Proverbs · chapter 16 · verse 21
Proverbs 16:21 in Telugu
జ్ఞానహృదయుడు వివేకి యనబడును రుచిగల మాటలు పలుకుటవలన విద్యయెక్కువగును.
Jnyaanahrudayudu viveki yanabadunu ruchigala maatalu palukutavalana vidyayekkuvagunu.
Proverbs 16:21 in English
- King James Version (KJV)
- The wise in heart shall be called prudent: and the sweetness of the lips increaseth learning.
- World English Bible (WEB)
- The wise in heart shall be called prudent. Pleasantness of the lips promotes instruction.
- American Standard Version (ASV)
- The wise in heart shall be called prudent; And the sweetness of the lips increaseth learning.
- Bible in Basic English (BBE)
- The wise-hearted will be named men of good sense: and by pleasing words learning is increased.
- Darby Translation (DBY)
- The wise in heart is called intelligent, and the sweetness of the lips increaseth learning.
- Webster's Bible (WBS)
- The wise in heart shall be called prudent: and the sweetness of the lips increaseth learning.
- Young's Literal Translation (YLT)
- To the wise in heart is called, 'Intelligent,' And sweetness of lips increaseth learning.
Read in context
- 19గర్విష్ఠులతో దోపుడుసొమ్ము పంచుకొనుటకంటె దీనమనస్సు కలిగి దీనులతో పొత్తుచేయుట మేలు.
- 20ఉపదేశమునకు చెవి యొగ్గువాడు మేలునొందును యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు.
- 21జ్ఞానహృదయుడు వివేకి యనబడును రుచిగల మాటలు పలుకుటవలన విద్యయెక్కువగును.
- 22తెలివిగలవానికి వాని తెలివి జీవపు ఊట మూఢులకు వారి మూఢత్వమే శిక్ష
- 23జ్ఞానుని హృదయము వానినోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును.
Cross references
- Proverbs 16:23–24 సామెతలు 16:23–24జ్ఞానుని హృదయము వానినోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును. ఇంపైన మాటలు తేనెపట్టువంటివి అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్య కరమైనవి.
- Proverbs 15:7 సామెతలు 15:7జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు
- Isaiah 50:4 యెషయా 50:4అలసినవానిని మాటలచేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి యున్నాడు శిష్యులువినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి యుదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు.
- Proverbs 27:9 సామెతలు 27:9తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములోనుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును.
- James 3:17 యాకోబు 3:17అయితే పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరము తోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై యున్నది.
- Luke 4:22 లూకా 4:22అప్పుడందరును ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచు, ఆయన నోటనుండి వచ్చిన దయగల మాటల కాశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా? అని చెప్పుకొనుచుండగా
- John 7:46 యోహాను 7:46ఆ బంట్రౌతులు ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాట లాడలేదనిరి.
- Ecclesiastes 12:10 ప్రసంగి 12:10ప్రసంగి యింపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమునుగూర్చిన మాటలు యథార్థభావముతో వ్రాయుటకు పూనుకొనెను.
- 1 Kings 3:12 1 రాజులు 3:12నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను; బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను; పూర్వికులలో నీవంటివాడు ఒకడును లేడు, ఇకమీదట నీవంటివాడొకడును ఉండడు.
- Proverbs 10:8 సామెతలు 10:8జ్ఞానచిత్తుడు ఉపదేశము నంగీకరించును పనికిమాలిన వదరుబోతు నశించును.
- Proverbs 23:15 సామెతలు 23:15నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన యెడల నా హృదయముకూడ సంతోషించును.
- Psalm 45:2 కీర్తనలు 45:2నరులకంటె నీవు అతిసుందరుడవై యున్నావు నీ పెదవులమీద దయారసము పోయబడియున్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును.