Hosea · chapter 13 · verse 1
Hosea 13:1 in Telugu
ఎఫ్రాయిము మాటలాడినప్పుడు భయము కలిగెను; అతడు ఇశ్రాయేలువారిలో తన్ను గొప్ప చేసికొనెను; తరువాత బయలు దేవతనుబట్టి అపరాధియై అతడు నాశన మొందెను.
Ephraayimu maatalaadinappudu bhayamu kaligenu; atadu ishraayeluvaarilo tannu goppa chesikonenu; taruvaata bayalu devatanubatti aparaadhiyai atadu naashana mondenu.
Hosea 13:1 in English
- King James Version (KJV)
- When Ephraim spake trembling, he exalted himself in Israel; but when he offended in Baal, he died.
- World English Bible (WEB)
- When Ephraim spoke, there was trembling. He exalted himself in Israel, but when he became guilty through Baal, he died.
- American Standard Version (ASV)
- When Ephraim spake, there was trembling; he exalted himself in Israel; but when he offended in Baal, he died.
- Bible in Basic English (BBE)
- When the words of my law came from Ephraim, he was lifted up in Israel; but when he did evil through the Baal, death overtook him.
- Darby Translation (DBY)
- When Ephraim spoke, there was trembling; he exalted himself in Israel: but he trespassed through Baal, and he died.
- Webster's Bible (WBS)
- When Ephraim spoke trembling, he exalted himself in Israel; but when he offended in Baal, he died.
- Young's Literal Translation (YLT)
- When Ephraim speaketh tremblingly, He hath been lifted up in Israel, When he becometh guilty in Baal he dieth.
Read in context
- 1ఎఫ్రాయిము మాటలాడినప్పుడు భయము కలిగెను; అతడు ఇశ్రాయేలువారిలో తన్ను గొప్ప చేసికొనెను; తరువాత బయలు దేవతనుబట్టి అపరాధియై అతడు నాశన మొందెను.
- 2ఇప్పుడు వారు పాపము పెంపుచేయుదురు, తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయు దురు, అదంతయు పనివారు చేయు పనియే, వాటికి బలులను అర్పించువారుదూడలను ముద్దు పెట్టుకొనుడని చెప్పు దురు.
- 3కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘము వలెను పెందలకడ గతించు ప్రాతఃకాలపు మంచువలె నుందురు; కళ్లములోనుండి గాలి యెగురగొట్టు పొట్టు వలెను, కిటకీలోగుండ పోవు పొగవలె నుందురు.
Cross references
- Hosea 11:2 హోషేయ 11:2ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులనర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి.
- Luke 14:11 లూకా 14:11తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను.
- Numbers 27:16–23 సంఖ్యాకాండము 27:16–23అతడు వారి యెదుట వచ్చుచు, పోవుచునుండి, వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై యుండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెనునూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతని తీసికొని అతనిమీద నీ చెయ్యి యుంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వసమాజము ఎదుటను అతని నిలువబెట్టి వారి కన్నుల యెదుట అతనికి ఆజ్ఞ యిమ్ము; ఇశ్రాయేలీయుల సర్వ సమాజము అతని మాట వినునట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పువలన అతనికొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును, అనగా సర్వసమాజము అతని మాటచొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించి నట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసికొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వసమాజము ఎదుటను అతని నిలువ బెట్టి అతనిమీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ యిచ్చెను.
- Joshua 3:7 యెహోషువ 3:7అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందు నని ఇశ్రాయేలీయులందరు ఎరుగునట్లు నేడు వారి కన్నులయెదుట నిన్ను గొప్పచేయ మొదలు పెట్టెదను.
- Genesis 2:17 ఆదికాండము 2:17అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.
- Numbers 10:22 సంఖ్యాకాండము 10:22ఎఫ్రాయీమీయుల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను; ఆ సైన్యము నకు అమీహూదు కుమారుడైన ఎలీషామా అధిపతి.
- 1 Samuel 15:17 1 సమూయేలు 15:17అందుకు సమూయేలునీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సువైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులమీద రాజుగా అభిషేకించెను.
- Numbers 13:16 సంఖ్యాకాండము 13:16దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుష్యుల పేళ్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను.
- 2 Kings 17:16–18 2 రాజులు 17:16–18వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిని యనుసరింపక పోత విగ్రహములైన రెండు దూడలను చేసి దేవతాస్తంభ ములను నిలిపి ఆకాశసమూహమునకు నమస్కరించి బయలు దేవతను పూజించిరి. మరియు తమ కుమారులను కుమార్తె లను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసికొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని, ఆయనకు కోపము పుట్టిం చిరి. కాబట్టి యెహోవా ఇశ్రాయేలువారియందు బహుగా కోపగించి, తన సముఖములోనుండి వారిని వెళ్ల గొట్టెను గనుక యూదాగోత్రము గాక మరి యేగోత్రమును శేషించి యుండలేదు.
- Numbers 13:8 సంఖ్యాకాండము 13:8ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ;
- Proverbs 18:12 సామెతలు 18:12ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయ పడును ఘనతకు ముందు వినయముండును.
- Judges 8:1 న్యాయాధిపతులు 8:1అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతోనీవు మా యెడల చూపిన మర్యాద యెట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలువ లేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి.