Matthew · chapter 18 · verse 25
Matthew 18:25 in Telugu
అప్పు తీర్చుటకు వానియొద్ద ఏమియు లేనందున, వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి, అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను.
Appu teerchutaku vaaniyodda emiyu lenanduna, vaani yajamaanudu vaanini, vaani bhaaryanu, pillalanu vaaniki kaliginadi yaavattunu ammi, appu teerchavalenani aajnyaapinchenu.
Matthew 18:25 in English
- King James Version (KJV)
- But forasmuch as he had not to pay, his lord commanded him to be sold, and his wife, and children, and all that he had, and payment to be made.
- World English Bible (WEB)
- But because he couldn’t pay, his lord commanded him to be sold, with his wife, his children, and all that he had, and payment to be made.
- American Standard Version (ASV)
- But forasmuch as he had not [wherewith] to pay, his lord commanded him to be sold, and his wife, and children, and all that he had, and payment to be made.
- Bible in Basic English (BBE)
- And because he was not able to make payment, his lord gave orders for him, and his wife, and his sons and daughters, and all he had, to be given for money, and payment to be made.
- Darby Translation (DBY)
- But he not having anything to pay, [his] lord commanded him to be sold, and his wife, and his children, and everything that he had, and that payment should be made.
- Webster's Bible (WBS)
- But as he had not ability to pay, his lord commanded him to be sold, and his wife and children, and all that he had, and payment to be made.
- Young's Literal Translation (YLT)
- and he having nothing to pay, his lord did command him to be sold, and his wife, and the children, and all, whatever he had, and payment to be made.
Read in context
- 23కావున పరలోకరాజ్యము, తన దాసులయొద్ద లెక్క చూచుకొన గోరిన యొక రాజును పోలియున్నది.
- 24అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు, అతనికి పదివేల తలాంతులు అచ్చియున్న యొకడు అతనియొద్దకు తేబడెను.
- 25అప్పు తీర్చుటకు వానియొద్ద ఏమియు లేనందున, వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి, అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను.
- 26కాబట్టి ఆ దాసుడు అతని యెదుట సాగిలపడి మ్రొక్కి నాయెడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా
- 27ఆ దాసుని యజమానుడు కనికర పడి, వానిని విడిచిపెట్టి, వాని అప్పు క్షమించెను.
Cross references
- Nehemiah 5:5 నెహెమ్యా 5:5మా ప్రాణము మా సహోదరుల ప్రాణమువంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగింపవలసి వచ్చెను; ఇప్పటికిని మా కుమార్తె లలో కొందరు దాసత్వములో నున్నారు, మా భూములును మా ద్రాక్షతోటలును అన్యులవశమున నుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా
- 2 Kings 4:1 2 రాజులు 4:1అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్యనీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను; అతడు యెహోవా యందు భక్తిగలవాడై యుండెనని నీకు తెలిసేయున్నది; ఇప్పుడు అప్పులవాడు నా యిద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి యున్నాడని ఎలీషాకు మొఱ్ఱ పెట్టగా
- Luke 7:42 లూకా 7:42ఆ అప్పు తీర్చుటకు వారియొద్ద ఏమియు లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను.
- Leviticus 25:39 లేవీయకాండము 25:39నీయొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడినయెడల వానిచేత బానిససేవ చేయించుకొన కూడదు.
- Nehemiah 5:8 నెహెమ్యా 5:8అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తికొలది మేము విడిపించితివిు, మీరు మీ సహోదరులను అమ్ముదురా? వారు మనకు అమ్మబడవచ్చునా? అని వారితో చెప్పగా, వారు ఏమియు చెప్పలేక ఊరకుండిరి.
- Isaiah 50:1 యెషయా 50:1యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? నా అప్పులవారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసితిని? మీ దోషములనుబట్టి మీరు అమ్మబడితిరి మీ అతిక్రమములనుబట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను.
- Exodus 21:2 నిర్గమకాండము 21:2నీవు హెబ్రీయుడైన దాసుని కొనినయెడల వాడు ఆరు సంవత్సరములు దాసుడై యుండి యేడవ సంవత్సరమున ఏమియు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును.