Proverbs · chapter 14 · verse 16
Proverbs 14:16 in Telugu
జ్ఞానముగలవాడు భయపడి కీడునుండి తొలగును బుద్ధిహీనుడు విఱ్ఱవీగి నిర్భయముగా తిరుగును.
Jnyaanamugalavaadu bhayapadi keedunundi tolagunu buddhiheenudu virraveegi nirbhayamugaa tirugunu.
Proverbs 14:16 in English
- King James Version (KJV)
- A wise [man] feareth, and departeth from evil: but the fool rageth, and is confident.
- World English Bible (WEB)
- A wise man fears and shuns evil, but the fool is hot headed and reckless.
- American Standard Version (ASV)
- A wise man feareth, and departeth from evil; But the fool beareth himself insolently, and is confident.
- Bible in Basic English (BBE)
- The wise man, fearing, keeps himself from evil; but the foolish man goes on in his pride, with no thought of danger.
- Darby Translation (DBY)
- A wise [man] feareth and departeth from evil; but the foolish is overbearing and confident.
- Webster's Bible (WBS)
- A wise [man] feareth, and departeth from evil: but the fool rageth, and is confident.
- Young's Literal Translation (YLT)
- The wise is fearing and turning from evil, And a fool is transgressing and is confident.
Read in context
- 14భక్తి విడిచినవాని మార్గములు వానికే వెక్కసమగును మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును.
- 15జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును.
- 16జ్ఞానముగలవాడు భయపడి కీడునుండి తొలగును బుద్ధిహీనుడు విఱ్ఱవీగి నిర్భయముగా తిరుగును.
- 17త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును. దుర్యోచనలుగలవాడు ద్వేషింపబడును.
- 18జ్ఞానము లేనివారికి మూఢత్వమే స్వాస్థ్యము వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు.
Cross references
- Proverbs 22:3 సామెతలు 22:3బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.
- Proverbs 3:7 సామెతలు 3:7నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచిపెట్టుము
- 1 Thessalonians 5:22 1 థెస్సలొనీకయులకు 5:22ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి.
- Genesis 42:18 ఆదికాండము 42:18మూడవ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను; మీరు బ్రదుకునట్లు దీని చేయుడి.
- Proverbs 29:9 సామెతలు 29:9జ్ఞాని మూఢునితో వాదించునప్పుడు వాడు ఊరకుండక రేగుచుండును.
- Job 31:21–23 యోబు 31:21–23నా భుజశల్యము దాని గూటినుండి పడును గాక నా బాహువు ఎముకలోనికి విరుగును గాక. నేనాలాగు చేయలేదు, నా బాల్యము మొదలుకొని దిక్కు లేనివాడు తండ్రిభావముతో నన్ను భావించి నాయొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిననాటనుండి దిక్కు లేని వానికి నేను మార్గదర్శినైతిని. దేవుని మహాత్మ్యము ఎదుట నేను నిలువజాలననియు ఆయన నన్ను నిర్మూలము చేయుననియు భీతిపుట్టెను.
- Proverbs 16:17 సామెతలు 16:17చెడుతనము విడిచి నడచుటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును.
- 1 Kings 20:10–11 1 రాజులు 20:10–11బెన్హదదు మరల అతని యొద్దకు దూతలను పంపినాతోకూడ వచ్చిన వారందరును పిడికెడు ఎత్తికొని పోవుటకు షోమ్రోను యొక్క ధూళి చాలినయెడల దేవతలు నాకు గొప్ప అపాయము కలుగజేయుదురు గాక అని వర్తమానము చేసెను. అందుకు ఇశ్రాయేలురాజుతన ఆయుధమును నడుమున బిగించుకొనువాడు దానివిప్పి తీసి వేసినవానివలె అతిశయపడకూడదని చెప్పుడనెను.
- Proverbs 16:6 సామెతలు 16:6కృపాసత్యములవలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటవలన మనుష్యులు చెడుతనమునుండి తొలగిపోవుదురు.
- Genesis 33:9 ఆదికాండము 33:9అప్పుడు ఏశావు - సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకొమ్మని చెప్పెను.
- Proverbs 28:14 సామెతలు 28:14నిత్యము భయముగలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరచుకొనువాడు కీడులో పడును.
- 1 Kings 20:18 1 రాజులు 20:18అతడువారు సమాధానముగా వచ్చినను యుద్ధము చేయ వచ్చినను వారిని సజీవులుగా పట్టుకొనిరండని ఆజ్ఞాపించెను.