Proverbs · chapter 17 · verse 2
Proverbs 17:2 in Telugu
బుద్ధిగల దాసుడు సిగ్గుతెచ్చు కుమారునిమీద ఏలుబడి చేయును అన్నదమ్ములతోపాటు వాడు పిత్రార్జితము పంచు కొనును.
Buddhigala daasudu siggutechchu kumaarunimeeda elubadi cheyunu annadammulatopaatu vaadu pitraarjitamu panchu konunu.
Proverbs 17:2 in English
- King James Version (KJV)
- A wise servant shall have rule over a son that causeth shame, and shall have part of the inheritance among the brethren.
- World English Bible (WEB)
- A servant who deals wisely will rule over a son who causes shame, and shall have a part in the inheritance among the brothers.
- American Standard Version (ASV)
- A servant that dealeth wisely shall have rule over a son that causeth shame, And shall have part in the inheritance among the brethren.
- Bible in Basic English (BBE)
- A servant who does wisely will have rule over a son causing shame, and will have his part in the heritage among brothers.
- Darby Translation (DBY)
- A wise servant shall rule over a son that causeth shame, and shall have part in the inheritance among the brethren.
- Webster's Bible (WBS)
- A wise servant shall have rule over a son that causeth shame, and shall have part of the inheritance among the brethren.
- Young's Literal Translation (YLT)
- A wise servant ruleth over a son causing shame, And in the midst of brethren He apportioneth an inheritance.
Read in context
- 1రుచియైన భోజన పదార్థములున్నను కలహముతో కూడియుండిన ఇంటనుండుటకంటె నెమ్మది కలిగియుండి వట్టి రొట్టెముక్క తినుట మేలు.
- 2బుద్ధిగల దాసుడు సిగ్గుతెచ్చు కుమారునిమీద ఏలుబడి చేయును అన్నదమ్ములతోపాటు వాడు పిత్రార్జితము పంచు కొనును.
- 3వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే.
- 4చెడునడవడి గలవాడు దోషపు మాటలు వినును నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును.
Cross references
- Proverbs 10:5 సామెతలు 10:5వేసవికాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు.
- Proverbs 14:35 సామెతలు 14:35బుద్ధిగల సేవకుడు రాజుల కిష్టుడు అవమానకరముగా నడచువానిమీద రాజు కోపించును
- Proverbs 19:26 సామెతలు 19:26తండ్రికి కీడుచేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు.
- Ecclesiastes 4:13 ప్రసంగి 4:13మూఢత్వముచేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజుకంటె బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్న వాడే శ్రేష్ఠుడు.
- Proverbs 29:15 సామెతలు 29:15బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును.
- Proverbs 11:29 సామెతలు 11:29తన ఇంటివారిని బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును మూఢుడు జ్ఞానహృదయులకు దాసుడగును.
- Genesis 24:4–67 ఆదికాండము 24:4–67నా స్వదేశమందున్న నా బంధువులయొద్దకు వెళ్లి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశము యొక్క దేవుడును భూమియొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదననెను. ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని యెడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసికొనిపోవలెనా అని అడుగగా అబ్రాహాము అక్కడికి నా కుమారుని తీసికొని పోకూడదు సుమీ. నా తండ్రి యింట నుండియు నేను పుట్టిన దేశము నుండియు నన్ను తెచ్చి నాతో మాటలాడి నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును; అక్కడనుండి నీవు నా కుమారునికి భార్యను తీసికొనివచ్చెదవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని యెడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవు గాని నీవు నా కుమారుని అక్కడికి తీసికొని పోకూడదని అతనితో చెప్పెను. ఆ దాసుడు తన యజమానుడగు అబ్రాహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి యీ సంగతి విషయమై ప్రమాణము చేసెను. అతడు తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను తన యజమా నుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసికొని పోయెను. అతడు లేచి అరామ్నహరాయిము లోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్లబావియొద్ద తన ఒంటెలను మోక రింపచేసి యిట్లనెను నా యజమానుడగు అబ్రాహాము దేవుడవైన యెహోవా, నేనువచ్చిన కార్యమును త్వరలో సఫలముచేసి నా యజమానుడగు అబ్రాహాము మీద అనుగ్రహము చూపుము. చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊటయొద్ద నిలుచు చున్నాను; ఈ ఊరివారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగానీవు త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని యే చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకుకొరకు నీవు నియమించినదై యుండును గాక, అందువలన నీవు నా యజమానునిమీద అనుగ్రహము చూపితివని తెలిసికొందు ననెను. అతడు మాటలాడుట చాలింపకముందే అబ్రాహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొనివచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది; ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు; ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొనియెక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగ నిమ్మని అడిగెను. అందుకామె అయ్యా త్రాగు మని చెప్పి త్వరగా తన కడవను చేతిమీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను. మరియు ఆమె అతనికి దాహ మిచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికిని నీళ్లు చేదిపోయుదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికి నీళ్లు చేదిపోసెను. ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసెనో లేదో తెలిసికొనవ లెనని ఊరకుండెను. ఒంటెలు త్రాగుటయైన తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని, ఆమె చేతులకు పది తులముల ఎత్తుగల రెండు బంగారు కడియములను తీసి నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము; నీ తండ్రి యింట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగెను. అందుకామె నేను నాహోరుకు మిల్కాకనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెననెను. మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బసచేయుటకు స్థలమును ఉన్న వనగా ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రాహామను నా యాజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక; ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు; నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల యింటికి నన్ను నడిపించెననెను. అంతట ఆ చిన్నది పరుగెత్తికొనిపోయి యీ మాటలు తన తల్లి యింటి వారికి తెలిపెను. రిబ్కాకు లాబానను నొక సహోదరు డుండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుష్యుని యొద్దకు పరుగెత్తికొని పోయెను. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి ఆ మనుష్యుడు ఈలాగు నాతో మాటలాడెనని తన సహోదరియైన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుష్యుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావియొద్ద ఒంటెల దగ్గర నిలిచి యుండగా లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము; నీవు బయట నిలువనేల? ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించితిననెను. ఆ మనుష్యుడు ఇంటికి వచ్చి నప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్లు కడుగు కొనుటకు అతనికిని అతనితో కూడ నున్నవారికిని నీళ్లు ఇచ్చి అతనికి భోజనము పెట్టించెను గాని అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాబాను చెప్పుమనెను. అంతట అతడిట్లనెను. నేను అబ్రాహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను; అతనికి గొఱ్ఱెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసీ జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను. నా యజమానుని భార్యయైన శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను; నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చి యున్నాడు; మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లిచేయవద్దు. అయితే నా తండ్రి యింటికిని నా వంశస్థుల యొద్దకును వెళ్లి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసికొని రావలెనని నాచేత ప్రమాణము చేయించెను. అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నావెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడ తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి యింటనుండి నా కుమారునికి భార్యను తీసికొని వచ్చెదవు. నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్లితివా యీ ప్రమాణము విషయములో ఇక నీకు బాధ్యత ఉండదు, వారు ఆమెను ఇయ్యని యెడల కూడ ఈ ప్రమాణము విషయములో నీకు బాధ్యత ఉండదని చెప్పెను. నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి అబ్రాహామను నా యజమానుని దేవుడవైన యెహోవా, నా ప్రయాణమును నీవు సఫలము చేసిన యెడల నేను ఈ నీళ్ల బావియొద్ద నిలిచియుండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్న దానితో నేనునీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పునప్పుడు నీవు త్రాగుము నీ ఒంటెలకును చేది పోయుదునని యెవతె చెప్పునో ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్లయై యుండును గాకని మనవి చేసికొంటిని. నేను నా హృదయములో అట్లు అనుకొనుట చాలింపకముందే రిబ్కా భుజముమీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావి లోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను; అప్పుడు నాకు దాహమిమ్మని నేనామెను అడుగగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని చెప్పెను గనుక నేను త్రాగితిని; ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టెను. అప్పుడు నేను - నీవు ఎవరి కుమార్తెవని యడిగినందుకు ఆమె - మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు, నే నామె ముక్కుకు కమ్మియును ఆమె చేతుల కడియములను పెట్టి నా తలవంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రాహామను నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసితిని; ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసికొనునట్లు సరియైన మార్గమందు నన్ను నడిపించెను. కాబట్టి నా యజమానుని యెడల మీరు దయను నమ్మకమును కనుపరచిన యెడల అదియైనను నాకు తెలియచెప్పుడి, లేనియెడల అదియైనను తెలియ చెప్పుడి; అప్పుడు నేనెటు పోవలెనో అటు పోయెదననగా లాబానును బెతూయేలును ఇది యెహోవావలన కలిగిన కార్యము; మేమైతే అవునని గాని కాదనిగాని చెప్ప జాలము; ఇదిగో రిబ్కా నీ యెదుట నున్నది, ఆమెను తీసికొని పొమ్ము; యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగును గాకని ఉత్తరమిచ్చిరి. అబ్రాహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను; మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను. అతడును అతనితో కూడనున్న మనుష్యులును అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రియంతయు నుండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాని పది దినములైనను మాయొద్ద ఉండ నిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్లవచ్చు ననిరి. అప్పుడతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానీయక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్లెదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్న దానిని పిలిచి, ఆమె యేమనునో తెలిసికొందమని చెప్పుకొని రిబ్కాను పిలిచి ఈ మనుష్యునితో కూడ వెళ్లెదవా అని ఆమె నడిగినప్పుడు వెళ్లెదననెను. కాబట్టి వారు తమ సహోదరియైన రిబ్కాను ఆమె దాదిని అబ్రాహాము సేవకుని అతనితో వచ్చిన మనుష్యులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో మా సహోదరీ, నీవు వేల వేలకు తల్లి వగుదువు గాక, నీ సంతతివారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకొందురు గాక అని ఆమెను దీవింపగా రిబ్కాయు ఆమె పని కత్తెలును లేచి ఒంటెల నెక్కి ఆ మనుష్యుని వెంబడి వెళ్లిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయెను. ఇస్సాకు బెయేర్ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్లి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను, రిబ్కా కన్ను లెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీదనుండి దిగి మనల నెదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని దాసుని నడుగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుకు వేసికొనెను. అప్పుడా దాసుడు తాను చేసిన కార్యములన్నియు ఇస్సాకుతో వివరించి చెప్పెను. ఇస్సాకు తల్లియైన శారా గుడారము లోనికి ఆమెను తీసికొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను; అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖనివారణ పొందెను.