Proverbs · chapter 14 · verse 34
Proverbs 14:34 in Telugu
నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును.
Neeti janamulu ghanatakekkutaku kaaranamu paapamu prajalaku avamaanamu techchunu.
Proverbs 14:34 in English
- King James Version (KJV)
- Righteousness exalteth a nation: but sin [is] a reproach to any people.
- World English Bible (WEB)
- Righteousness exalts a nation, but sin is a disgrace to any people.
- American Standard Version (ASV)
- Righteousness exalteth a nation; But sin is a reproach to any people.
- Bible in Basic English (BBE)
- By righteousness a nation is lifted up, but sin is a cause of shame to the peoples.
- Darby Translation (DBY)
- Righteousness exalteth a nation; but sin is a reproach to peoples.
- Webster's Bible (WBS)
- Righteousness exalteth a nation: but sin [is] a reproach to any people.
- Young's Literal Translation (YLT)
- Righteousness exalteth a nation, And the goodliness of peoples [is] a sin-offering.
Read in context
- 32అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు.
- 33తెలివిగలవాని హృదయమందు జ్ఞానము సుఖనివా సము చేయును బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును
- 34నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును.
- 35బుద్ధిగల సేవకుడు రాజుల కిష్టుడు అవమానకరముగా నడచువానిమీద రాజు కోపించును
Cross references
- Psalm 107:34 కీర్తనలు 107:34ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువగల భూమిని చవిటిపఱ్ఱగాను మార్చెను.
- Deuteronomy 28:1–68 ద్వితీయోపదేశకాండము 28:1–68నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినినేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనినయెడల నీ దేవు డైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినయెడల ఈ దీవెనలన్నియు నీమీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు; పొలములో దీవింప బడుదువు; నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కి టెద్దులు నీ గొఱ్ఱె మేకల మందలు దీవింపబడును; నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చునప్పుడు దీవింప బడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడు దీవింపబడుదువు. నీమీదపడు నీ శత్రువులను యెహోవా నీ యెదుట హత మగునట్లు చేయును; వారొక త్రోవను నీమీదికి బయలు దేరి వచ్చి యేడు త్రోవల నీ యెదుటనుండి పారిపోవు దురు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నము లన్నిటి లోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞల ననుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన యెడల యెహోవా నీకు ప్రమాణము చేసియున్నట్లు ఆయన తనకు ప్రతిష్టితజనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరు యెహోవా నామమున నీవు పిలువబడు చుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణముచేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను నీ పశు వుల విషయములోను నీ నేలపంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. యెహోవా నీ దేశముమీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశ మను తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేకజనము లకు అప్పిచ్చెదవు కాని అప్పుచేయవు నేడు నేను మీకా జ్ఞాపించు మాటలన్నిటిలో దేనివిషయములోను కుడికి గాని యెడమకుగాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్నయెడల, నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకాజ్ఞా పించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ లను విని వాటిని అనుసరించి గైకొనినయెడల, యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు. నీవు పైవాడ వుగా ఉందువుగాని క్రింది వాడవుగా ఉండవు. నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినమాట విననియెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును. పట్టణములో నీవు శపింపబడుదువు; పొలములో నీవు శపింపబడుదువు; నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును; నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొఱ్ఱె మేకల మందలు శపింపబడును; నీవు లోపలికి వచ్చునప్పుడు శపింప బడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడును శపింపబడు దువు. