Proverbs · chapter 4 · verse 17
Proverbs 4:17 in Telugu
కీడుచేత దొరికినదానిని వారు భుజింతురు బలాత్కారముచేత దొరికిన ద్రాక్షారసమును త్రాగు దురు
Keeducheta dorikinadaanini vaaru bhujinturu balaatkaaramucheta dorikina draakshaarasamunu traagu duru
Proverbs 4:17 in English
- King James Version (KJV)
- For they eat the bread of wickedness, and drink the wine of violence.
- World English Bible (WEB)
- For they eat the bread of wickedness and drink the wine of violence.
- American Standard Version (ASV)
- For they eat the bread of wickedness, And drink the wine of violence.
- Bible in Basic English (BBE)
- The bread of evil-doing is their food, the wine of violent acts their drink.
- Darby Translation (DBY)
- For they eat the bread of wickedness, and drink the wine of violence.
- Webster's Bible (WBS)
- For they eat the bread of wickedness, and drink the wine of violence.
- Young's Literal Translation (YLT)
- For they have eaten bread of wickedness, And wine of violence they drink.
Read in context
- 15దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. దానినుండి తొలగి సాగిపొమ్ము.
- 16అట్టివారు కీడుచేయనిది నిద్రింపరు ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్రరాదు.
- 17కీడుచేత దొరికినదానిని వారు భుజింతురు బలాత్కారముచేత దొరికిన ద్రాక్షారసమును త్రాగు దురు
- 18పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును,
- 19భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేనిమీద పడునది వారికి తెలియదు.
Cross references
- Proverbs 20:17 సామెతలు 20:17మోసము చేసి తెచ్చుకొన్న ఆహారము మనుష్యులకు బహు ఇంపుగా ఉండును పిమ్మట వాని నోరు మంటితో నింపబడును.
- Micah 6:12 మీకా 6:12వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేయుదురు, పట్టణస్థులు అబద్ధమాడుదురు, వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడును.
- Psalm 14:4 కీర్తనలు 14:4యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచుపాపము చేయువారికందరికిని తెలివి లేదా?పాపము చేయువారు బహుగా భయపడుదురు.
- Proverbs 9:17 సామెతలు 9:17అది తెలివిలేనివాడొకడు వచ్చుట చూచిదొంగిలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనము రుచి అని చెప్పును.
- James 5:4–5 యాకోబు 5:4–5ఇదిగో మీ చేలు కోసిన పనివారికియ్యక, మీరు మోసముగా బిగపట్టిన కూలి మొఱ్ఱపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి. మీరు భూమిమీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి.
- Amos 8:4–6 ఆమోసు 8:4–6దేశమందు బీదలను మింగివేయను దరిద్రులను మాపివేయను కోరువారలారా, తూము చిన్నదిగాను రూపాయి యెక్కువదిగాను చేసి, దొంగత్రాసు చేసి, మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య యెప్పుడై పోవునో, మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతిదినము ఎప్పుడు గతించిపోవునో యని చెప్పుకొను వారలారా, దరిద్రులను వెండికి కొనునట్లును పాదరక్షల నిచ్చి బీదవారిని కొనునట్లును చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతిదిన మెప్పుడైపోవునో అని చెప్పుకొనువారలారా, ఈ మాట ఆలకించుడి.
- Ezekiel 22:25–29 యెహెజ్కేలు 22:25–29ఉగ్రత దినమందు నీకు వర్షము రాదు, అందులో ప్రవక్తలు కుట్రచేయుదురు, గర్జించు చుండు సింహము వేటను చీల్చునట్లు వారు మనుష్యులను భక్షింతురు. సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకొందురు, దానిలో చాలామందిని వారు విధవరాండ్రుగా చేయుదురు, దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాక రించుదురు, నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను అపవిత్ర పరచుదురు, ప్రతిష్ఠితమైనదానికిని సాధారణమైనదానికిని భేదమెంచరు, పవిత్రమేదో అపవిత్రమేదో తెలిసికొను టకు జనులకు నేర్పరు, నేను విధించిన విశ్రాంతిదినములను ఆచరింపరు, వారి మధ్య నేను దూషింపబడుచున్నాను. దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలోను మనుష్యులను నశింపజేయుటలోను వేటను చీల్చు తోడేళ్లవలె ఉన్నారు. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు, యెహోవా ఏమియు సెలవియ్యనప్పుడు ప్రభువైన యెహోవా యీలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుచు, వట్టిసోదెగాండ్రయి జనులు కట్టిన మంటిగోడకు గచ్చుపూతపూయువారై యున్నారు. మరియు సామాన్య జనులు బలాత్కారముచేయుచు దొంగిలించుదురు, వారు దీనులను దరిద్రులను హింసించుదురు, అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు.
- Micah 3:5 మీకా 3:5ఆహారము నమలుచు, సమాధానమని ప్రకటించువారును, ఒకడు తమ నోట ఆహారము పెట్టనియెడల అతనిమీద యుద్ధము ప్రకటించువారునై నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా
- Job 24:5–6 యోబు 24:5–6అరణ్యములోని అడవిగాడిదలు తిరుగునట్లు బీదవారు తమ పనిమీద బయలుదేరి వేటను వెదకుదురు ఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరకును పొలములో వారు తమకొరకు గడ్డి కోసికొందురు దుష్టుల ద్రాక్షతోటలలో పరిగ ఏరుదురు.
- Zephaniah 3:3 జెఫన్యా 3:3దాని మధ్య దాని అధిపతులు గర్జనచేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రియందు తిరుగులాడుచు తెల్లవారువరకు ఎరలో ఏమియు మిగులకుండ భక్షించు తోడేళ్లు.
- Matthew 23:13 మత్తయి 23:13అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యు లారా, మీరు మనుష్యులయెదుట పరలోకరాజ్యమును మూయుదురు;
- Jeremiah 5:26–28 యిర్మీయా 5:26–28నా జనులలో దుష్టులున్నారు, పక్షుల వేటకాండ్రు పొంచి యుండునట్లు వారు పొంచియుందురు వారు బోనులు పెట్టుదురు, మనుష్యులను పట్టుకొందురు. పంజరము పిట్టలతో నిండియుండునట్లు వారి యిండ్లు కపటముతో నిండియున్నవి, దానిచేతనే వారు గొప్పవారును ఐశ్వర్య వంతులును అగుదురు. వారు క్రొవ్వి బలిసియున్నారు, అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయు చున్నారు, తండ్రిలేనివారు గెలువకుండునట్లు వారి వ్యాజ్యెమును అన్యాయముగా తీర్చుదురు, దీనుల వ్యాజ్యెమును తీర్పునకు రానియ్యరు.