Numbers · chapter 3 · verse 19
Numbers 3:19 in Telugu
కహాతు కుమారుల వంశకర్తల పేళ్లు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు అనునవి.
Kahaatu kumaarula vanshakartala pellu amraamu ishaaru hebronu ujjeeyelu anunavi.
Numbers 3:19 in English
- King James Version (KJV)
- And the sons of Kohath by their families; Amram, and Izehar, Hebron, and Uzziel.
- World English Bible (WEB)
- The sons of Kohath by their families: Amram, Izhar, Hebron, and Uzziel.
- American Standard Version (ASV)
- And the sons of Kohath by their families: Amram, and Izhar, Hebron, and Uzziel.
- Bible in Basic English (BBE)
- And the sons of Kohath, by their families: Amram and Izhar and Hebron and Uzziel.
- Darby Translation (DBY)
- And the sons of Kohath according to their families: Amram and Izhar, Hebron and Uzziel.
- Webster's Bible (WBS)
- And the sons of Kohath by their families; Amram, and Izehar, Hebron, and Uzziel.
- Young's Literal Translation (YLT)
- And the sons of Kohath, by their families, [are] Amram and Izhar, Hebron and Uzziel.
Read in context
- 17లేవి కుమారుల పేళ్లు గెర్షోను కహాతు మెరారి అనునవి.
- 18గెర్షోను కుమారుల వంశకర్తల పేళ్లు లిబ్నీ షిమీ అనునవి.
- 19కహాతు కుమారుల వంశకర్తల పేళ్లు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు అనునవి.
- 20మెరారి కుమారుల వంశకర్తల పేళ్లు మాహలి మూషి. వారివారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయుల వంశములు.
- 21లిబ్నీ యులు షిమీయులు గెర్షోను వంశస్థులు గెర్షోనీయుల వంశపువారు వీరే.
Cross references
- Exodus 6:18 నిర్గమకాండము 6:18కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు. కహాతు నూట ముప్పది మూడేండ్లు బ్రదికెను.
- 1 Chronicles 6:18 1 దినవృత్తాంతములు 6:18కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.
- 1 Chronicles 15:5 1 దినవృత్తాంతములు 15:5లేవీయులైన కహాతు సంతతివారి అధిపతియగు ఊరీయేలును వాని బంధువులలో నూట ఇరువదిమందిని,
- Nehemiah 12:1–26 నెహెమ్యా 12:1–26షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతో కూడ వచ్చిన యాజకులును లేవీయులును వీరే. యేషూవ శెరాయా యిర్మీయా ఎజ్రా అమర్యా మళ్లూకు హట్టూషు షెకన్యా రెహూము మెరేమోతు ఇద్దో గిన్నెతోను అబీయా. మీయామిను మయద్యా బిల్గా షెమయా యోయారీబు యెదాయా సల్లూ ఆమోకు హిల్కీయా యెదాయా అనువారు. వారందరును యేషూవ దినములలో యాజకులలోను వారి బంధువులలోను ప్రధానులుగా ఉండిరి. మరియు లేవీయులలో యేషూవ బిన్నూయి కద్మీయేలు షేరేబ్యా యూదా స్తోత్రాది సేవవిషయములో ప్రధానియైన మత్తన్యాయు అతని బంధువులును. మరియు బక్బుక్యాయు ఉన్నీయును వారి బంధువులును వారికి ఎదురు వరుసలోనుండి పాడువారు. యేషూవ యోయాకీమును కనెను, యోయాకీము ఎల్యాషీబును కనెను, ఎల్యాషీబు యోయా దాను కనెను. యోయాదా యోనాతానును కనెను. యోనాతాను యద్దూవను కనెను. యోయాకీము దినములలో పితరులలో ప్రధానులైనవారు యాజకులై యుండిరి. వారెవరనగా, శెరాయా యింటివారికి మెరాయా, యిర్మీయా యింటివారికి హనన్యా ఎజ్రా యింటివారికి మెషుల్లాము, అమర్యా యింటివారికి యెహో హానాను మెలీకూ యింటివారికి యోనాతాను, షెబన్యా యింటివారికి యోసేపు హారిము