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యములచేత నీవు హతము చేయబడి వేగముగా నశించువరకు, నీవు చేయ బూనుకొను కార్యములన్నిటి విషయములోను యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములో నుండకుండ నిన్ను క్షీణింప జేయువరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. యెహోవా క్షయరోగముచేతను జ్వరముచేతను మంటచేతను మహాతాపముచేతను ఖడ్గము చేతను కంకి కాటుకచేతను బూజుచేతను నిన్ను కొట్టును; నీవు నశించువరకు అవి నిన్ను తరుమును. నీ తలపైని ఆకాశము ఇత్తడివలె ఉండును, నీ క్రిందనున్న నేల యినుమువలె ఉండును. యెహోవా నీ దేశపు వర్ష మును ధూళిగాను బుగ్గిగాను చేయును; నీవు నశించువరకు అది ఆకాశమునుండి నీ మీదికి వచ్చును. యెహోవా నీ శత్రువుల యెదుట నిన్ను ఓడించును. ఒక్కమార్గ మున వారి యెదుటికి బయలుదేరి నీవు యేడు మార్గముల వారి యెదుటనుండి పారిపోయి, భూరాజ్యములన్నిటి లోనికి యిటు అటు చెదరగొట్ట బడుదువు. నీ కళే బరము సకలమైన ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారమగును; వాటిని బెదరించు వాడెవడును ఉండడు. యెహోవా ఐగుప్తు పుంటిచేతను మూలవ్యాధిచేతను కుష్టు చేతను గజ్జిచేతను నిన్ను బాధించును; నీవు వాటిని పోగొట్టుకొనజాలకుందువు. వెఱ్ఱితనముచేతను గ్రుడ్డి తనముచేతను హృదయ విస్మయముచేతను యెహోవా నిన్ను బాధించును. అప్పుడు గ్రుడ్డివాడు చీకటిలో తడువు లాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదువు; నీ మార్గములను వర్ధిల్లచేసికొనలేవు; నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడెదవు; నిన్ను తప్పించు వాడెవ డును లేకపోవును, స్త్రీని ప్రధానము చేసికొందువు గాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లుకట్టుదువుగాని దానిలో నివసింపవు. ద్రాక్షతోట నాటుదువుగాని దాని పండ్లు తినవు. నీ యెద్దు నీ కన్నులయెదుట వధింప బడునుగాని దాని మాంసము నీవు తినవు. నీ గాడిద నీ యెదుటనుండి బలాత్కారముచేత కొని పోబడి నీ యొద్దకు మరల తేబడదు. నీ గొఱ్ఱె మేకలు నీ శత్రువులకు ఇయ్యబడును, నిన్ను రక్షించువాడెవడును ఉండడు. నీ కుమారులును నీ కుమార్తెలును అన్యజనమునకు ఇయ్య బడుదురు. వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లచూచిచూచి క్షీణించిపోవునుగాని నీచేత నేమియు కాకపోవును. నీ వెరుగని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితమంతయు తినివేయును. నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు. నీ కన్నులయెదుట జరుగుదానిని చూచుట వలన నీకు వెఱ్ఱియెత్తును. యెహోవా నీ అరకాలు మొదలు కొని నీ నడినెత్తివరకు మోకాళ్లమీదను తొడల మీదను కుదరని చెడుపుండ్లు పుట్టించి నిన్ను బాధించును. యెహోవా నిన్నును నీవు నీమీద నియమించు కొను నీ రాజును, నీవేగాని నీ పితరులేగాని యెరుగని జనమున కప్పగించును. అక్కడ నీవు కొయ్యదేవతలను రాతిదేవతలను పూజించెదవు యెహోవా నిన్ను చెదర గొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు సామెతకు, నిందకు నీవు హేతువై యుందువు. విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసికొనిపోయి కొంచెమే యింటికి తెచ్చు కొందువు; ఏలయనగా మిడతలుదాని తినివేయును. ద్రాక్ష తోటలను నీవు నాటి బాగుచేయుదువుగాని ఆ ద్రాక్షల రసమును త్రాగవు, ద్రాక్షపండ్లను సమకూర్చుకొనవు; ఏలయనగా పురుగు వాటిని తినివేయును. ఒలీవ చెట్లు నీ సమస్త ప్రాంతములలో నుండును గాని తైలముతో తల నంటుకొనవు; నీ ఒలీవ కాయలు రాలిపోవును. కుమా రులను కుమార్తెలను కందువుగాని వారు నీయొద్ద నుండరు, వారు చెరపట్ట బడుదురు. మిడతల దండు నీ చెట్లన్నిటిని నీ భూమి పంటను ఆక్రమించుకొనును. నీ మధ్యనున్న పరదేశి నీ కంటె మిక్కిలి హెచ్చగును నీవు మిక్కిలి తగ్గిపోదువు. అతడు నీకు అప్పిచ్చునుగాని నీవు అతనికి అప్పియ్యలేవు. అతడు తలగానుండును నీవు తోకగా నుందువు. నీవు నాశనము చేయబడువరకు ఈ శాపము లన్నియు నీమీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టు కొనును; ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞా పించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనునట్లు నీవు ఆయన మాట వినలేదు. మరియు అవి చిరకాలమువరకు నీ మీదను నీ సంతానముమీదను సూచనగాను విస్మయ కారణముగాను ఉండును. నీకు సర్వ సమృద్ధి కలిగియుండియు నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు గనుక ఆకలి దప్పులతోను వస్త్ర హీనతతోను అన్ని లోపములతోను యెహోవా నీమీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు. వారు నిన్ను నశింపజేయువరకు నీ మెడమీద ఇనుపకాడి యుంచుదురు. యెహోవా దూరమైయున్న భూదిగంతమునుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును, క్రూరముఖము కలిగి వృద్ధులను ¸యౌవనస్థులను కటా క్షింపని జనమును గద్ద యెగిరి వచ్చునట్లు నీమీదికి రప్పిం చును. నిన్ను నశింపజేయువరకు నీ పశువులను నీ పొల ముల ఫలములను వారు తినివేతురు నిన్ను నశింపజేయు వరకు ధాన్యమునేగాని ద్రాక్షారసమునేగాని తైలమునే గాని పశువుల మందలనేగాని గొఱ్ఱె మేకమందలనేగాని నీకు నిలువనియ్యరు. మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములుగల నీ కోటలు పడువరకును నీ దేశమం దంతటను నీ గ్రామములన్ని టిలోను వారు నిన్ను ముట్టడి వేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ దేశ మందంతటను నీ గ్రామములన్నిటిలోను నిన్ను ముట్టడి వేయుదురు. అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును, అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెలయొక్కయు మాంసమును తిందువు. మీలో బహు మృదువైన స్వభావమును అతి సుకుమారమునుగల మను ష్యుని కన్ను తన సహోదరునియెడలను తన కౌగిటి భార్య యెడలను తాను చంపక విడుచు తన కడమపిల్లలయెడలను చెడ్డదైనందున అతడు తాను తిను తన పిల్లలమాంసములో కొంచెమైనను వారిలో నెవనికిని పెట్టడు; ఏలయనగా మీ శత్రువులు మీ గ్రామము లన్నిటియందు మిమ్మును ఇరుకు పరచుటవలనను ముట్టడివేయుటవలనను వానికి మిగిలిన దేమియు ఉండదు. నీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచుటవలనను ముట్టడివేయుటవలనను ఏమియు లేకపోవుటచేత మీలో మృదుత్వమును అతి సుకుమారమును కలిగి మృదుత్వముచేతను అతి సుకుమా రముచేతను నేలమీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్లమధ్యనుండి పడు మావిని తాను కనబోవు పిల్ల లను తాను రహస్యముగా తినవలెనని తన కౌగిటి పెనిమిటి యెడలనైనను తన కుమారుని యెడలనైనను తన కుమార్తె యెడలనైనను కటాక్షము చూపకపోవును. నీవు జాగ్రత్త పడి యీ గ్రంథములో వ్రాయబడిన యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుచు, నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడనియెడల యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును. అవి దీర్ఘకాల ముండు గొప్ప తెగుళ్లును చెడ్డ రోగములునై యుండును. నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటిని ఆయన నీ మీదికి తెప్పించును; అవి నిన్ను వెంటాడును. మరియు నీవు నశించువరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయ బడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆకాశనక్షత్రములవలె విస్తారములైన మీరు, లెక్కకు తక్కువై కొద్ది మందే మిగిలి యుందురు. కాబట్టి మీకు మేలు చేయుచు మిమ్మును విస్తరింపజేయు టకు మీ దేవుడైన యెహోవా మీయందు ఎట్లు సంతో షించెనో అట్లు మిమ్మును నశింపజేయుటకును మిమ్ము సంహ రించుటకును యెహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించుచున్న దేశములోనుండి పెల్లగింపబడుదువు. దేశముయొక్క యీ కొనమొదలు కొని ఆ కొనవరకును సమస్తజనములలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివియునైన అన్యదేవతలను పూజింతువు. ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు; నీ అరకాలికి విశ్రాంతి కలుగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును నేత్రక్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును. నీకు ఎల్లప్పుడు ప్రాణభయము కలిగి యుండును. నీవు రేయింబగళ్లు భయపడుదువు. నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమియు ఉండదు. నీ హృదయములో పుట్టు భయముచేతను, నీ కన్ను చూచువా అయ్యో యెప్పుడు సాయంకాలమగునా అనియు, సాయంకాలమున అయ్యో యెప్పుడు ఉదయమగునా అనియు అనుకొందువు. మరియు నీవు మరి ఎప్పుడును దీనిని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమున యెహోవా ఐగుప్తునకు ఓడలమీద నిన్ను మరల రప్పించును. అక్కడ మీరు దాసులగాను దాసీలగాను నీ శత్రువులకు మిమ్మును అమ్మ జూపు కొనువారుందురుగాని మిమ్మును కొనువాడొకడైన నుండడు.
- Deuteronomy 29:18–28 ద్వితీయోపదేశకాండము 29:18–28ఆ జనముల దేవ తలను పూజించుటకు మన దేవుడైన యెహోవాయొద్ద నుండి తొలగు హృదయముగల పురుషుడేగాని స్త్రీయేగాని కుటుంబమేగాని గోత్రమేగాని నేడు మీలో ఉండ కుండునట్లును, మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లును, నేడు ఈ నిబం ధనను మీతో చేయుచున్నాను. అట్టి పనులను చేయు వాడు ఈ శాపవాక్య ములను వినునప్పుడు, మద్యముచేత దప్పి తీర్చు కొనవలెనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని, నేను ఆశీర్వాదము నొందెదనని అనుకొనును. అయితే యెహోవా వానిని క్షమింపనొల్లడు; అట్టివాడు మీలోనుండినయెడల నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్వమియు ఆ మనుష్యునిమీద పొగరాజును; ఈ గ్రంథములో వ్రాయ బడిన శాపములన్నియు వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము క్రిందనుండకుండ తుడిచివేయును. ఈ ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన నిబంధన శాపము లన్నిటినిబట్టి వానికి కీడు కలుగజేయుటకై యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనుండి వాని వేరుపర చును. కాబట్టి మీ తరువాత పుట్టు మీ సంతతివారును దూరదేశమునుండి వచ్చు పరదేశులును సమస్త జనములును ఆ దేశముయొక్క తెగుళ్లను యెహోవా దానిమీదికి తెప్పించిన సంకటములను చూచి వారు, యెహోవా తన కోపోద్రేకముచేత నశింపజేసిన సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయీములవలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పుచేతను చెడిపోయి, విత్తబడకయు దానిలో ఏదియు బుట్టకయు దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూచి యెహోవా దేని బట్టి యీ దేశమును ఇట్లు చేసెనో? యీ మహా కోపాగ్నికి హేతువేమో? అని చెప్పుకొందురు. మరియు వారువారి పితరుల దేవుడైన యెహోవా ఐగుప్తు దేశములోనుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి తామెరుగని అన్యదేవతలను, ఆయన వారికి నియమింపని దేవతలను, పూజించి వాటికి నమస్క రించిరి గనుక యీ గ్రంథములో వ్రాయబడిన శాపము లన్నిటిని యీ దేశముమీదికి తెప్పించుటకు దానిమీద యెహోవా కోపము రవులుకొనెను. యెహోవా తన కోపోద్రేకముచేతను అత్యుగ్రతచేతను తమ దేశములో నుండి వారిని పెల్లగించి, నేడున్నట్లుగా వారిని వెళ్లగొట్టి పరదేశము పాలుచేసెను.
- Deuteronomy 4:6–8 ద్వితీయోపదేశకాండము 4:6–8ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలెను. వాటినిగూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచినిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞానవివే చనలు గల జనమని చెప్పుకొందురు. ఏలయనగా మనము ఆయనకు మొఱ పెట్టునప్పుడెల్ల మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు? మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న యీ ధర్మశాస్త్ర మంతటిలో నున్న కట్టడలును నీతివిధులునుగల గొప్ప జనమేది?
- Judges 2:6–14 న్యాయాధిపతులు 2:6–14యెహోషువ జనులను వెళ్లనంపినప్పుడు ఇశ్రాయేలీ యులు దేశమును స్వాధీనపరచుకొనుటకు తమ స్వాస్థ్య ములకు పోయిరి. యెహోషువ దినములన్నిటను యెహో షువ తరువాత ఇంక బ్రదికినవారై యెహోవా ఇశ్రా యేలీయులకొరకు చేసిన కార్యములన్నిటిని చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచు వచ్చిరి. నూను కుమారుడును యెహోవాకు దాసుడు నైన యెహోషువ నూట పది సంవత్సరముల వయస్సుగల వాడై మృతినొందినప్పుడు అతని స్యాస్థ్యపు సరిహద్దులో నున్న తిమ్నత్సెరహులో జనులతని పాతిపెట్టిరి. అది ఎఫ్రాయిమీయుల మన్యమందలి గాయషుకొండకు ఉత్తరదిక్కున నున్నది. ఆ తరమువారందరు తమ పితరులయొద్దకు చేర్బబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా ఇశ్రాయేలీయులు యెహోవా కన్నులయెదుట కీడుచేసి, ఐగుప్తుదేశములోనుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టునుండు జనుల దేవతలలో ఇతరదేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహో వాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీద మండెను; ఆయన దోచు కొనువారిచేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీ యులను దోచుకొనిరి; ఆయన వారి చుట్టునున్నవారి శత్రువులచేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల యెదుట నిలువలేకపోయిరి.
- Ezekiel 16:1–63 యెహెజ్కేలు 16:1–63మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయకృత్యములను దానికి తెలియజేసి నీవీలాగు ప్రకటింపుము ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి యీ మాట సెలవిచ్చుచున్నాడు నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయుల దేశసంబంధమైనవి; నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీ జననవిధము చూడగా నీవు పుట్టిననాడు నీ నాభిసూత్రము కోయ బడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగబడను లేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి బట్టచుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలెనని యెవరును కటాక్షింపలేదు, నీయందు జాలిపడినవాడొకడును లేక పోయెను; నీవు పుట్టిననాడే బయటనేలను పారవేయబడి, చూడ అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి, రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రదుకుమని నీతో చెప్పితిని, నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రదుకుమని నీతో చెప్పితిని. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధియగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణభూషితురాలవైతివి; దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్తనము లేర్పడెను, తలవెండ్రుకలు పెరిగెను. మరియు నేను నీయొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి యుండెను గనుక నీకు అవమానము కలుగకుండ నిన్ను పెండ్లిచేసికొని నీతో నిబంధనచేసికొనగా నీవు నా దాన వైతివి; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీమీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టుపని చేసిన వస్త్రము నీకు ధరింపజేసితిని, సన్నమైన యెఱ్ఱని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించితిని, సన్నపు అవిసెనారబట్ట నీకు వేయించితిని, నీకు పట్టుబట్ట ధరింపజేసితిని. మరియు ఆభరణములచేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించితిని. ఈలాగు బంగారుతోను వెండితోను నేను నిన్ను అలంకరించి, సన్నపు అవిసెనారయు పట్టును విచిత్రపు కుట్టుపనియుగల బట్టలును నీకు ధరింపజేసి, గోధుమలును తేనెయు నూనెయు నీ కాహారముగా ఇయ్యగా, నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియగునంతగా అభివృధ్ధి నొందితివి. నేను నీ కను గ్రహించిన నా ప్రభావముచేత నీ సౌందర్యము పరి పూర్ణము కాగా అన్యజనులు దాని చూచి నీ కీర్తి ప్రశం సించుచు వచ్చిరి; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసికొని, నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారినిపోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి, పిలిచిన వానితోనెల్ల పోతివి. మరియు నీ వస్త్రములలో కొన్ని తీసి, చిత్రముగా అలకరింపబడిన ఉన్నత స్థలములను ఏర్పరచి, వాటిమీద పండుకొని వ్యభిచారము చేసితివి; అట్టి కార్యములు ఎంతమాత్రమును జరుగకూడనివి, అట్టివియు నిక జరుగవు. నేను నీకిచ్చిన బంగారువియు వెండివియునైన ఆభరణములను తీసికొని నీవు పురుషరూప విగ్రహములను చేసికొని వాటితో వ్యభిచరించితివి. మరియు నీ విచిత్ర వస్త్రములను తీసి వాటికి ధరింపజేసి, నా తైలమును నా ధూపమును వాటికర్పించితివి. భోజనమునకై నేనిచ్చిన ఆహారమును గోధుమ పిండిని నూనెను తేనెను తీసికొని యింపైన సువాసన కలుగు నట్లు నీవు ఆ బొమ్మలకు అర్పించితివి, ఆలాగున జరిగెను గదా? యిదే ప్రభు వగు యెహోవా వాక్కు. మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మింగివేయు నట్లు వాటి పేరట వారిని వధించి తివి, నీ జారత్వము చాలకపోయెననియు నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి యప్పగించితివి. నీ బాల్య కాలమందు నీవు దిగంబరివై వస్త్రహీనముగానుండి నీ రక్తములో నీవు పొర్లుచుండిన సంగతి మనస్సునకు తెచ్చు కొనక ఇన్ని హేయక్రియలను ఇంక జారత్వమును చేయుచు వచ్చితివి. ఇంతగా చెడుతనము జరిగించి నందుకు నీకు శ్రమ నీకు శ్రమ; యిదే ప్రభువైన యెహోవా వాక్కు. నీవు వీధి వీధిని గుళ్లు కట్టితివి, యెత్తయిన బలి పీఠములను ఏర్పరచితివి, ప్రతి అడ్డదోవను నీ బలిపీఠము కట్టి నీ సౌందర్యమును హేయక్రియకు వినియోగపరచి నీ యొద్దకు వచ్చినవారికందరికిని నీ పాదములు తెరచి వారితో బహుగా వ్యభిచరించితివి. మరియు నీవు మదించి యున్న నీ పొరుగువారైన ఐగుప్తీయులతో వ్యభిచరించి నీ జారత్వక్రియలను పెంపుచేసి నాకు కోపము పుట్టించితివి. కాబట్టి నేను నీకు విరోధినై నీ జీవనోపాధిని తక్కువచేసి, నీ కామవికార చేష్టలకు సిగ్గుపడిన నీ శత్రువులైన ఫిలిష్తీయుల కుమార్తెలకు నిన్ను అప్పగించు చున్నాను. అంతటితో తృప్తినొందక అష్షూరువారి తోను నీవు వ్యభిచరించితివి, వారితోకూడి జారత్వము చేసినను తృప్తినొందకపోతివి. కనాను దేశము మొదలు కొని కల్దీయదేశమువరకు నీవు బహుగా వ్యభిచరించినను నీవు తృప్తినొందలేదు. నీ హృదయమెంత బలహీన మాయెను! సిగ్గుమాలిన వేశ్యాక్రియలైన వీటినన్నిటిని జరిగించుటకై నీవు ప్రతి అడ్డదోవను గుళ్లను ప్రతి రాజ వీధిని యొక బలిపీఠమును కట్టుచు, వేశ్యచేయునట్లు చేయక, జీతము పుచ్చుకొననొల్లక యుంటివి. వ్యభిచారిణియగు భార్య తన పురుషుని త్రోసివేసి అన్యులను చేర్చుకొనును గదా? పురుషులు వేశ్యలకు పడుపుసొమ్మిచ్చెదరు గదా? నీ విటకాండ్రు నలుదిక్కులనుండి వచ్చి నీతో వ్యభిచరించునట్లు వారికందరికి నీవే సొమ్మిచ్చుచు వచ్చితివి, బహుమానముల నిచ్చుచు వచ్చితివి. నీ జారత్వమునకును ఇతర స్త్రీల జారత్వమునకును భేదమేమనగా వ్యభిచరించుటకు ఎవడైనను నీ వెంట తిరుగుటయు లేదు, నీకు పడుపుసొమ్మిచ్చుటయు లేదు, నీవే యెదురు జీత మిచ్చితివి, ఇదే నీకును వారికిని కలిగిన భేదము; ఇదే యెహోవా వాక్కు. కాబట్టి వేశ్యా, యెహోవా మాట ఆలకింపుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నీ విట కాండ్రతో నీవు నీ సొమ్ము వ్యయపరచి నీవు వ్యభిచారము చేసి నీ మానము నీవు కనుపరచుకొనిన దానిని బట్టియు, నీ విటకాండ్రనుబట్టియు, హేయ విగ్రహములను బట్టియు, నీవు వాటికప్పగించిన నీ బిడ్డల రక్తమునుబట్టియు, నీవు సంభోగించిన నీ విటకాండ్రనందరిని నీకిష్టులైన వారినందరిని నీవు ద్వేషించు వారినందరిని నేను పోగుచేయుచున్నాను; వారిని నీ చుట్టు పోగుచేసి సమకూర్చి వారికి నీ మానము కనబడునట్లు నేను దాని బయలుపరచెదను. జారిణులై హత్యలు జరిగించు స్త్రీలకు రావలసిన తీర్పు నీకు విధించి, క్రోధముతోను రోషముతోను నీకు రక్తము నియమింతును. వారి చేతికి నిన్ను అప్పగించెదను, నీవు కట్టిన గుళ్లను వారు పడద్రోసి నీవు నిలువబెట్టిన బలిపీఠములను