Numbers · chapter 3 · verse 26
Numbers 3:26 in Telugu
ప్రాకారయౌవనికలు మందిరమునకును బలిపీఠమునకును చుట్టునున్న ప్రాకార ద్వారపు తెరయు దాని సమస్త సేవకొరకైన త్రాళ్లును.
Praakaarayauvanikalu mandiramunakunu balipeethamunakunu chuttununna praakaara dvaarapu terayu daani samasta sevakorakaina traallunu.
Numbers 3:26 in English
- King James Version (KJV)
- And the hangings of the court, and the curtain for the door of the court, which [is] by the tabernacle, and by the altar round about, and the cords of it for all the service thereof.
- World English Bible (WEB)
- the hangings of the court, the screen for the door of the court which is by the tabernacle and around the altar, and its cords for all of its service.
- American Standard Version (ASV)
- and the hangings of the court, and the screen for the door of the court, which is by the tabernacle, and by the altar round about, and the cords of it for all the service thereof.
- Bible in Basic English (BBE)
- And the hangings for the open space round the House and the altar, and the curtain for its doorway, and all the cords needed for its use.
- Darby Translation (DBY)
- And the hangings of the court, and the curtain of the entrance to the court, which surrounds the tabernacle and the altar, and the cords thereof for all its service.
- Webster's Bible (WBS)
- And the hangings of the court, and the curtain for the door of the court, which [is] by the tabernacle, and by the altar round about, and the cords of it, for all the service of it.
- Young's Literal Translation (YLT)
- and the hangings of the court, and the vail at the opening of the court, which [is] by the tabernacle and by the altar round about, and its cords, to all its service.
Read in context
- 24గెర్షోనీయుల పితరుల కుటుంబములో లాయేలు కుమారుడైన ఎలీయాసాపు ప్రధానుడు.
- 25ప్రత్య క్షపు గుడారములో గెర్షోను కుమారులు కాపాడవలసిన వేవనగా, మందిరము గుడారము దాని పైకప్పు ప్రత్యక్షపు గుడారము ద్వారపు తెరయు
- 26ప్రాకారయౌవనికలు మందిరమునకును బలిపీఠమునకును చుట్టునున్న ప్రాకార ద్వారపు తెరయు దాని సమస్త సేవకొరకైన త్రాళ్లును.
- 27కహాతు వంశమేదనగా, అమ్రామీయుల వంశము ఇస్హారీయుల వంశము హెబ్రోనీయుల వంశము ఉజ్జీయేలీ యుల వంశము; ఇవి కహాతీయుల వంశములు.
- 28ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరి లెక్క చూడగా ఎనిమిదివేల ఆరువందలమంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసినవారైరి.
Cross references
- Exodus 35:18 నిర్గమకాండము 35:18మందిరమునకు మేకులు ఆవరణమునకు మేకులు వాటికి త్రాళ్లు
- Exodus 38:9–16 నిర్గమకాండము 38:9–16మరియు అతడు ఆవరణము చేసెను. కుడివైపున, అనగా దక్షిణ దిక్కున నూరు మూరల పొడుగు గలవియు పేనినసన్ననారవియునైన తెరలుండెను. వాటి స్తంభములు ఇరువది వాటి ఇత్తడి దిమ్మలు ఇరువది. ఆ స్తంభముల వంకులును వాటి పెండె బద్దలును వెండివి. ఉత్తర దిక్కున నున్న తెరలు నూరు మూరలవి; వాటి స్తంభములు ఇరువది, వాటి యిత్తడి దిమ్మలు ఇరువది, ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి. పడమటి దిక్కున తెరలు ఏబది మూరలవి; వాటి స్తంభములు పది, వాటి దిమ్మలు పది, ఆ స్తంభముల వంకులును వాటి పెండె బద్దలును వెండివి. తూర్పువైపున, అనగా ఉదయపు దిక్కున ఏబది మూరలు; ద్వారముయొక్క ఒక ప్రక్కను తెరలు పదునైదు మూరలవి; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు. అట్లు రెండవ ప్రక్కను, అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు పదునైదు మూరల తెరలు ఉండెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు. ఆవరణము చుట్టునున్నదాని తెరలన్నియు పేనిన సన్ననారవి.
- Exodus 27:9–16 నిర్గమకాండము 27:9–16మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున, అనగా దక్షిణదిక్కున ఆవరణముగా నూరు మూరల పొడుగుగలదై పేనిన సన్న నార యౌవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను. దాని యిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి; ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి. అట్లే పొడుగులో ఉత్తర దిక్కున నూరు మూరల పొడుగుగల యౌవనికలుండ వలెను. దాని యిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి. ఆ స్తంభముల వంకులును వాటి పెండె బద్దలును వెండివి. పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు ఏబది మూరల యౌవనికలుండవలెను; వాటి స్తంభ ములు పది వాటి దిమ్మలు పది. తూర్పువైపున, అనగా ఉదయదిక్కున ఆవరణపు వెడల్పు ఏబది మూరలు. ఒక ప్రక్కను పదునైదు మూరల యౌవనికలుండవలెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు. రెండవ ప్రక్కను పరునైదుమూరల యౌవనికలుండవలెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలును మూడు. ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్తవర్ణములుగల యిరువది మూరల తెర యుండవలెను. అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను; వాటి స్తంభములు నాలుగు వాటి దిమ్మలు నాలుగు.