ఇంటివారికి అద్నా, మెరాయోతు ఇంటివారికి హెల్కయి ఇద్దో యింటివారికి జెకర్యా, గిన్నెతోను ఇంటివారికి మెషుల్లాము అబీయా యింటివారికి జిఖ్రీ, మిన్యామీను ఇంటివారికి మోవద్యా యింటివారికి పిల్టయి. బిల్గా యింటివారికి షమ్మూయ, షెమయా యింటివారికి యెహో నాతాను యోయారీబు ఇంటివారికి మత్తెనై యెదాయా యింటివారికి ఉజ్జీ సల్లయి యింటివారికి కల్లయి ఆమోకు ఇంటివారికి ఏబెరు హిల్కీయా యింటివారికి హషబ్యా, యెదాయా యింటివారికి నెతనేలు. ఎల్యాషీబు దినములలో లేవీయుల విషయములో యోయాదా యోహానాను యద్దూవ కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. మరియు పారసీకుడగు దర్యావేషు ఏలుబడికాలములో వారే యాజకకుటుంబ ప్రధానులుగా దాఖలైరి. ఎల్యాషీబు కుమారుడైన యోహానాను దినములవరకు అనుదినము జరుగు విషయముల గ్రంథమందు వారు లేవీయుల కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. లేవీయుల కుటుంబ ప్రధానులైన హషబ్యాయు షేరేబ్యాయును కద్మీయేలు కుమారుడైన యేషూవయును వారికి ఎదురు వరుసలో పాడు తమ బంధువులతోకూడ దైవజనుడైవ దావీదు యొక్క ఆజ్ఞనుబట్టి స్తుతిపాటలు పాడుటకు వంతుల చొప్పున నిర్ణయింపబడిరి. మత్తన్యా బక్బుక్యా ఓబద్యా మెషుల్లాము టల్మోను అక్కూబు అనువారు గుమ్మముల దగ్గరనున్న పదార్థపు కొట్టులయొద్ద కాపుకాచు ద్వార పాలకులుగా ఉండిరి. వీరు యోజాదాకునకు పుట్టిన యేషూవ కుమారుడైన యోయాకీము దినములలోను అధి కారియైన నెహెమ్యాదినములలోను యాజకుడును శాస్త్రి యునగు ఎజ్రా దినములలోను ఆ పని జరువుచువచ్చిరి.
- 1 Chronicles 23:12–13 1 దినవృత్తాంతములు 23:12–13కహాతు కుమారులు నలుగురు, అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు. అమ్రాము కుమారులు అహరోను మోషే; అహరోనును అతని కుమారులును నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపము వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి.
- 1 Chronicles 23:18–20 1 దినవృత్తాంతములు 23:18–20ఇస్హారు కుమారులలో షెలోమీతు పెద్దవాడు. హెబ్రోను కుమారులలో యెరీయా పెద్దవాడు, అమర్యా రెండవవాడు, యహజీయేలు మూడవవాడు, యెక్మెయాము నాలుగవవాడు. ఉజ్జీయేలు కుమారులలో మీకా పెద్ద వాడు యెషీయా రెండవవాడు.
- 1 Chronicles 25:4 1 దినవృత్తాంతములు 25:4హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బక్కీ యాహు మత్తన్యా ఉజ్జీయేలు షెబూయేలు యెరీమోతు హనన్యా హనానీ ఎలీయ్యాతా గిద్దల్తీ రోమమీ్తయెజెరు యొష్బెకాషా మల్లోతి హోతీరు మహజీయోతు అనువారు.
- 1 Chronicles 15:17–21 1 దినవృత్తాంతములు 15:17–21కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును, వాని బంధువులలో బెరెక్యా కుమారుడైన ఆసాపును, తమ బంధువులగు మెరారీయులలో కూషాయాహు కుమారుడైన ఏతానును, వీరితోకూడ రెండవ వరుసగానున్న తమ బంధువులైన జెకర్యా బేను యహజీయేలు షెమీరా మోతు యెహీయేలు ఉన్నీ ఏలీయాబు బెనాయా మయ శేయా మత్తిత్యా ఎలీప్లేహు మిక్నేయాహులనువారిని ద్వారపాలకులగు ఓబేదెదోమును యెహీయేలును పాటకు లనుగా నియమించిరి. పాటకులైన హేమానును ఆసాపును ఏతానును పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయింపబడిరి. జెకర్యా అజీయేలు షెమీరామోతు యెహీయేలు ఉన్నీ ఏలీయాబు మయశేయా బెనాయా అనువారు హెచ్చు స్వరముగల స్వరమండలములను వాయించుటకు నిర్ణయింపబడిరి. మరియు మత్తిత్యా ఎలీప్లేహు మిక్నేయాహు ఓబేదెదోము యెహీయేలు అజజ్యాహు అనువారు రాగమెత్తుటకును సితారాలు వాయించుటకును నిర్ణయింపబడిరి.
- 1 Chronicles 6:38 1 దినవృత్తాంతములు 6:38కోరహు ఇస్హారునకు పుట్టెను, ఇస్హారు కహాతునకు పుట్టెను, కహాతు లేవికి పుట్టెను, లేవి ఇశ్రాయేలునకు పుట్టెను.
- 1 Chronicles 26:1–32 1 దినవృత్తాంతములు 26:1–32ద్వారపాలకుల విభాగమును గూర్చినది. ఆసాపుకుమారులలో కోరే కుమారుడైన మెషెలెమ్యా కోరహు సంతతివాడు. మెషెలెమ్యా కుమారులు ఎవరనగా జెకర్యా జ్యేష్ఠుడు, యెదీయవేలు రెండవవాడు, జెబద్యా మూడవవాడు, యత్నీయేలు నాల్గవవాడు, ఏలాము అయిదవవాడు, యెహోహనాను ఆరవవాడు, ఎల్యోయేనై యేడవవాడు. దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను; వారెవరనగా షెమయా జ్యేష్ఠుడు, యెహోజా బాదు రెండవవాడు, యోవాహు మూడవవాడు, శాకారు నాల్గవవాడు, నెతనేలు అయిదవవాడు, అమీ్మయేలు ఆరవవాడు, ఇశ్శాఖారు ఏడవవాడు, పెయుల్లెతై యెనిమిదవవాడు. వాని కుమారుడైన షెమయాకు కుమారులు పుట్టిరి; వారు పరా క్రమ శాలులైయుండి తమ తండ్రి యింటివారికి పెద్దలైరి. షెమయా కుమారులు ఒత్ని రెఫాయేలు ఓబేదు ఎల్జాబాదు బలాఢ్యులైన అతని సహోదరులు ఎలీహు సెమక్యా. ఓబేదెదోము కుమారులైన వీరును వీరి కుమా రులును వీరి సహోదరులును అరువది యిద్దరు, వారు తమ పనిచేయుటలో మంచి గట్టివారు. మెషెలెమ్యాకు కలిగిన కుమారులును సహోదరులును పరాక్రమశాలులు, వీరు పదునెనిమిది మంది. మెరారీయులలో హోసా అనువానికి కలిగిన కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు షిమీ; వీడు జ్యేష్ఠుడు కాకపోయినను వాని తండ్రి వాని జ్యేష్ఠ భాగస్థునిగా చేసెను, రెండవవాడగు హిల్కీయా, మూడవవాడగు టెబల్యాహు, నాల్గవవాడగు జెకర్యా, హోసా కుమారులును సహోదరులును అందరు కలిసి పదుముగ్గురు. ఈలాగున ఏర్పాటైన తరగతులనుబట్టి యెహోవా మందిరములో వంతుల ప్రకారముగా తమసహోదరులు చేయునట్లు సేవచేయుటకు ఈ ద్వారపాలకులు, అనగా వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియ మింపబడిరి. చిన్నలకేమి పెద్దలకేమి పితరుల యింటి వరుసనుబట్టి యొక్కొక్క ద్వారము నొద్ద కావలియుండుటకై వారు చీట్లువేసిరి. తూర్పుతట్టు కావలి షెలెమ్యాకు పడెను, వివేకముగల ఆలోచన కర్తయైన అతని కుమారుడగు జెకర్యాకు చీటివేయగా, ఉత్తరపుతట్టు కావలి వానికి పడెను, ఓబేదెదోమునకు దక్షిణపువైపు కావలియు అతని కుమారులకు అసుప్పీమను ఇంటికావలియు పడెను. షుప్పీమునకును హోసాకును పడమటి తట్టున నున్న షల్లెకెతు గుమ్మమునకు ఎక్కు రాజమార్గమును కాచు టకు చీటి పడెను. తూర్పున లేవీయులైన ఆరుగురును, ఉత్తరమున దినమునకు నలుగురును, దక్షిణమున దినమునకు నలుగురును, అసుప్పీము నొద్ద ఇద్దరిద్దరును, బయట ద్వారమునొద్దను పడమరగా ఎక్కిపోవు రాజమార్గము నొద్దను నలుగురును, వెలుపటి త్రోవయందు ఇద్దరును ఏర్పాటైరి. కోరే సంతతివారిలోను మెరారీయులలోను ద్వారము కనిపెట్టువారికి ఈలాగు