Proverbs · chapter 27 · verse 9
Proverbs 27:9 in Telugu
తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములోనుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును.
Tailamunu attarunu hrudayamunu santoshaparachunatlu chelikaani hrudayamulonundi vachchu madhuramaina maatalu hrudayamunu santoshaparachunu.
Proverbs 27:9 in English
- King James Version (KJV)
- Ointment and perfume rejoice the heart: so [doth] the sweetness of a man’s friend by hearty counsel.
- World English Bible (WEB)
- Perfume and incense bring joy to the heart; so does earnest counsel from a man’s friend.
- American Standard Version (ASV)
- Oil and perfume rejoice the heart; So doth the sweetness of a man’s friend [that cometh] of hearty counsel.
- Bible in Basic English (BBE)
- Oil and perfume make glad the heart, and the wise suggestion of a friend is sweet to the soul.
- Darby Translation (DBY)
- Ointment and perfume rejoice the heart; and the sweetness of one's friend is [the fruit] of hearty counsel.
- Webster's Bible (WBS)
- Ointment and perfume rejoice the heart: so [doth] the sweetness of a man's friend by hearty counsel.
- Young's Literal Translation (YLT)
- Ointment and perfume rejoice the heart, And the sweetness of one's friend — from counsel of the soul.
Read in context
- 7కడుపు నిండినవాడు తేనెపట్టునైనను త్రొక్కి వేయును. ఆకలిగొనినవానికి చేదువస్తువైనను తియ్యగా నుండును.
- 8తన యిల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు.
- 9తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములోనుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును.
- 10నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచి పెట్టకుము నీకు అపద కలిగిన దినమందు నీ సహోదరుని యింటికి వెళ్లకుము దూరములోనున్న సహోదరునికంటె దగ్గరనున్న పొరుగువాడు వాసి,
- 11నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృద యమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.
Cross references
- Proverbs 16:23–24 సామెతలు 16:23–24జ్ఞానుని హృదయము వానినోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును. ఇంపైన మాటలు తేనెపట్టువంటివి అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్య కరమైనవి.
- Psalm 23:5 కీర్తనలు 23:5నా శత్రువుల యెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది.
- Proverbs 16:21 సామెతలు 16:21జ్ఞానహృదయుడు వివేకి యనబడును రుచిగల మాటలు పలుకుటవలన విద్యయెక్కువగును.
- Psalm 104:15 కీర్తనలు 104:15అందుమూలమున భూమిలోనుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగు నిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు
- Proverbs 15:23 సామెతలు 15:23సరిగా ప్రత్యుత్తరమిచ్చినవానికి దానివలన సంతోషము పుట్టును సమయోచితమైన మాట యెంత మనోహరము!
- Song of Solomon 4:10 పరమగీతము 4:10సహోదరీ, ప్రాణేశ్వరీ, నీ ప్రేమ ఎంత మధురము! ద్రాక్షారసముకన్న నీ ప్రేమ ఎంత సంతోషకరము నీవు పూసికొను పరిమళ తైలముల వాసన సకల గంధవర్గములకన్న సంతోషకరము.
- 2 Corinthians 2:15–16 2 కొరింథీయులకు 2:15–16రక్షింపబడువారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై యున్నాము. నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింప బడువారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము.
- Psalm 133:2 కీర్తనలు 133:2అది తలమీద పోయబడి అహరోను గడ్డముమీదుగా కారి అతని అంగీల అంచువరకు దిగజారిన పరిమళ తైలమువలె నుండును
- John 12:3 యోహాను 12:3అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర యెత్తు తీసికొని, యేసు పాదములకు పూసి తన తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను; ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను
- Song of Solomon 3:6 పరమగీతము 3:6ధూమ స్తంభములవలె అరణ్యమార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చు ఇది ఏమి?
- Psalm 45:7–8 కీర్తనలు 45:7–8నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రకంటె హెచ్చగునట్లుగా నిన్ను ఆనందతైలముతో అభిషేకించి యున్నాడు. నీ వస్త్రములెల్ల గోపరస వాసనే అగరు వాసనే లవంగిపట్ట వాసనే దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి.
- Song of Solomon 1:3 పరమగీతము 1:3నీవు పూసికొను పరిమళతైలము సువాసనగలది నీ పేరు పోయబడిన పరిమళతైలముతో సమానము కన్యకలు నిన్ను ప్రేమించుదురు.