Micah · chapter 1 · verse 16
Micah 1:16 in Telugu
సీయోనూ, నీకు ప్రియులగువారు నీయొద్ద నుండకుండ పట్టబడియున్నారు; నీ తల బోడిచేసికొనుము, బోరుచగద్దవలె నీ బోడితనము కనుపరచుకొనుము.
Seeyonoo, neeku priyulaguvaaru neeyodda nundakunda pattabadiyunnaaru; nee tala bodichesikonumu, boruchagaddavale nee boditanamu kanuparachukonumu.
Micah 1:16 in English
- King James Version (KJV)
- Make thee bald, and poll thee for thy delicate children; enlarge thy baldness as the eagle; for they are gone into captivity from thee.
- World English Bible (WEB)
- Shave your heads, and cut off your hair for the children of your delight. Enlarge your baldness like the vulture, for they have gone into captivity from you!
- American Standard Version (ASV)
- Make thee bald, and cut off thy hair for the children of thy delight: enlarge thy baldness as the eagle; for they are gone into captivity from thee.
- Bible in Basic English (BBE)
- Let your head be uncovered and your hair cut off in sorrow for the children of your delight: let the hair be pulled from your head like an eagle's; for they have been taken away from you as prisoners.
- Darby Translation (DBY)
- Make thee bald, and poll thee for the children of thy delights; enlarge thy baldness as the eagle, for they are gone into captivity from thee.
- Webster's Bible (WBS)
- Make thee bald, and poll thee for thy delicate children; enlarge thy baldness as the eagle; for they are gone into captivity from thee.
- Young's Literal Translation (YLT)
- Make bald and shave, for thy delightful sons, Enlarge thy baldness as an eagle, For they have removed from thee!
Read in context
- 14మోరెషెత్గతు విషయములో మీరు విడు దలకైకోలు ఇయ్యవలసివచ్చును, అక్జీబు ఇండ్లు ఇశ్రా యేలు రాజును మోసపుచ్చునవై యుండును.
- 15మారేషా నివాసీ, నీకు హక్కు దారుడగు ఒకని నీయొద్దకు తోడుకొని వత్తురు, ఇశ్రాయేలీయులలోని ఘనులు అదుల్లామునకు పోవుదురు.
- 16సీయోనూ, నీకు ప్రియులగువారు నీయొద్ద నుండకుండ పట్టబడియున్నారు; నీ తల బోడిచేసికొనుము, బోరుచగద్దవలె నీ బోడితనము కనుపరచుకొనుము.
Cross references
- Isaiah 22:12 యెషయా 22:12ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తలబోడి చేసికొనుటకును గోనెపట్ట కట్టుకొనుటకును సైన్యములకధిపతియు ప్రభువునగు యెహోవా మిమ్మును పిలువగా
- Job 1:20 యోబు 1:20అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తలవెండ్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారముచేసి ఇట్లనెను
- Jeremiah 7:29 యిర్మీయా 7:29తనకు కోపము తెప్పించు తరమువారిని యెహోవా విసర్జించి వెళ్లగొట్టుచున్నాడు; సీయోనూ నీ తలవెండ్రు కలను కత్తిరించుకొనుము, వాటిని పారవేయుము, చెట్లులేని మెట్టలమీద ప్రలాపవాక్య మెత్తుము.
- Amos 8:10 ఆమోసు 8:10మీ పండుగ దినములను దుఃఖదినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును, అందరిని మొలలమీద గోనెపట్ట కట్టుకొనజేయుదును, అందరి తలలు బోడిచేసెదను, ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును; దాని అంత్యదినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును.
- Jeremiah 16:6 యిర్మీయా 16:6ఘనులేమి అల్పులేమి యీ దేశమందున్నవారు చనిపోయి పాతిపెట్టబడరు, వారి నిమిత్తము ఎవరును అంగలార్చకుందురు, ఎవరును తమ్మును తాము కోసికొన కుందురు, వారి నిమిత్తము ఎవరును తమ్మును తాము బోడి చేసికొనకుందురు.
- Isaiah 39:6–7 యెషయా 39:6–7రాబోవు దినములలో ఏమియు మిగులకుండ నీ యింటనున్న సమస్తమును, నేటివరకు నీ పితరులు సమ కూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తికొని పోవుదురని సైన్యముల కధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును బబులోను రాజు నగరునందు నపుంసకులగా చేయుటకై వారు తీసికొనిపోవుదురు.
- Jeremiah 6:26 యిర్మీయా 6:26నా జనమా, పాడు చేయువాడు హఠాత్తుగా మామీదికి వచ్చుచున్నాడు. గోనెపట్ట కట్టుకొని బూడిదె చల్లుకొనుము; ఏక కుమారుని గూర్చి దుఃఖించునట్లు దుఃఖము సలుపుము ఘోరమైన దుఃఖము సలుపుము.
- Lamentations 4:5–8 విలాపవాక్యములు 4:5–8సుకుమార భోజనము చేయువారు దిక్కు లేక వీధులలో పడియున్నారు రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడినవారు పెంట కుప్పలను కౌగిలించుకొనెదరు. నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపముకంటె అధికము ఎవరును దానిమీద చెయ్యి వేయకుండనే నిమిషములో ఆ పట్టణము పాడుచేయబడెను. దాని ఘనులు హిమముకన్న శుద్ధమైనవారు వారు పాలకంటె తెల్లనివారు వారి శరీరములు పగడములకంటె ఎఱ్ఱనివి వారి దేహకాంతి నీలమువంటిది. అట్టివారి ఆకారము బొగ్గుకంటె నలుపాయెను వారిని వీధులలో చూచువారు వారిని గురుతు పట్ట జాలరు. వారి చర్మము వారి యెముకలకు అంటుకొనియున్నది అది యెండి కఱ్ఱవంటిదాయెను.
- 2 Kings 17:6 2 రాజులు 17:6హోషేయ యేలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు అష్షూరురాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలువారిని అష్షూరు దేశములోనికి చెర గొనిపోయి. గోజానునది దగ్గరనున్న హాలహు హాబోరు అను స్థలములందును మాదీయుల పట్టణ ములలోను వారిని ఉంచెను.
- Isaiah 15:2 యెషయా 15:2ఏడ్చుటకు మోయాబీయులు గుడికిని మెట్టమీదనున్న దీబోనుకును వెళ్లుచున్నారు నెబోమీదను మేదెబామీదను మోయాబీయులు ప్రలాపించుచున్నారు వారందరి తలలమీద బోడితనమున్నది ప్రతివాని గడ్డము గొరిగింపబడి యున్నది
- Isaiah 3:16–26 యెషయా 3:16–26మరియు యెహోవా సెలవిచ్చినదేదనగా సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడచుచు ఓర చూపులు చూచుచు కులుకుతో నడచుచు, తమ కాళ్లగజ్జలను మ్రోగించు చున్నారు; కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును యెహోవా వారి మానమును బయలుపరచును. ఆ దినమున యెహోవా గల్లుగల్లుమను వారి పాద భూషణములను సూర్యబింబ భూషణములను చంద్రవంకలను భూషణములను కర్ణభూషణములను కడియములను నాణమైన ముసుకు లను కుల్లాయీలను కాళ్ల గొలుసులను ఒడ్డాణములను పరిమళ ద్రవ్యపు బరిణలను రక్షరేకులను ఉంగరములను ముక్కు కమ్ములను ఉత్సవ వస్త్రములను ఉత్తరీయములను పైటలను సంచులను చేతి అద్దములను సన్నపునారతో చేసిన ముసుకులను పాగాలను శాలువులను తీసివేయును. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును నడికట్టుకు ప్రతిగా త్రాడును అల్లిన జడకు ప్రతిగా బోడితలయు ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గోనెపట్టయు అందమునకు ప్రతిగా వాతయును ఉండును. ఖడ్గముచేత మనుష్యులు కూలుదురు యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును ఆమె ఏమియు లేనిదై నేల కూర్చుండును.
- Deuteronomy 28:41 ద్వితీయోపదేశకాండము 28:41కుమా రులను కుమార్తెలను కందువుగాని వారు నీయొద్ద నుండరు, వారు చెరపట్ట బడుదురు.