వంతులాయెను. కడకు లేవీయులలో అహీయా అనువాడు దేవుని మందిరపు బొక్కసమును ప్రతిష్ఠితములగు వస్తువుల బొక్కసములను కాచువాడుగా నియమింపబడెను. లద్దాను కుమారులను గూర్చినదిగెర్షోనీయుడైన లద్దాను కుమారులు, అనగా గెర్షోనీయులై తమ పితరుల యిండ్లకు పెద్దలైయున్నవారిని గూర్చినది. యెహీయేలీ కుమారులైన జేతామును వాని సహోదరుడైన యోవేలును యెహోవా మందిరపు బొక్కసములకు కావలికాయువారు. అమ్రామీయులు ఇస్హారీయులు హెబ్రోనీయులు ఉజ్జీయేలీయులు అనువారిని గూర్చినది. మోషే కుమారుడైన గెర్షోమునకు పుట్టిన షెబూయేలు బొక్కసముమీద ప్రధానిగా నియమింపబడెను. ఎలీయెజెరు సంతతివారగు షెబూయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారుడైన రెహబ్యా, రెహబ్యా కుమారుడైన యెషయా, యెషయా కుమారుడైన యెహోరాము, యెహోరాము కుమారుడైన జిఖ్రీ, జిఖ్రీ కుమారుడైన షెలోమీతు. యెహోవా మందిరము ఘనముగా కట్టించుటకై రాజైన దావీదును పితరుల యింటి పెద్దలును సహస్రాధిపతులును శతాధిపతులును సైన్యాధిపతులును యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్లసొమ్ము ఉన్న బొక్కసములకు షెలోమీతును వాని సహోదరులును కావలి కాయువారైరి. దీర్ఘదర్శి సమూయేలును కీషు కుమారుడైన సౌలును నేరు కుమారుడైన అబ్నేరును సెరూయా కుమారుడైన యోవాబును ప్రతిష్ఠించిన సొమ్మంతయు షెలోమీతు చేతిక్రిందను వాని సహోదరుల చేతిక్రిందను ఉంచబడెను. ఇస్హారీయులనుగూర్చినదివారిలో కెన న్యాయును వాని కుమారులును బయటిపని జరిగించుటకై ఇశ్రాయేలీయులకు లేఖికులుగాను న్యాయాధిపతులుగాను నియమింపబడిరి. హెబ్రోనీయులను గూర్చినది. హషబ్యాయును వాని సహోదరులును పరాక్రమ శాలులును వేయిన్ని యేడు వందల సంఖ్యగలవారు, వీరు యొర్దాను ఈవల పడమటి వైపుననుండు ఇశ్రాయేలీయుల మీద యెహోవా సేవను గూర్చిన వాటన్నిటి విషయములోను రాజు నియమించిన పనివిషయములోను పైవిచారణకర్తలుగా నియమింపబడిరి. హెబ్రోనీయులను గూర్చి నది. హెబ్రోనీయుల పితరుల యింటి పెద్దలందరికి యెరీయా పెద్దయాయెను. దావీదు ఏలుబడిలో నలువదియవ సంవత్సరమున వారి సంగతి విచారింపగా వారిలో గిలాదు దేశములోని యాజేరునందున్న వారు పరాక్రమ శాలులుగా కనబడిరి. పరాక్రమశాలులగు వాని సహోదరులు రెండువేల ఏడువందలమంది యింటి పెద్దలుగా కనబడిరి, దావీదు రాజు దేవుని సంబంధమైన కార్యముల విషయములోను రాజకార్యముల విషయములోను రూబే నీయుల మీదను గాదీయులమీదను మనష్షే అర్ధగోత్రపు వారి మీదను వారిని నియమించెను.
- Exodus 6:20 నిర్గమకాండము 6:20అమ్రాము తన మేనత్తయైన యోకెబెదును పెండ్లి చేసికొనెను; ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.
- Numbers 3:27 సంఖ్యాకాండము 3:27కహాతు వంశమేదనగా, అమ్రామీయుల వంశము ఇస్హారీయుల వంశము హెబ్రోనీయుల వంశము ఉజ్జీయేలీ యుల వంశము; ఇవి కహాతీయుల వంశములు.