Proverbs · chapter 26 · verse 25
Proverbs 26:25 in Telugu
వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకుము వాని హృదయములో ఏడు హేయవిషయములు కలవు.
Vaadu dayagaa maatalaadinappudu vaani maata nammakumu vaani hrudayamulo edu heyavishayamulu kalavu.
Proverbs 26:25 in English
- King James Version (KJV)
- When he speaketh fair, believe him not: for [there are] seven abominations in his heart.
- World English Bible (WEB)
- When his speech is charming, don’t believe him, for there are seven abominations in his heart.
- American Standard Version (ASV)
- When he speaketh fair, believe him not; For there are seven abominations in his heart:
- Bible in Basic English (BBE)
- When he says fair words, have no belief in him; for in his heart are seven evils:
- Darby Translation (DBY)
- when his voice is gracious, believe him not, for there are seven abominations in his heart.
- Webster's Bible (WBS)
- When he speaketh fair, believe him not: for [there are] seven abominations in his heart.
- Young's Literal Translation (YLT)
- When his voice is gracious trust not in him, For seven abominations [are] in his heart.
Read in context
- 23చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెద వులును కలిగియుండుట మంటి పెంకుమీది వెండి పూతతో సమానము.
- 24పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును.
- 25వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకుము వాని హృదయములో ఏడు హేయవిషయములు కలవు.
- 26వాడు తనద్వేషమును కపటవేషముచేత దాచుకొనును సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును.
- 27గుంటను త్రవ్వువాడే దానిలో పడును రాతిని పొర్లించువానిమీదికి అది తిరిగి వచ్చును.
Cross references
- Proverbs 6:16–19 సామెతలు 6:16–19యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును ఆయనకు హేయములు అవేవనగా, అహంకారదృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులును దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును.
- Psalm 28:3 కీర్తనలు 28:3భక్తిహీనులను, పాపము చేయువారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగి వేయకుము. వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగువారితో సమాధానముగా మాటలాడుదురు
- Jeremiah 12:6 యిర్మీయా 12:6నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటివారు సహితము నీకు ద్రోహము చేయుచున్నారు; నీ వెంబడి గేలిచేయుదురు, వారు నీతో దయగా మాటలాడుచున్నను నీవు వారిని నమ్మకూడదు.
- Jeremiah 9:2–8 యిర్మీయా 9:2–8నా జనులందరు వ్యభిచారులును ద్రోహుల సమూహమునై యున్నారు. అహహా, అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు? నేను నా జనులను విడిచి వారియొద్దనుండి తొలగిపోవుదును. విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు; దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. నన్ను ఎరుగక కీడువెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు; ఇదే యెహోవా వాక్కు. మీలో ప్రతివాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా నుండవలెను; ఏ సహోదరునినైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును; ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసముచేసియున్నారు, ఎదుటివాని తప్పులు పట్టవలెనని ప్రయాసపడుదురు. నీ నివాసస్థలము కాపట్యము మధ్యనే యున్నది, వారు కపటులై నన్ను తెలిసికొననొల్లకున్నారు; ఇదే యెహోవా వాక్కు. కావున సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఆలకింపుము, వారిని చొక్కము చేయునట్లుగా నేను వారిని కరగించుచున్నాను, నా జనులనుబట్టి నేను మరేమి చేయుదును? వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది; ఒకడు మనస్సులో వంచనాభిప్రాయముంచుకొని, నోట తన పొరుగువానితో సమాధానముగా మాటలాడును.
- Psalm 12:2 కీర్తనలు 12:2అందరు ఒకరితో నొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సుగలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు.
- Matthew 24:23 మత్తయి 24:23ఆ కాలమందు ఎవడైననుఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పినయెడల నమ్మ కుడి.
- Micah 7:5 మీకా 7:5స్నేహితునియందు నమ్మికయుంచవద్దు, ముఖ్యస్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పండుకొనియున్న దానియెదుట నీ పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము.