Exodus · chapter 38 · verse 9
Exodus 38:9 in Telugu
మరియు అతడు ఆవరణము చేసెను. కుడివైపున, అనగా దక్షిణ దిక్కున నూరు మూరల పొడుగు గలవియు పేనినసన్ననారవియునైన తెరలుండెను.
Mariyu atadu aavaranamu chesenu. Kudivaipuna, anagaa dakshina dikkuna nooru moorala podugu galaviyu peninasannanaaraviyunaina teralundenu.
Exodus 38:9 in English
- King James Version (KJV)
- And he made the court: on the south side southward the hangings of the court [were of] fine twined linen, an hundred cubits:
- World English Bible (WEB)
- He made the court: for the south side southward the hangings of the court were of fine twined linen, one hundred cubits;
- American Standard Version (ASV)
- And he made the court: for the south side southward the hangings of the court were of fine twined linen, a hundred cubits;
- Bible in Basic English (BBE)
- To make the open space, he put hangings on the south side, of the best linen, a hundred cubits long:
- Darby Translation (DBY)
- And he made the court. On the south side southward, the hangings of the court were of twined byssus, a hundred cubits;
- Webster's Bible (WBS)
- And he made the court: on the south side southward the hangings of the court [were of] fine twined linen, a hundred cubits:
- Young's Literal Translation (YLT)
- And he maketh the court; at the south side southward, the hangings of the court of twined linen, a hundred by the cubit,
Read in context
- 7ఆ బలి పీఠమును మోయుటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆమోతకఱ్ఱలు చొనిపెను; పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను.
- 8అతడు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళ మును దాని ఇత్తడి పీటను చేసెను.
- 9మరియు అతడు ఆవరణము చేసెను. కుడివైపున, అనగా దక్షిణ దిక్కున నూరు మూరల పొడుగు గలవియు పేనినసన్ననారవియునైన తెరలుండెను.
- 10వాటి స్తంభములు ఇరువది వాటి ఇత్తడి దిమ్మలు ఇరువది. ఆ స్తంభముల వంకులును వాటి పెండె బద్దలును వెండివి.
- 11ఉత్తర దిక్కున నున్న తెరలు నూరు మూరలవి; వాటి స్తంభములు ఇరువది, వాటి యిత్తడి దిమ్మలు ఇరువది, ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి.
Cross references
- Exodus 27:9–19 నిర్గమకాండము 27:9–19మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున, అనగా దక్షిణదిక్కున ఆవరణముగా నూరు మూరల పొడుగుగలదై పేనిన సన్న నార యౌవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను. దాని యిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి; ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి. అట్లే పొడుగులో ఉత్తర దిక్కున నూరు మూరల పొడుగుగల యౌవనికలుండ వలెను. దాని యిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి. ఆ స్తంభముల వంకులును వాటి పెండె బద్దలును వెండివి. పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు ఏబది మూరల యౌవనికలుండవలెను; వాటి స్తంభ ములు పది వాటి దిమ్మలు పది. తూర్పువైపున, అనగా ఉదయదిక్కున ఆవరణపు వెడల్పు ఏబది మూరలు. ఒక ప్రక్కను పదునైదు మూరల యౌవనికలుండవలెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు. రెండవ ప్రక్కను పరునైదుమూరల యౌవనికలుండవలెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలును మూడు. ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్తవర్ణములుగల యిరువది మూరల తెర యుండవలెను. అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను; వాటి స్తంభములు నాలుగు వాటి దిమ్మలు నాలుగు. ఆవరణముచుట్టున్న స్తంభములన్నియు వెండి పెండెబద్దలు కలవి; వాటి వంకులు వెండివి వాటి దిమ్మలు ఇత్తడివి. ఆవరణపు పొడుగు నూరు మూరలు; దాని వెడల్పు ఏబదిమూరలు దాని యెత్తు అయిదు మూరలు; అవి పేనిన సన్ననారవి వాటి దిమ్మలు ఇత్తడివి. మందిరసంబంధమైన సేవోపకర ణములన్నియు మేకులన్నియు ఆవరణపు మేకులన్నియు ఇత్తడివై యుండవలెను.
- Psalm 89:7 కీర్తనలు 89:7పరిశుద్ధదూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టునున్న వారందరికంటె భయంకరుడు.
- Exodus 40:8 నిర్గమకాండము 40:8తెరలచుట్టు ఆవరణమును నిలువబెట్టి ఆవరణద్వారముయొక్క తెరను తగిలింప వలెను.
- Exodus 40:33 నిర్గమకాండము 40:33మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టు ఆవరణమును ఏర్పరచి ఆవరణద్వారపు తెరను వేసెను. ఆలాగున మోషే పని సంపూర్తి చేసెను.
- Psalm 84:2 కీర్తనలు 84:2యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్లుచున్నది జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి.
- Psalm 84:10 కీర్తనలు 84:10నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినములకంటె శ్రేష్ఠము. భక్తిహీనుల గుడారములలో నివసించుటకంటె నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము.
- 1 Kings 6:36 1 రాజులు 6:36మరియు లోపలనున్న సాలను మూడు వరుసలను చెక్కిన రాళ్లతోను ఒక వరుసను దేవదారు దూలములతోను కట్టించెను.
- Psalm 100:4 కీర్తనలు 100:4కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి.
- Psalm 92:13 కీర్తనలు 92:13యెహోవా మందిరములో నాటబడినవారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు.