunu.
Matthew 13:46 in English
- King James Version (KJV)
- Who, when he had found one pearl of great price, went and sold all that he had, and bought it.
- World English Bible (WEB)
- who having found one pearl of great price, he went and sold all that he had and bought it.
- American Standard Version (ASV)
- and having found one pearl of great price, he went and sold all that he had, and bought it.
- Bible in Basic English (BBE)
- And having come across one jewel of great price, he went and gave all he had in exchange for it.
- Darby Translation (DBY)
- and having found one pearl of great value, he went and sold all whatever he had and bought it.
- Webster's Bible (WBS)
- Who, when he had found one pearl of great price, went and sold all that he had, and bought it.
- Young's Literal Translation (YLT)
- who having found one pearl of great price, having gone away, hath sold all, as much as he had, and bought it.
Read in context
- 44పరలోకరాజ్యము, పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచి పెట్టి, అది దొరికిన సంతోషముతో వెళ్లి, తనకు కలిగిన దంతయు అమ్మి ఆ పొలమును కొనును.
- 45మరియు పరలోకరాజ్యము, మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలియున్నది.
- 46అతడు అమూల్యమైన యొక ముత్యమును కనుగొని, పోయి తనకు కలిగిన దంతయు అమ్మి దాని కొనును.
- 47మరియు పరలోకరాజ్యము, సముద్రములో వేయబడి నానావిధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది.
- 48అది నిండినప్పుడు దానిని దరికి లాగి, కూర్చుండి, మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయు దురు.
Cross references
- Luke 18:28–30 లూకా 18:28–30పేతురు ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై యింటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తలిదండ్రుల నైనను పిల్లలనైనను విడిచిపెట్టినవాడెవడును, ఇహమందు చాలరెట్లును పరమందు నిత్యజీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను.
- Ephesians 3:8 ఎఫెసీయులకు 3:8దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్యసంకల్పము చొప్పున,
- Proverbs 2:4 సామెతలు 2:4వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన యెడల
- Matthew 13:44 మత్తయి 13:44పరలోకరాజ్యము, పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచి పెట్టి, అది దొరికిన సంతోషముతో వెళ్లి, తనకు కలిగిన దంతయు అమ్మి ఆ పొలమును కొనును.
- Colossians 2:3 కొలొస్సయులకు 2:3బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి.
- Acts 20:24 అపొస్తలుల కార్యములు 20:24అయితే దేవుని కృపాసువార్తనుగూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను, తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు.
- Mark 10:28–31 మార్కు 10:28–31పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లనెను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తలిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందు నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటి వారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటి వారగుదురు అనెను.
- 1 John 5:11–12 1 యోహాను 5:11–12దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు; దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవములేని వాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవముగలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను.
- 1 Corinthians 3:21–23 1 కొరింథీయులకు 3:21–23కాబట్టి యెవడును మనుష్యులయందు అతిశయింపకూడదు; సమస్తమును మీవి. పౌలైనను అపొల్లోయైనను, కేఫాయైనను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవియైనను రాబోవునవియైనను సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు; క్రీస్తు దేవునివాడు.
- Isaiah 33:6 యెషయా 33:6నీకాలములో నియమింపబడినది స్థిరముగా నుండును రక్షణ బాహుళ్యమును బుద్ధిజ్ఞానముల సమృద్ధియు కలుగును యెహోవా భయము వారికి ఐశ్వర్యము.
- Galatians 6:14 గలతీయులకు 6:14అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక; దానివలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువవేయబడియున్నాము.
- Revelation 21:21 ప్రకటన 21:21దాని పండ్రెండు గుమ్మములు పండ్రెండు ముత్యములు; ఒక్కొక గుమ్మము ఒక్కొక ముత్యముతో కట్టబడియున్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది.