Numbers · chapter 25 · verse 3
Numbers 25:3 in Telugu
అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనినందున వారిమీద యెహోవా కోపము రగులుకొనెను.
Atlu ishraayeleeyulu bayalpeyoruto kalisikoninanduna vaarimeeda yehovaa kopamu ragulukonenu.
Numbers 25:3 in English
- King James Version (KJV)
- And Israel joined himself unto Baal-peor: and the anger of the LORD was kindled against Israel.
- World English Bible (WEB)
- Israel joined himself to Baal Peor, and the LORD’s anger burned against Israel.
- American Standard Version (ASV)
- And Israel joined himself unto Baal-peor: and the anger of Jehovah was kindled against Israel.
- Bible in Basic English (BBE)
- So Israel had relations with the women of Moab in honour of the Baal of Peor: and the Lord was moved to wrath against Israel.
- Darby Translation (DBY)
- And Israel joined himself to Baal-Peor; and the anger of Jehovah was kindled against Israel.
- Webster's Bible (WBS)
- And Israel joined himself to Baal-peor: and the anger of the LORD was kindled against Israel.
- Young's Literal Translation (YLT)
- and Israel is joined to Baal-Peor, and the anger of Jehovah burneth against Israel.
Read in context
- 1అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెనుయాజకుడైన అహరోను మనుమ డును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు, ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి.
- 2ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనముచేసి వారి దేవతలకు నమస్కరించిరి.
- 3అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనినందున వారిమీద యెహోవా కోపము రగులుకొనెను.
- 4అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ప్రజల అధిపతుల నందరిని తోడుకొని, యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీదనుండి తొలగిపోవునని చెప్పెను.
- 5కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధి పతులను పిలిపించి మీలో ప్రతివాడును బయల్పెయో రుతో కలిసికొనిన తన తన వశములోనివారిని చంపవలెనని చెప్పెను.
Cross references
- Joshua 22:17 యెహోషువ 22:17పెయోరు విషయములో మనము చేసిన దోషము మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజ ములో తెగులు పుట్టెను గదా నేటివరకు మనము దానినుండి పవిత్రపరచుకొనకయున్నాము.
- Psalm 106:28–29 కీర్తనలు 106:28–29మరియు వారు బయల్పెయోరును హత్తుకొని, చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. వారు తమ క్రియలచేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను.
- Hosea 9:10 హోషేయ 9:10అరణ్యములో ద్రాక్షపండ్లు దొరికినట్లు ఇశ్రాయేలువారు నాకు దొరికిరి; చిగురుపెట్టు కాలమందు అంజూరపు చెట్టుమీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్పెయోరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిరి; తాము మోహించినదానివలెనే వారు హేయులైరి.
- Psalm 90:11 కీర్తనలు 90:11నీ ఆగ్రహబలము ఎంతో ఎవరికి తెలియును? నీకు చెందవలసిన భయముకొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియును?
- Judges 2:20 న్యాయాధిపతులు 2:20కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఈలాగు సెలవిచ్చెనుఈ ప్రజలు నా మాట వినక, వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు
- Jeremiah 17:4 యిర్మీయా 17:4మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించితిరి గనుక, నేను నీకిచ్చిన స్వాస్థ్యమును నీ అంతట నీవే విడిచిపెట్టితివి గనుక నీవెరుగని దేశములో నీ శత్రువులకు నీవు దాసుడవగుదువు.
- Deuteronomy 4:3–4 ద్వితీయోపదేశకాండము 4:3–4బయల్పెయోరు విషయ ములో యెహోవా చేసినదానిని మీరు కన్నులార చూచితిరి గదా. బయల్పెయోరు వెంట వెళ్లిన ప్రతి మనుష్యుని నీ దేవుడైన యెహోవా నీ మధ్యను ఉండకుండ నాశనము చేసెను. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరును నేటివరకు సజీవులై యున్నారు.
- Numbers 25:5 సంఖ్యాకాండము 25:5కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధి పతులను పిలిపించి మీలో ప్రతివాడును బయల్పెయో రుతో కలిసికొనిన తన తన వశములోనివారిని చంపవలెనని చెప్పెను.
- Judges 2:14 న్యాయాధిపతులు 2:14కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీద మండెను; ఆయన దోచు కొనువారిచేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీ యులను దోచుకొనిరి; ఆయన వారి చుట్టునున్నవారి శత్రువులచేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల యెదుట నిలువలేకపోయిరి.