ఊడబెరికి నీ బట్టలను తీసివేసి నీ సొగసైన ఆభరణములను తీసికొని నిన్ను దిగంబరిగాను వస్త్రహీనురాలుగాను చేయుదురు. వారు నీమీదికి సమూహములను రప్పించి నిన్ను రాళ్లతో కొట్టి చంపుదురు, కత్తులచేత నిన్ను పొడిచి వేయుదురు. వారు నీ యిండ్లను అగ్నిచేత కాల్చుదురు, అనేక స్త్రీలు చూచుచుండగా నీకు శిక్ష విధింతురు, ఈలాగు నేను నీ వేశ్యాత్వమును మాన్పింపగా నీవికను పడుపు సొమ్మియ్యక యుందువు; ఈ విధముగా నీమీదనున్న నా క్రోధమును చల్లార్చుకొందును, నా రోషము నీయెడల మాని పోవును, ఇకను ఆయాసపడకుండ నేను శాంతము తెచ్చు కొందును. నీ ¸యౌవనదినములను తలంచుకొనక వీటన్నిటి చేత నీవు నన్ను విసికించితివి, గనుక నీవు చేసియున్న హేయక్రియలన్నిటికంటెను, ఎక్కువైన కామకృత్యము లను నీవు జరిగించకుండునట్లు నీ ప్రవర్తననుబట్టి నేను నీకు శిక్ష విధింతును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. సామెతలు చెప్పువారందరును తల్లి యెట్టిదో బిడ్డయు అట్టిదేయని నిన్నుగూర్చి యందురు. పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ తల్లితో నీవు సాటి దానవు, పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ అక్క చెల్లెండ్రతో నీవు సాటి దానవు; నీ తల్లి హిత్తీయురాలు నీ తండ్రి అమోరీయుడు, నీ యెడమ ప్రక్కను నివసించు షోమ్రోనును దాని కుమార్తెలును నీకు అక్కలు, నీ కుడిప్రక్కను నివసించు సొదొమయు దాని కుమార్తెలును నీకు చెల్లెండ్రు. అయితే వారి ప్రవర్తన ననుసరించుటయు, వారు చేయు హేయక్రియలు చేయుటయు స్వల్పకార్యమని యెంచి, వారి నడతలను మించునట్లుగా నీవు చెడుమార్గములయందు ప్రవర్తించితివి. నీవును నీ కుమార్తెలును చేసినట్లు నీ చెల్లెలైన సొదొమయైనను దాని కుమార్తెలైనను చేసినవారు కారని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా, దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు ననునదియే; అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దాని చూచి వారిని వెళ్లగొట్టితిని. షోమ్రోను సహా నీ పాపములలో సగమైన చేయలేదు, అది చేసినవాటి కంటె నీవు అత్యధికముగా హేయక్రియలు చేసితివి; నీవు ఇన్ని హేయ క్రియలు చేసి నీ సహోదరిని నిర్దోషురాలినిగా కనుపరచితివి. నీవు వారికంటె అత్యధికముగా హేయక్రియలు జరిగించినందున నిన్నుబట్టి చూడగా నీ సహోదరీలు నిర్దోషురాండ్రుగా కనబడుదురు; నీవు వారికి విధించిన అవమానశిక్ష నీకే రావలెను; నిన్నుబట్టి చూడగా నీ సహోదరీలు నిర్దోషురాండ్రుగా కనబడుదురు గనుక నీవు అవమానపరచబడి సిగ్గునొందుము. నీవు చేసినది అంతటి విషయమై నీవు బిడియపడి సిగ్గునొంది వారిని ఓదార్చు నట్లు అపాయమునొందిన సొదొమను దాని కుమార్తెలను షోమ్రోనును దాని కుమార్తెలను వారివలెనే అపాయమొందిన నీ వారిని మరల స్థాపించెదరు. సొదొమయు దాని కుమార్తెలును తమ పూర్వస్థితికి వచ్చెదరు, షోమ్రోనును దాని కుమార్తెలును తమ పూర్వస్థితికి వచ్చెదరు, నీవును నీ కుమార్తెలును మీ పూర్వస్థితికి వచ్చెదరు. నీ చుట్టు ఉండి నిన్ను తృణీకరించిన ఫిలిష్తీయుల కుమార్తెలును సిరియా కుమార్తెలును నిన్ను అవమానపరచగా నీ దుర్మార్గము వెల్లడి చేయబడకముందు నీవు గర్వించి యున్నప్పుడు నీ చెల్లెలగు సొదొమ ప్రస్తావమెత్తక పోతివి. నీవు చేసిన మోసమును నీ హేయకృత్యములను నీవే భరించితివి; ఇదే యెహోవా వాక్కు ప్రభువైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు చేసిన నిబంధనను భంగము చేయవలెనని ప్రమాణమును తృణీకరించుదానా, నీవు చేసినట్టే నేను నీకు చేయబోవుచున్నాను. నీ ¸యౌవన దినములయందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని యొక నిత్య నిబంధనను నీతో చేసి దాని స్థిరపరతును. నీ అక్క చెల్లెండ్రు నీవు చేసిన నిబంధనలో పాలివారు కాకుండి నను నేను వారిని నీకు కుమార్తె లుగా ఇయ్యబోవుచున్నాను. నీవు వారిని చేర్చుకొనునప్పుడు నీ వ్రవర్తన మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడుదువు. నేను యెహోవానని నీవు తెలిసికొనునట్లు నేను నీతో నా నిబంధనను స్థిరపరచెదను. నీవు చేసినది అంతటి నిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చేయగా దానిని మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గుచేత నోరు మూసికొందువు; ఇదే యెహోవా వాక్కు.
- Hosea 13:1 హోషేయ 13:1ఎఫ్రాయిము మాటలాడినప్పుడు భయము కలిగెను; అతడు ఇశ్రాయేలువారిలో తన్ను గొప్ప చేసికొనెను; తరువాత బయలు దేవతనుబట్టి అపరాధియై అతడు నాశన మొందెను.
- Ezekiel 22:1–23 యెహెజ్కేలు 22:1–23మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ప్రాణహాని చేయు ఈ పట్టణమునకు నీవు తీర్పు తీర్చుదువా? దానికి నీవు తీర్పు తీర్చునెడల అదిచేయు హేయక్రియలన్నిటిని దానికి తెలియజేసి యీలాగున ప్రకటింపవలెను. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నీ కాలము వచ్చునట్లు నరహత్యలు చేయు పట్టణమా, నిన్ను అపవిత్రపరచుకొనునట్లు విగ్రహములు పెట్టుకొను పట్టణమా, నీవు చేసిన నరహత్యలచేత నీకు నీవే నేరస్థాపన చేసి కొంటివి, నీవు పెట్టుకొనిన విగ్రహములచేత నిన్ను నీవే అపవిత్రపరచుకొంటివి, నీకు నీవే శిక్ష తెప్పించు కొంటివి, శిక్షా సంవత్సరములు వచ్చుటకు నీవే కారణ మైతివి. కాబట్టి అన్యజనములలో నిందాస్పదముగాను, సకలదేశములలో అపహాస్యాస్పదముగాను నిన్ను నియ మించుచున్నాను. సమీపస్థులేమి దూరస్థులేమి అందరును అపకీర్తి పొందినదానవనియు అల్లరితో నిండినదాన వనియు నిన్ను అపహసింతురు. నీలోని ఇశ్రాయేలీయుల ప్రధానులందరును తమ శక్తికొలది నరహత్యచేయుదురు, నీలో తలిదండ్రులు అవమానమొందుదురు, నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యము నొందుదురు, నీలో తండ్రిలేని వారును విధవరాండ్రును హింసింపబడుదురు, నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు, నా విశ్రాంతిదినములను నీవు అపవిత్రపరచుచున్నావు. కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురమున్నారు, పర్వతములమీద భోజనము చేయువారు నీ మధ్య నివసించుచున్నారు, నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి. తమ తండ్రి మానాచ్ఛాదనము తీయు వారు నీలో నున్నారు, అశుచియై బహిష్టియైన స్త్రీని చెరుపువారు నీలో కాపురమున్నారు. ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయక్రియలు చేయును, మరియొకడు కామాతురుడై తన కోడలిని అపవిత్రపరచును, నీలో జనులు తండ్రి కుమార్తెయగు తమ సహోదరిని చెరుపుదురు. నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొనువారు నీలో నున్నారు, అప్పిచ్చి వడ్డి పుచ్చుకొని నీ పొరుగువారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. నీవు పుచ్చుకొనిన అన్యాయ లాభమును, నీవు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులు చరచుకొనుచున్నాను. నేను నీకు శిక్ష విధింప బోవుకాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించునంత బలము నీ కుండునా? యెహోవానగు నేనే మాట ఇచ్చియున్నాను, దానిని నేను నెరవేర్తును, నీ అపవిత్రతను బొత్తిగా తీసి వేయుటకై అన్యజనులలో నిన్ను చెదరగొట్టుదును, ఇతర దేశములకు నిన్ను వెళ్లగొట్టుదును. అచ్చట అన్యజనుల ఎదుటనే నీ అంతట నీవే భ్రష్ఠుడవై నేను యెహోవానని నీవు తెలిసికొందువు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి మష్టువంటివారైరి, అందరును కొలిమి లోని ఇత్తడియు తగరమును ఇనుమును సీసము నైరి, వారు వెండి మష్టువంటివారైరి. కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీరందరును మష్టు వంటివారైతిరి. నేను మిమ్మును యెరూషలేము మధ్యను పోగుచేసెదను, ఒకడు వెండియు ఇత్తడియు ఇనుమును సీసమును తగరమును పోగుచేసి కొలిమిలో వేసి దానిమీద అగ్ని ఊది కరిగించినట్లు నా కోపము చేతను రౌద్రముచేతను మిమ్మును పోగుచేసి అక్కడ మిమ్మును కరిగింతును. మిమ్మును పోగుచేసి నా కోపాగ్నిని మీమీద ఊదగా నిశ్చయముగా మీరు దానిలో కరిగిపోవుదురు. కొలి మిలో వెండి కరుగునట్లు మీరు దానిలో కరిగిపోవుదురు, అప్పుడు యెహోవానైన నేను నా క్రోధమును మీమీద కుమ్మరించితినని మీరు తెలిసికొందురు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
- Jeremiah 2:2–25 యిర్మీయా 2:2–25నీవు వెళ్లి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చునదేమనగా - నీవు అరణ్యములోను, విత్తనములు వేయదగనిదేశములోను, నన్ను వెంబడించుచు నీ ¸యౌవనకాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసికొనుచున్నాను. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠితజనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయెను, అతని లయపరచువారందరు శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును; ఇదే యెహోవా వాక్కు. యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారలారా, మీరందరు యెహోవా వాక్కు వినుడి. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు - నాయందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైనదాని ననుసరించి, తాము వ్యర్థులగునట్లు నాయొద్దనుండి దూరముగా తొలగి పోయిరి? ఐగుప్తుదేశములోనుండి మమ్మును రప్పించిన యెహోవా యెక్కడ నున్నాడని అరణ్యములో అనగా, ఎడారులు, గోతులుగల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి, యెవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మును నడిపించిన యెహోవా యెక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు. దాని ఫలములను శ్రేష్ఠపదార్థములను తినునట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మును రప్పింపగా మీరు ప్రవేశించి, నా దేశమును అపవిత్రపరచి నా స్యాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి. యెహోవా యెక్కడ ఉన్నాడని యాజకులడుగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్నెరుగరు, ఏలికలును నామీద తిరుగుబాటు చేయుదురు. ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు నిష్ప్రయోజనమైనవాటిని అనుసరింతురు కావున నేనికమీదట మీతోను మీ పిల్లల పిల్లలతోను వ్యాజ్యెమాడెదను; ఇది యెహోవా వాక్కు. కీత్తీయుల ద్వీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలిసికొనుడి. మీలో జరిగిన ప్రకారము ఎక్కడనైనను జరిగినదా? దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనెనా? అయినను నా ప్రజలు ప్రయోజనము లేనిదానికై తమ మహిమను మార్చుకొనిరి. ఆకాశమా, దీనిబట్టి విస్మయ పడుము, కంపించుము, బొత్తిగా పాడై పొమ్ము; ఇదే యెహోవా వాక్కు. నా జనులు రెండు నేరములు చేసియున్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి యున్నారు, తమకొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనియున్నారు. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా? యింటపుట్టిన దాసుడా? కాడు గదా; అతడేల దోపుడుసొమ్మాయెను? కొదమ సింహములు వానిపైని బొబ్బలు పెట్టెను గర్జించెను, అవి అతని దేశము పాడుచేసెను, అతని పట్టణములు నివాసులులేక పాడా యెను. నోపు, తహపనేసు అను పట్టణములవారు నీ నెత్తిని బద్దలు చేసిరి. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గ ములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే యీ బాధ కలుగజేసికొంటివి గదా. నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేమి పనియున్నది? యూఫ్రటీసునది నీళ్లు త్రాగుటకు అష్షూరు మార్గములో నీకేమి పనియున్నది. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా యెడల భయ భక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగు నని నీవు తెలిసికొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యముల కధిపతియునగు యెహోవా సెల విచ్చుచున్నాడు. పూర్వ కాలమునుండి నేను నీ కాడిని విరుగగొట్టి నీ బంధకములను తెంపివేసితినినేను సేవచేయనని చెప్పుచున్నావు; ఎత్తయిన ప్రతి కొండమీదను పచ్చని ప్రతి చెట్టుక్రిందను వేశ్యవలె క్రీడించుచున్నావు. శ్రేష్ఠమైన ద్రాక్షావల్లివంటి దానిగా నేను నిన్ను నాటి తిని; కేవలము నిక్కమైన విత్తనమువలని చెట్టు వంటిదానిగా నిన్ను నాటితిని; నాకు జాతిహీనపు ద్రాక్షావల్లివలె నీ వెట్లు భ్రష్టసంతాన మైతివి? నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరకవలె నాకు కనబడుచున్నది; ఇది ప్రభువగు యెహోవా వాక్కు. నేను అపవిత్రత నొందినదానను కాను, బయలు దేవతల ననుసరించి పోవుదానను కాను అని నీవు ఎట్లనుకొందువు? లోయలో నీ మార్గమును చూడుము, నీవు చేసినదాని తెలిసికొనుము, నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు వడిగల ఒంటెవు, అరణ్యమునకు అల వాటు పడిన అడవి గాడిదవు, అది దాని కామాతురతవలన గాలి పీల్చును, కలిసికొనునప్పుడు దాని త్రిప్పగల వాడెవడు? దాని వెదకు గాడిదలలో ఏదియు అలసి యుండదు, దాని మాసములో అది కనబడును. జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము, నీ గొంతుక దప్పిగొన కుండునట్లు జాగ్రత్తపడుము అని నేను చెప్పినను నీవుఆ మాట వ్యర్థము, వినను, అన్యులను మోహించితిని, వారి వెంబడి పోదునని చెప్పుచున్నావు.