Matthew · chapter 25 · verse 17
Matthew 25:17 in Telugu
ఆలాగుననే రెండు తీసికొనినవాడు మరి రెండు సంపాదించెను.
Aalaagunane rendu teesikoninavaadu mari rendu sampaadinchenu.
Matthew 25:17 in English
- King James Version (KJV)
- And likewise he that [had received] two, he also gained other two.
- World English Bible (WEB)
- In the same way, he also who got the two gained another two.
- American Standard Version (ASV)
- In like manner he also that [received] the two gained other two.
- Bible in Basic English (BBE)
- In the same way he who had been given the two got two more.
- Darby Translation (DBY)
- In like manner also he that [had received] the two, [he also] gained two others.
- Webster's Bible (WBS)
- And likewise he that [had received] two, he also gained other two.
- Young's Literal Translation (YLT)
- in like manner also he who [received] the two, he gained, also he, other two;
Read in context
- 15అతడు ఒకనికి అయిదు తలాంతులను ఒకనికి రెండు, ఒకనికి ఒకటియు ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి, వెంటనే దేశాంతరము పోయెను.
- 16అయిదు తలాంతులు తీసికొనినవాడు వెళ్లి వాటితో వ్యాపారము చేసి, మరి అయిదు తలాంతులు సంపా దించెను.
- 17ఆలాగుననే రెండు తీసికొనినవాడు మరి రెండు సంపాదించెను.
- 18అయితే ఒక తలాంతు తీసికొనినవాడు వెళ్లి, భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను.
- 19బహు కాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారియొద్ద లెక్క చూచుకొనెను.
Cross references
- Proverbs 3:9–10 సామెతలు 3:9–10నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగులలోనుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును.
- Ephesians 5:16 ఎఫెసీయులకు 5:16అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.
- Mark 14:3–8 మార్కు 14:3–8ఆయన బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండియున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసికొని వచ్చి, ఆ అత్తరుబుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తలమీద పోసెను. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఈలాగు నష్టపరచనేల? ఈ అత్తరు మున్నూరు దేనారముల కంటె ఎక్కువ వెలకమ్మి, బీదలకియ్యవచ్చునని చెప్పి ఆమెనుగూర్చి సణుగుకొనిరి. అందుకు యేసు ఇట్లనెను ఈమె జోలికిపోకుడి; ఈమెను ఎందుకు తొందరపెట్టుచున్నారు? ఈమె నాయెడల మంచి కార్యము చేసెను. బీదలు ఎల్లప్పుడును మీతోనే యున్నారు, మీకిష్టమైనప్పుడెల్ల వారికి మేలు చేయ వచ్చును; నేను ఎల్లప్పుడును మీతో నుండను. ఈమె తన శక్తికొలదిచేసి, నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను.
- Galatians 6:9–10 గలతీయులకు 6:9–10మనము మేలుచేయుటయందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేష ముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము.
- Acts 10:2 అపొస్తలుల కార్యములు 10:2అతడు తన యింటి వారందరితోకూడ దేవుని యందు భయభక్తులు గలవాడైయుండి, ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయు వాడు.
- 2 Corinthians 9:11–14 2 కొరింథీయులకు 9:11–14ఇట్టి, ఔదార్యమువలన మాద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఏలయనగా ఈ సేవనుగూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రము కాకుండ, అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ఏలాగనగా క్రీస్తుసువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందుచేతను, వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసి నందుచేతను, ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు. మరియు మీయెడల దేవుడు కనుపరచిన అత్యధికమైన కృపను చూచి, వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు, మిమ్మును చూడవలెనని ఎక్కువ కోరిక గలవారై యున్నారు.
- Acts 11:29–30 అపొస్తలుల కార్యములు 11:29–30అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన తన శక్తికొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పుంపుటకు నిశ్చయించుకొనెను. ఆలాగున చేసి బర్నబా సౌలు అను వారిచేత పెద్దల యొద్దకు దానిని పంపిరి.
- 1 Peter 4:10 1 పేతురు 4:10దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహ నిర్వాహకులైయుండి, యొక్కొకడు కృపావరము పొందిన కొలది యొకనికొకడు ఉపచారము చేయుడి.
- 2 Timothy 1:16–18 2 తిమోతికి 1:16–18ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారియందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లనుగూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి, కనుగొని, అనేక పర్యాయములు ఆదరించెను. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారముచేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభువువలన కనికరము పొందునట్లు ప్రభువు అనుగ్రహించును గాక.
- Genesis 18:19 ఆదికాండము 18:19ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ జేయునట్లు తన తరువాత తన పిల్లలును తన యింటి వారును నీతి న్యాయములు జరిగించుచు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారి కాజ్ఞాపించినట్లు నేనతని నెరిగియున్నాననెను.
- Acts 9:36–39 అపొస్తలుల కార్యములు 9:36–39మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను; ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్ క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి యుండెను. ఆ దినములయందామె కాయిలాపడి చనిపోగా, వారు శవమును కడిగి మేడ గదిలో పరుండ బెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుటచేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, అతడు తడవుచేయక తమయొద్దకు రావలెనని వేడుకొనుటకు ఇద్దరు మనుష్యులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితోకూడ వెళ్లి అక్కడ చేరినప్పుడు, వారు మేడగదిలోనికి అతనిని తీసికొని వచ్చిరి; విధవరాండ్రందరు వచ్చి యేడ్చుచు, దొర్కా తమతోకూడ ఉన్నప్పుడు కుట్టిన అంగీలును వస్త్రములును చూపుచు అతని యెదుట నిలిచిరి.
- 1 Kings 18:3–4 1 రాజులు 18:3–4అహాబు తన గృహనిర్వాహ కుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్యా యెహోవా యందు బహు భయ భక్తులుగలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో ఏబదేసి మందిగా నూరుగురిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను.