Matthew · chapter 20 · verse 19
Matthew 20:19 in Telugu
ఆయనను అపహసించు టకును కొరడాలతో కొట్టుటకును సిలువవేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు; మూడవ దినమున ఆయన మరల లేచును.
Aayananu apahasinchu takunu koradaalato kottutakunu siluvaveyutakunu anyajanulaku aayananu appaginturu; moodava dinamuna aayana marala lechunu.
Matthew 20:19 in English
- King James Version (KJV)
- And shall deliver him to the Gentiles to mock, and to scourge, and to crucify [him]: and the third day he shall rise again.
- World English Bible (WEB)
- and will hand him over to the Gentiles to mock, to scourge, and to crucify; and the third day he will be raised up.”
- American Standard Version (ASV)
- and shall deliver him unto the Gentiles to mock, and to scourge, and to crucify: and the third day he shall be raised up.
- Bible in Basic English (BBE)
- And will give him up to the Gentiles to be made sport of and to be whipped and to be put to death on the cross: and the third day he will come back again from the dead.
- Darby Translation (DBY)
- and they will deliver him up to the nations to mock and to scourge and to crucify, and the third day he shall rise again.
- Webster's Bible (WBS)
- And will deliver him to the Gentiles to mock, and to scourge, and to crucify [him] : and the third day he will rise again.
- Young's Literal Translation (YLT)
- and they shall condemn him to death, and shall deliver him to the nations to mock, and to scourge, and to crucify, and the third day he will rise again.'
Read in context
- 17యేసు యెరూషలేమునకు వెళ్లనైయున్నప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులను ఏకాంతముగా తీసికొనిపోయి, మార్గమందు వారితో ఇట్లనెను.
- 18ఇదిగో యెరూషలేమునకు వెళ్లుచున్నాము; అక్కడ మనుష్యకుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి
- 19ఆయనను అపహసించు టకును కొరడాలతో కొట్టుటకును సిలువవేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు; మూడవ దినమున ఆయన మరల లేచును.
- 20అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయనయొద్దకు వచ్చి నమస్కారముచేసి యొక మనవి చేయబోగా
- 21నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె నీ రాజ్యమందు ఈ నా యిద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ యెడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను.
Cross references
- Matthew 16:21 మత్తయి 16:21అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్లిపెద్దలచేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా
- Mark 15:16–20 మార్కు 15:16–20అంతట సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరములోపలికి తీసికొనిపోయి, సైనికులనందరిని సమకూర్చుకొనిన తరువాత ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి, ముండ్ల కిరీటమును ఆయన తల మీదపెట్టి, యూదులరాజా, నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తలమీదకొట్టి, ఆయనమీద ఉమ్మివేసి, మోకాళ్లూని ఆయనకు నమస్కారముచేసిరి. వారు ఆయనను అపహసించిన తరు వాత ఆయనమీద నున్న ఊదారంగు వస్త్రము తీసివేసి, ఆయన బట్టలాయనకు తొడిగించి, ఆయనను సిలువవేయుటకు తీసికొనిపోయిరి.
- 1 Corinthians 15:3–7 1 కొరింథీయులకు 15:3–7నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను, లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను. ఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడెను. అటుపిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్కసమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటివరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును, అటుతరువాత అపొస్తలుల కందరికిని కన బడెను.
- Psalm 22:7–8 కీర్తనలు 22:7–8నన్ను చూచువారందరు పెదవులు విరిచి తల ఆడిం చుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవామీద నీ భారము మోపుము ఆయన వానిని విడిపించునేమోవాడు ఆయనకు ఇష్టుడు గదా ఆయన వానిని తప్పించు నేమో అందురు.
- Hosea 6:2 హోషేయ 6:2రెండు దినములైన తరువాత ఆయన మనలను బ్రదికించును, మనము ఆయన సముఖమందు బ్రదుకునట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును.
- Isaiah 53:3 యెషయా 53:3అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతివిు.
- Acts 2:23 అపొస్తలుల కార్యములు 2:23దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి.
- Isaiah 26:19 యెషయా 26:19మృతులైన నీవారు బ్రదుకుదురు నావారి శవములు సజీవములగును మంటిలో పడియున్నవారలారా, మేల్కొని ఉత్స హించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును.
- Psalm 35:16 కీర్తనలు 35:16విందుకాలమునందు దూషణలాడు వదరుబోతులవలె వారు నా మీద పండ్లుకొరికిరి.
- Matthew 27:27–31 మత్తయి 27:27–31అప్పుడు అధిపతియొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసికొనిపోయి, ఆయనయొద్ద సైనికుల నందరిని సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసి వేసి, ఆయనకు ఎఱ్ఱని అంగీ తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, ఒక రెల్లు ఆయన కుడి చేతిలోనుంచి, ఆయనయెదుట మోకాళ్లూని యూదుల రాజా, నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి, ఆ రెల్లును తీసికొని దానితో ఆయనను తలమీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రము లాయనకు తొడిగించి, సిలువ వేయుటకు ఆయనను తీసికొని పోయిరి.
- John 18:28–38 యోహాను 18:28–38వారు కయపయొద్దనుండి అధికారమందిరమునకు యేసును తీసికొనిపోయిరి. అప్పుడు ఉదయమాయెను గనుక వారు మైలపడకుండ పస్కాను భుజింపవలెనని అధికారమందిరములోనికి వెళ్లలేదు. కావున పిలాతు బయట ఉన్నవారియొద్దకు వచ్చిఈ మనుష్యునిమీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను. అందుకు వారువీడు దుర్మార్గుడు కానియెడల వీనిని నీకు అప్పగించియుండ మని అతనితో చెప్పిరి. పిలాతు మీరతని తీసికొనిపోయి మీ ధర్మశాస్త్రముచొప్పున అతనికి తీర్పుతీర్చుడనగా యూదులు ఎవనికిని మరణశిక్ష విధించుటకు మాకు అధికారములేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టిమరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను. పలాతు తిరిగి అధికారమందిరములో ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజువు నీవేనా? అని ఆయన నడుగగా యేసునీ అంతట నీవే యీ మాట అను చున్నావా? లేక యితరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా? అని అడిగెను. అందుకు పిలాతు నేను యూదుడనా యేమి? నీ స్వజనమును ప్రధానయాజకులును నిన్ను నాకు అప్పగించిరిగదా; నీవేమి చేసితివని అడుగగా యేసు నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు - నీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసు - నీవన్నట్టు నేను రాజునే; సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి? అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్లి అతనియందు ఏ దోషమును నాకు కనబడలేదు;
- Luke 23:1–5 లూకా 23:1–5అంతట వారందరును లేచి ఆయనను పిలాతునొద్దకు తీసికొనిపోయి ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు, కైసరునకు పన్నియ్యవద్దనియు, తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయనమీద నేరము మోపసాగిరి. పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయననీ వన్నట్టే అని అతనితో చెప్పెను. పిలాతు ప్రధాన యాజకులతోను జనసమూహములతోను ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనబడలేదనెను. అయితే వారు ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతట ఉపదేశించుచు ప్రజలను రేపు చున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి.