Proverbs · chapter 25 · verse 4
Proverbs 25:4 in Telugu
వెండిలోని మష్టు తీసివేసినయెడల పుటము వేయువాడు పాత్రయొకటి సిద్ధపరచును.
Vendiloni mashtu teesivesinayedala putamu veyuvaadu paatrayokati siddhaparachunu.
Proverbs 25:4 in English
- King James Version (KJV)
- Take away the dross from the silver, and there shall come forth a vessel for the finer.
- World English Bible (WEB)
- Take away the dross from the silver, and material comes out for the refiner.
- American Standard Version (ASV)
- Take away the dross from the silver, And there cometh forth a vessel for the refiner:
- Bible in Basic English (BBE)
- Take away the waste from silver, and a vessel will come out for the silver-worker.
- Darby Translation (DBY)
- Take away the dross from the silver, and there cometh forth a vessel for the refiner:
- Webster's Bible (WBS)
- Take away the dross from the silver, and there shall come forth a vessel for the finer.
- Young's Literal Translation (YLT)
- Take away dross from silver, And a vessel for the refiner goeth forth,
Read in context
- 2సంగతి మరుగుచేయుట దేవునికి ఘనత సంగతి శోధించుట రాజులకు ఘనత.
- 3ఆకాశముల యెత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరములు.
- 4వెండిలోని మష్టు తీసివేసినయెడల పుటము వేయువాడు పాత్రయొకటి సిద్ధపరచును.
- 5రాజు ఎదుటనుండి దుష్టులను తొలగించినయెడల అతని సింహాసనము నీతివలన స్థిరపరచబడును.
- 6రాజు ఎదుట డంబము చూపకుము గొప్పవారున్న చోట నిలువకుము.
Cross references
- 2 Timothy 2:20–21 2 తిమోతికి 2:20–21గొప్పయింటిలో వెండి పాత్రలును బంగారు పాత్రలును మాత్రమే గాక కఱ్ఱవియు మంటివియు కూడ ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింప బడును. ఎవడైనను వీటిలో చేరక తన్నుతాను పవిత్ర పరచుకొనినయెడల వాడు పరిశుద్ధపరచబడి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయై యుండును.
- Proverbs 17:3 సామెతలు 17:3వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే.
- Ezekiel 22:18 యెహెజ్కేలు 22:18నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి మష్టువంటివారైరి, అందరును కొలిమి లోని ఇత్తడియు తగరమును ఇనుమును సీసము నైరి, వారు వెండి మష్టువంటివారైరి.
- Malachi 3:2–3 మలాకీ 3:2–3అయితే ఆయన వచ్చుదినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్నివంటివాడు, చాకలివాని సబ్బువంటి వాడు; వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహో వాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయురీతిని ఆయన వారిని నిర్మలులను చేయును.
- Isaiah 1:25–27 యెషయా 1:25–27నా హస్తము నీమీద పెట్టి క్షారము వేసి నీ మష్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసి వేసెదను. మొదటనుండినట్లు నీకు న్యాయాధిపతులను మరల ఇచ్చెదను ఆదిలోనుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరల నియమించెదను అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. సీయోనుకు న్యాయము చేతను తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతిచేతను విమోచనము కలుగును.
- 1 Peter 1:7 1 పేతురు 1:7నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.