Proverbs · chapter 26 · verse 26
Proverbs 26:26 in Telugu
వాడు తనద్వేషమును కపటవేషముచేత దాచుకొనును సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును.
Vaadu tanadveshamunu kapataveshamucheta daachukonunu samaajamulo vaani chedutanamu bayaluparachabadunu.
Proverbs 26:26 in English
- King James Version (KJV)
- [Whose] hatred is covered by deceit, his wickedness shall be shewed before the [whole] congregation.
- World English Bible (WEB)
- His malice may be concealed by deception, but his wickedness will be exposed in the assembly.
- American Standard Version (ASV)
- Though [his] hatred cover itself with guile, His wickedness shall be openly showed before the assembly.
- Bible in Basic English (BBE)
- Though his hate is covered with deceit, his sin will be seen openly before the meeting of the people.
- Darby Translation (DBY)
- Though [his] hatred is covered by dissimulation, his wickedness shall be made manifest in the congregation.
- Webster's Bible (WBS)
- [Whose] hatred is covered by deceit, his wickedness shall be shown before the [whole] congregation.
- Young's Literal Translation (YLT)
- Hatred is covered by deceit, Revealed is its wickedness in an assembly.
Read in context
- 24పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును.
- 25వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకుము వాని హృదయములో ఏడు హేయవిషయములు కలవు.
- 26వాడు తనద్వేషమును కపటవేషముచేత దాచుకొనును సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును.
- 27గుంటను త్రవ్వువాడే దానిలో పడును రాతిని పొర్లించువానిమీదికి అది తిరిగి వచ్చును.
- 28అబద్ధములాడువాడు తాను నలుగగొట్టినవారిని ద్వేషించును ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును.
Cross references
- Psalm 55:21–23 కీర్తనలు 55:21–23వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగా నున్నవి అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురుకంటె నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే. నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. దేవా, నాశనకూపములో నీవు వారిని పడవేయుదువు రక్తాపరాధులును వంచకులును సగముకాలమైన బ్రదుకరు. నేనైతే నీయందు నమ్మికయుంచి యున్నాను.
- 1 Samuel 18:17 1 సమూయేలు 18:17సౌలునా చెయ్యి వానిమీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి వానిమీద పడును గాక అనుకొనిదావీదూ, నా పెద్ద కుమార్తెయైన మేరబును నీకిత్తును; నీవు నా పట్ల యుద్ధ శాలివై యుండి యెహోవా యుద్ధములను జరిగింపవలె ననెను.
- 2 Samuel 13:22–28 2 సమూయేలు 13:22–28అబ్షాలోము తన అన్నయగు అమ్నోనుతో మంచి చెడ్డ లేమియు మాటలాడక ఊరకుండెను గాని, తన సహోదరియగు తామారును బలవంతము చేసి నందుకై అతనిమీద పగయుంచెను. రెండు సంవత్సరములైన తరువాత ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్దాసోరులో అబ్షాలోము గొఱ్ఱెల బొచ్చు కత్తిరించుకాలము రాగా అబ్షాలోము రాజకుమారుల నందరిని విందునకు పిలిచెను. అబ్షాలోము రాజునొద్దకు వచ్చిచిత్తగించుము, నీ దాసుడనైన నాకు గొఱ్ఱె బొచ్చు కత్తిరించు కాలము వచ్చెను; రాజవైన నీవును నీ సేవకులును విందునకు రావలెనని నీ దాసుడనైన నేను కోరుచున్నానని మనవి చేయగా రాజునా కుమారుడా, మమ్మును పిలువవద్దు; మేము నీకు అధిక భారముగా ఉందుము; మేమందరము రాతగదని చెప్పినను అబ్షాలోము రాజును బలవంతము చేసెను. అయితే దావీదు వెళ్ల నొల్లక అబ్షాలోమును దీవించి పంపగా అబ్షాలోమునీవు రాకపోయిన యెడల నా అన్నయగు అమ్నోను మాతోకూడ వచ్చునట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేసెను. అతడు నీయొద్దకు ఎందుకు రావలెనని రాజు అడుగగా అబ్షాలోము అతని బతిమాలినందున రాజు అమ్నోనును తన కుమారులందరును అతని యొద్దకు పోవచ్చు నని సెలవిచ్చెను. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసమువలన సంతోషియై యుండుట మీరు కనిపెట్టియుండి అమ్నోనును హతము చేయుడని నేను మీతో చెప్పు నప్పుడు భయపడక అతని చంపుడి, నేను గదా మీకు ఆజ్ఞ ఇచ్చి యున్నాను, ధైర్యము తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చెను.
- Genesis 4:8 ఆదికాండము 4:8కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను.
- 2 Samuel 3:27–30 2 సమూయేలు 3:27–30అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడుసంగతి యెవరికి వినబడకుండ గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాటలాడవలెనని యోవాబు అతని పిలిచి, తన సహోదరుడగు అశాహేలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పొడువగా అతడు చచ్చెను. ఆ తరువాత ఈ సమాచారము దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకొనిన దేమనగానేనును నా రాజ్యమును నేరు కుమారుడగు అబ్నేరు ప్రాణము తీయుట విషయములో యెహోవా సన్నిధిని ఎప్పటికిని నిరపరాధులమే. ఈ దోషము యోవాబుమీదను అతని తండ్రికి పుట్టిన వారందరిమీదను మోపబడునుగాక. యోవాబు ఇంటివారిలో స్రావముగలవాడైనను కుష్ఠరోగి యైనను కఱ్ఱపట్టుకొని నడుచువాడైనను ఖడ్గముచేత కూలు వాడైనను ఆహారము లేనివాడైనను ఉండకపోడుగాక అనెను. ఆలాగున యోవాబును అతని సహోదరుడైన అబీషైయును, అబ్నేరు గిబియోను యుద్ధమందు తమ సహోదరుడైన అశాహేలును చంపిన దానినిబట్టి అతని చంపిరి.
- 1 Samuel 18:21 1 సమూయేలు 18:21ఆమె అతనికి ఉరిగానుండునట్లును ఫిలిష్తీయుల చెయ్యి అతనిమీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకొనిఇప్పుడు నీవు మరి యొకదానిచేత నాకు అల్లుడవగుదువని దావీదుతో చెప్పి