Micah · chapter 2 · verse 6
Micah 2:6 in Telugu
మీరు దీని ప్రవచింప వద్దని వారు ప్రకటన చేయుదురు. ప్రవ చింపనియెడల అవమానము కలుగక మానదు.
Meeru deeni pravachimpa vaddani vaaru prakatana cheyuduru. Prava chimpaniyedala avamaanamu kalugaka maanadu.
Micah 2:6 in English
- King James Version (KJV)
- Prophesy ye not, [say they to them that] prophesy: they shall not prophesy to them, [that] they shall not take shame.
- World English Bible (WEB)
- “Don’t prophesy!”—they prophesy— “Don’t prophesy about these things. Disgrace won’t overtake us.”
- American Standard Version (ASV)
- Prophesy ye not, [thus] they prophesy. They shall not prophesy to these: reproaches shall not depart.
- Bible in Basic English (BBE)
- Let not words like these be dropped, they say: Shame and the curse will not come to the family of Jacob!
- Darby Translation (DBY)
- Prophesy ye not, they prophesy. If they do not prophesy to these, the ignominy will not depart.
- Webster's Bible (WBS)
- Prophesy ye not, [say they to them that] prophesy: they shall not prophesy to them, [that] they shall not take shame.
- Young's Literal Translation (YLT)
- Ye do not prophesy — they do prophesy, They do not prophesy to these, It doth not remove shame.
Read in context
- 4ఆ దినమున జనులు మిమ్మునుగురించి బహుగా అంగలార్చుచు సామెత నెత్తుదురు. వారు చెప్పు సామెత ఏదనగామనము బొత్తిగా చెడిపోయి యున్నామనియు, ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యుల కిచ్చియున్నా డనియు, మనయొద్ద నుండకుండ ఆయన దానిని తీసివేసెసేయనియు, మన భూములను తిరుగబడినవారికి ఆయన విభ జించియున్నాడనియు ఇశ్రాయేలీయులు అనుకొను చున్నట్లు జనులు చెప్పుకొందురు.
- 5చీట్లు వేయగా యెహోవా సమాజములో మీరు పాలుపొందునట్లు నూలు వేయువా డొకడును ఉండడు.
- 6మీరు దీని ప్రవచింప వద్దని వారు ప్రకటన చేయుదురు. ప్రవ చింపనియెడల అవమానము కలుగక మానదు.
- 7యాకోబు సంతతివారని పేరు పెట్టబడినవారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయెనా? యీ క్రియలు ఆయనచేత జరిగెనా? యథా ర్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమసాధనములు కావా?
- 8ఇప్పుడేగదా నా జనులు శత్రువులైరి; నిర్భయ ముగా సంచరించువారిని చూచి వారు కట్టు పంచెలను మాత్రము విడిచి వారి పై వస్త్రములను లాగుకొందురు.
Cross references
- Amos 2:12 ఆమోసు 2:12అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి.
- Isaiah 30:10 యెషయా 30:10దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పు వారును యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి మృదువైన మాటలనే మాతో పలుకుడి మాయాదర్శనములను కనుడి
- Ezekiel 3:26 యెహెజ్కేలు 3:26నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొన జేసెదను.
- Acts 5:40 అపొస్తలుల కార్యములు 5:40వారతని మాటకు సమ్మతించి, అపొస్తలులను పిలిపించి కొట్టించియేసు నామమునుబట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి.
- Jeremiah 26:20–23 యిర్మీయా 26:20–23మరియు కిర్యత్యారీము వాడైన షెమయా కుమారుడగు ఊరియాయను ఒకడు యెహోవా నామమునుబట్టి ప్రవచించుచుండెను. అతడు యిర్మీయా చెప్పిన మాటల రీతిని యీ పట్టణమునకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించెను. రాజైన యెహోయాకీమును అతని శూరులందరును ప్రధానులందరును అతని మాటలు వినినమీదట రాజు అతని చంపజూచుచుండగా, ఊరియా దాని తెలిసికొని భయపడి పారిపోయి ఐగుప్తు చేరెను. అప్పుడు రాజైన యెహోయాకీము అక్బోరు కుమారుడగు ఎల్నాతానును అతనితో కొందరిని ఐగుప్తునకు పంపెను; వారు ఐగుప్తులోనుండి ఊరియాను తీసి కొనివచ్చి రాజైన యెహోయాకీమునొద్ద చేర్చగా, ఇతడు ఖడ్గముతో అతని చంపి సామాన్యజనుల సమాధిలో అతని కళేబరమును వేయించెను.
- Amos 8:11–13 ఆమోసు 8:11–13రాబోవు దినము లందు దేశములో నేను క్షామము పుట్టింతును; అది అన్న పానములు లేకపోవుటచేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును; ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై యీ సముద్రమునుండి ఆ సముద్రమువరకును ఉత్తరదిక్కునుండి తూర్పుదిక్కువరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు; ఆ దినమందు చక్కని కన్యలును ¸యౌవనులును దప్పిచేత సొమ్మసిల్లు దురు.
- Jeremiah 8:11–12 యిర్మీయా 8:11–12సమాధానము లేని సమయమున సమాధానము సమాధానము అని వారు చెప్పుచు, నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెనుగాని వారేమాత్రమును సిగ్గుపడరు; అవమానము నొందితిమని వారికి తోచనేలేదు గనుక పడిపోవువారిలో వారు పడిపోవుదురు; నేను వారిని విమర్శించుకాలమున వారు తొట్రిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు
- Ezekiel 20:46 యెహెజ్కేలు 20:46నరపుత్రుడా, నీ ముఖము దక్షిణపుతట్టు త్రిప్పుకొని దక్షిణదేశమునకు ప్రకటింపుము, దక్షిణదేశపు అరణ్య మునుగూర్చి ప్రవచించి ఇట్లనుము
- Acts 5:28 అపొస్తలుల కార్యములు 5:28ప్రధానయాజకుడు వారిని చూచిమీరు ఈ నామమునుబట్టి బోధింపకూడdదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, యీ మనుష్యుని హత్య మామీదికి తేవలెనని ఉద్దేశించుచున్నారని చెప్పెను.
- Ezekiel 21:2 యెహెజ్కేలు 21:2నరపుత్రుడా, యెరూషలేము తట్టు నీ ముఖము త్రిప్పుకొని, పరిశుద్ధ స్థలములనుబట్టి ఇశ్రాయేలీయులదేశమును గూర్చి ప్రవచించి ఇట్లనుము
- Micah 6:16 మీకా 6:16ఏలయనగా మీరు ఒమీ నియమించిన కట్టడల నాచ రించుచు, అహాబు ఇంటివారు చేసిన క్రియలన్నిటి ననుస రించుచు వారి యోచనలనుబట్టి నడుచుచున్నారు గనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మును భీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులను అపహాస్యాస్పదము గాను చేయబోవుచున్నాను.
- Psalm 74:9 కీర్తనలు 74:9సూచకక్రియలు మాకు కనబడుటలేదు, ఇకను ప్రవక్తయు లేకపోయెను. ఇది ఎంతకాలము జరుగునో దాని నెరిగినవాడు మాలో ఎవడును లేడు.