Numbers · chapter 24 · verse 14
Numbers 24:14 in Telugu
చిత్తగించుము; నేను నా జనులయొద్దకు వెళ్లుచున్నాను. అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకేమి చేయుదురో అది నీకు విశదపరచెదను రమ్మని చెప్పి
Chittaginchumu; nenu naa janulayoddaku velluchunnaanu. Ayite kadapati dinamulalo ee janulu nee janulakemi cheyuduro adi neeku vishadaparachedanu rammani cheppi
Numbers 24:14 in English
- King James Version (KJV)
- And now, behold, I go unto my people: come [therefore, and] I will advertise thee what this people shall do to thy people in the latter days.
- World English Bible (WEB)
- Now, behold, I go to my people. Come, I will inform you what this people shall do to your people in the latter days.”
- American Standard Version (ASV)
- And now, behold, I go unto my people: come, [and] I will advertise thee what this people shall do to thy people in the latter days.
- Bible in Basic English (BBE)
- So now I will go back to my people: but first let me make clear to you what this people will do to your people in days to come.
- Darby Translation (DBY)
- And now behold, I go to my people: come, I will admonish thee what this people will do to thy people at the end of days.
- Webster's Bible (WBS)
- And now, behold, I go to my people: come [therefore] , I will advertise thee what this people will do to thy people in the latter days.
- Young's Literal Translation (YLT)
- and, now, lo, I am going to my people; come, I counsel thee [concerning] that which this people doth to thy people, in the latter end of the days.'
Read in context
- 12అందుకు బిలాము బాలాకుతోబాలాకు తన ఇంటెడు వెండి బంగారము లను నాకిచ్చినను నా యిష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను.
- 13యెహోవా యేమి సెలవిచ్చునో అదే పలికెదనని నీవు నాయొద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా?
- 14చిత్తగించుము; నేను నా జనులయొద్దకు వెళ్లుచున్నాను. అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకేమి చేయుదురో అది నీకు విశదపరచెదను రమ్మని చెప్పి
- 15ఉపమానరీతిగా ఇట్లనెను బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి. కన్నులు తెరచినవానికి వచ్చిన దేవోక్తి.
- 16దేవవాక్కులను వినిన వాని వార్త మహాన్నతుని విద్య నెరిగినవాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై సర్వశక్తుని దర్శనము పొందెను.
Cross references
- Micah 6:5 మీకా 6:5నా జనులారా, యెహోవా నీతి కార్య ములను మీరు గ్రహించునట్లు మోయాబురాజైన బాలాకు యోచించినదానిని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాలువరకును జరిగిన వాటిని, మనస్సునకు తెచ్చు కొనుడి.
- Genesis 49:1 ఆదికాండము 49:1యాకోబు తన కుమారులను పిలిపించి యిట్లనెను. మీరు కూడిరండి, అంత్యదినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసెదను.
- Revelation 2:14 ప్రకటన 2:14అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాముబోధను అనుసరించువారు నీలో ఉన్నారు
- Daniel 2:28 దానియేలు 2:28అయితే మర్మములను బయలుపరచ గల దేవుడొకడు పరలోకమందున్నాడు, అంత్యదినముల యందు కలుగబోవుదానిని ఆయన రాజగు నెబుకద్నెజరు నకు తెలియజేసెను. తాము పడకమీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్నదర్శనములు ఏవనగా
- 2 Timothy 3:1 2 తిమోతికి 3:1అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము.
- Daniel 10:14 దానియేలు 10:14ఈ దర్శనపు సంగతి ఇంక అనేక దినములవరకు జరుగదు; అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింప బోవు ఈ సంగతిని నీకు తెలియజేయ వచ్చితినని అతడు నాతో చెప్పెను.
- Numbers 31:7–18 సంఖ్యాకాండము 31:7–18యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధముచేసి మగవారినందరిని చంపిరి. చంపబడిన యితరులుగాక మిద్యానురాజులను, అనగా మిద్యాను అయిదుగురు రాజులైన ఎవీని, రేకె మును, సూరును, హూరును, రేబను చంపిరి. బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీలను వారి చిన్న పిల్ల లను చెరపట్టుకొని, వారి సమస్త పశువులను వారి గొఱ్ఱె మేకలన్నిటిని వారికి కలిగినది యావత్తును దోచుకొనిరి. మరియు వారి నివాస పట్టణములన్నిటిని వారి కోటలన్ని టిని అగ్నిచేత కాల్చివేసిరి. వారు మనుష్యులనేమి పశువులనేమి సమస్తమైన కొల్ల సొమ్మును మిద్యానీయుల ఆస్తిని యావత్తును తీసికొనిరి. తరువాత వారు మోయాబు మైదానములలో యెరికో యొద్దనున్న యొర్దాను దగ్గర దిగియున్న దండులో మోషే యొద్దకును యాజకుడైన ఎలియాజరు నొద్దకును ఇశ్రాయేలీయుల సమాజము నొద్దకును చెరపట్టబడినవారిని అపహరణములను ఆ కొల్ల సొమ్మును తీసికొని రాగా మోషేయు యాజకుడైన ఎలి యాజరును సమాజ ప్రధానులందరును వారిని ఎదుర్కొను టకు పాళెములోనుండి వెలుపలికి వెళ్లిరి. అప్పుడు మోషే యుద్ధసేనలోనుండి వచ్చిన సహస్రాధిపతులును శతాధిపతులునగు సేనానాయకులమీద కోపపడెను. మోషే వారితోమీరు ఆడువారినందరిని బ్రదుకనిచ్చి తిరా? ఇదిగో బిలాము మాటనుబట్టి పెయోరు విషయ ములో ఇశ్రాయేలీయులచేత యెహోవామీద తిరుగు బాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టియుండెను గదా. కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని పురుషసంయో గము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి; పురుషసంయోగము ఎరుగని ప్రతి ఆడుపిల్లను మీ నిమిత్తము బ్రతుకనీయుడి.
- Isaiah 24:22 యెషయా 24:22చెరపట్టపడినవారు గోతిలో చేర్చబడునట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడుదురు బహుదినములైన తరువాత వారు దర్శింపబడుదురు.
- Jeremiah 49:39 యిర్మీయా 49:39అయితే కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరల రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు.
- Numbers 24:17 సంఖ్యాకాండము 24:17ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇశ్రాయేలులోనుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులనందరిని నాశనము చేయును.
- Acts 2:17 అపొస్తలుల కార్యములు 2:17అంత్య దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు మీ ¸యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు.
- Revelation 2:10 ప్రకటన 2:10ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు; పది దినములు శ్రమ కలుగును; మరణమువరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీట మిచ్చెదను.