Proverbs · chapter 20 · verse 17
Proverbs 20:17 in Telugu
మోసము చేసి తెచ్చుకొన్న ఆహారము మనుష్యులకు బహు ఇంపుగా ఉండును పిమ్మట వాని నోరు మంటితో నింపబడును.
Mosamu chesi techchukonna aahaaramu manushyulaku bahu impugaa undunu pimmata vaani noru mantito nimpabadunu.
Proverbs 20:17 in English
- King James Version (KJV)
- Bread of deceit [is] sweet to a man; but afterwards his mouth shall be filled with gravel.
- World English Bible (WEB)
- Fraudulent food is sweet to a man, but afterwards his mouth is filled with gravel.
- American Standard Version (ASV)
- Bread of falsehood is sweet to a man; But afterwards his mouth shall be filled with gravel.
- Bible in Basic English (BBE)
- Bread of deceit is sweet to a man; but after, his mouth will be full of sand.
- Darby Translation (DBY)
- Bread of falsehood is sweet to a man, but afterwards his mouth shall be filled with gravel.
- Webster's Bible (WBS)
- Bread of deceit [is] sweet to a man; but afterwards his mouth shall be filled with gravel.
- Young's Literal Translation (YLT)
- Sweet to a man [is] the bread of falsehood, And afterwards is his mouth filled [with] gravel.
Read in context
- 15బంగారును విస్తారమైన ముత్యములును కలవు. తెలివి నుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు.
- 16అన్యునికొరకు పూటబడినవాని వస్త్రమును పుచ్చు కొనుము పరులకొరకు వానినే కుదువపెట్టించుము
- 17మోసము చేసి తెచ్చుకొన్న ఆహారము మనుష్యులకు బహు ఇంపుగా ఉండును పిమ్మట వాని నోరు మంటితో నింపబడును.
- 18ఉద్దేశములు ఆలోచనచేత స్థిరపరచబడును వివేకముగల నాయకుడవై యుద్ధము చేయుము.
- 19కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును కావున వదరుబోతుల జోలికి పోకుము.
Cross references
- Ecclesiastes 11:9 ప్రసంగి 11:9¸యౌవనుడా, నీ ¸యౌవనమందు సంతోషపడుము, నీ ¸యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండ నిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటి నిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపక ముంచుకొనుము;
- Proverbs 9:17–18 సామెతలు 9:17–18అది తెలివిలేనివాడొకడు వచ్చుట చూచిదొంగిలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనము రుచి అని చెప్పును. అయితే అచ్చట ప్రేతలున్నారనియు దాని ఇంటికి వెళ్లువారు పాతాళకూపములో ఉన్నారనియు వారికి ఎంతమాత్రమును తెలియలేదు.
- Job 20:12–20 యోబు 20:12–20చెడుతనము వారి నోటికి తియ్యగా నుండెనువారు నాలుకక్రింద దాని దాచిపెట్టిరి. దాని పోనియ్యక భద్రము చేసికొనిరి, నోట దానినుంచుకొనిరి. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును అది వారిలోపట నాగుపాముల విషమగును. వారు ధనమును మింగివేసిరి గాని యిప్పుడు దానిని మరల కక్కివేయుదురు. వారి కడుపులోనుండి దేవుడు దాని కక్కించును. వారు కట్లపాముల విషమును పీల్చుదురు నాగుపాము నాలుక వారిని చంపును. ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచివారు సంతోషింపరు. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించియుండిరో దానిని వారు అనుభవింపక మరల అప్పగించెదరు వారు సంపాదించిన ఆస్తికొలది వారికి సంతోషముండదు వారు బీదలను ముంచి విడిచిపెట్టినవారు వారు బలాత్కారముచేత ఒక యింటిని ఆక్రమించుకొనినను దానిని కట్టి పూర్తిచేయరు. వారు ఎడతెగక ఆశించిన వారు తమ యిష్టవస్తువులలో ఒకదాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొనజాలరు.
- Lamentations 3:15–16 విలాపవాక్యములు 3:15–16చేదువస్తువులు ఆయన నాకు తినిపించెను మాచిపత్రి ద్రావకముచేత నన్ను మత్తునిగా చేసెను రాళ్లచేత నా పండ్లు ఊడగొట్టెను బుగ్గిలో నన్ను పొర్లించెను.
- Hebrews 11:25 హెబ్రీయులకు 11:25అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి,
- Proverbs 4:17 సామెతలు 4:17కీడుచేత దొరికినదానిని వారు భుజింతురు బలాత్కారముచేత దొరికిన ద్రాక్షారసమును త్రాగు దురు
- Genesis 3:6–7 ఆదికాండము 3:6–7స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను; అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను; వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి.