Proverbs · chapter 15 · verse 8
Proverbs 15:8 in Telugu
భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము.
Bhaktiheenulu arpinchu balulu yehovaaku heyamulu yathaarthavantula praarthana aayanaku aanandakaramu.
Proverbs 15:8 in English
- King James Version (KJV)
- The sacrifice of the wicked [is] an abomination to the LORD: but the prayer of the upright [is] his delight.
- World English Bible (WEB)
- The sacrifice made by the wicked is an abomination to the LORD, but the prayer of the upright is his delight.
- American Standard Version (ASV)
- The sacrifice of the wicked is an abomination to Jehovah; But the prayer of the upright is his delight.
- Bible in Basic English (BBE)
- The offering of the evil-doer is disgusting to the Lord, but the prayer of the upright man is his delight.
- Darby Translation (DBY)
- The sacrifice of the wicked is an abomination to Jehovah; but the prayer of the upright is his delight.
- Webster's Bible (WBS)
- The sacrifice of the wicked [is] an abomination to the LORD: but the prayer of the upright [is] his delight.
- Young's Literal Translation (YLT)
- The sacrifice of the wicked [is] an abomination to Jehovah, And the prayer of the upright [is] His delight.
Read in context
- 6నీతిమంతుని యిల్లు గొప్ప ధననిధి భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము.
- 7జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు
- 8భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము.
- 9భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము నీతి ననుసరించువానిని ఆయన ప్రేమించును.
- 10మార్గము విడిచినవానికి కఠినశిక్ష కలుగును గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు.
Cross references
- Proverbs 15:29 సామెతలు 15:29భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును.
- 1 Chronicles 29:17 1 దినవృత్తాంతములు 29:17నా దేవా, నీవు హృదయ పరిశోధనచేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును; నేనైతే యథార్థహృదయము గలవాడనై యివి యన్నియు మనఃపూర్వకముగా ఇచ్చి యున్నాను; ఇప్పుడు ఇక్కడనుండు నీ జనులును నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను.
- Proverbs 21:27 సామెతలు 21:27భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో అర్పించినయెడల అవి మరి హేయములు.
- Jeremiah 6:20 యిర్మీయా 6:20షేబనుండి వచ్చు సాంబ్రాణి నాకేల? దూరదేశమునుండి వచ్చు మధురమైన చెరుకు నాకేల? మీ దహనబలులు నాకిష్ట మైనవి కావు, మీ బలులయందు నాకు సంతోషము లేదు.
- Isaiah 1:10–15 యెషయా 1:10–15సొదొమ న్యాయాధిపతులారా, యెహోవామాట ఆల కించుడి. గొమొఱ్ఱా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవి యొగ్గుడి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేల? దహనబలులగు పాట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కస మాయెను కోడెల రక్తమందైనను గొఱ్ఱెపిల్లల రక్తమందైనను మేక పోతుల రక్తమందైనను నాకిష్టములేదు. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దాని నికను తేకుడి అమావాస్యయు విశ్రాంతిదినమును సమాజకూట ప్రక టనమును జరుగుచున్నవి పాపులగుంపుకూడిన ఉత్సవసమాజమును నే నోర్చ జాలను. మీ అమావాస్య ఉత్సవములును నియామక కాలము లును నాకు హేయములు అవి నాకు బాధకరములు వాటిని సహింపలేక విసికియున్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి.
- Proverbs 28:9 సామెతలు 28:9ధర్మశాస్త్రమువినబడకుండ చెవిని తొలగించుకొనువాని ప్రార్థన హేయము.
- Isaiah 61:8 యెషయా 61:8ఏలయనగా న్యాయముచేయుట యెహోవానగు నాకిష్టము ఒకడు అన్యాయముగా ఒకనిసొత్తు పట్టుకొనుట నాకసహ్యము. సత్యమునుబట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్యనిబంధన చేయుదును.
- John 4:24 యోహాను 4:24దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.
- Ecclesiastes 5:1 ప్రసంగి 5:1నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము; బుద్ధిహీనులు అర్పించు నట్లుగా బలి అర్పించుటకంటె సమీపించి ఆలకించుట శ్రేష్ఠము; వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు.
- Psalm 17:1 కీర్తనలు 17:1యెహోవా, న్యాయమును ఆలకించుము, నా మొఱ్ఱనంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవులనుండి వచ్చునదికాదు.
- Isaiah 66:3 యెషయా 66:3ఎద్దును వధించువాడు నరుని చంపువానివంటివాడే గొఱ్ఱెపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువానివంటివాడే నైవేద్యము చేయువాడు పందిరక్తము అర్పించువాని వంటివాడే ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువానివంటి వాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి వారి యసహ్యమైన పనులు తమకే యిష్టముగాఉన్నవి.
- Jeremiah 7:21–23 యిర్మీయా 7:21–23సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసము భక్షించుడి. నేను ఐగుప్తు దేశములోనుండి మీ పితరులను రప్పించిన దినమున దహనబలులనుగూర్చిగాని బలులనుగూర్చిగాని నేను వారితో చెప్పలేదు, అట్టి వాటినిగూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు, ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికిచ్చి తిని ఏదనగానా మాటలు మీరు అంగీకరించినయెడల నేను మీకు దేవుడనై యుందును మీరు నాకు జనులై యుందురు; మీకు క్షేమము కలుగునట్లు నేను మీకాజ్ఞా పించుచున్న మార్గమంతటియందు మీరు నడుచుకొనుడి.