Proverbs · chapter 28 · verse 6
Proverbs 28:6 in Telugu
వంచకుడై ధనము సంపాదించినవానికంటె యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి.
Vanchakudai dhanamu sampaadinchinavaanikante yathaarthamugaa pravartinchu daridrudu vaasi.
Proverbs 28:6 in English
- King James Version (KJV)
- Better [is] the poor that walketh in his uprightness, than [he that is] perverse [in his] ways, though he [be] rich.
- World English Bible (WEB)
- Better is the poor who walks in his integrity than he who is perverse in his ways, and he is rich.
- American Standard Version (ASV)
- Better is the poor that walketh in his integrity, Than he that is perverse in [his] ways, though he be rich.
- Bible in Basic English (BBE)
- Better is the poor man whose ways are upright, than the man of wealth whose ways are not straight.
- Darby Translation (DBY)
- Better is the poor that walketh in his integrity, than he that is perverse, double in ways, though he be rich.
- Webster's Bible (WBS)
- Better [is] the poor that walketh in his uprightness, than [he that is] perverse [in his] ways, though he [is] rich.
- Young's Literal Translation (YLT)
- Better [is] the poor walking in his integrity, Than the perverse of ways who is rich.
Read in context
- 4ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడు చుందురు ధర్మశాస్త్రము ననుసరించువారు వారితో పోరాడుదురు.
- 5దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు.
- 6వంచకుడై ధనము సంపాదించినవానికంటె యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి.
- 7ఉపదేశము నంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును.
- 8వడ్డిచేతను దుర్లాభముచేతను ఆస్తి పెంచుకొనువాడు దరిద్రులను కరుణించువానికొరకు దాని కూడబెట్టును.
Cross references
- Proverbs 19:1 సామెతలు 19:1బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాటలాడు వానికంటె యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు.
- Luke 16:19–23 లూకా 16:19–23ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలును సన్నపు నార వస్త్రములును ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని యింటి వాకిట పడియుండి అతని బల్లమీద నుండి పడు రొట్టెముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను; అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను. ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రా హామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి
- Proverbs 28:18 సామెతలు 28:18యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును మూర్ఖప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును.
- Proverbs 19:22 సామెతలు 19:22కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును అబద్ధికునికంటె దరిద్రుడే మేలు.
- Proverbs 16:8 సామెతలు 16:8అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడికంటె నీతితోకూడిన కొంచెమే శ్రేష్ఠము.
- Acts 24:24–27 అపొస్తలుల కార్యములు 24:24–27కొన్ని దినములైన తరువాత ఫేలిక్సు యూదురాలైన ద్రుసిల్ల అను తన భార్యతోకూడ వచ్చి పౌలును పిలిపించి, క్రీస్తుయేసునందలి విశ్వాసమునుగూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడతడు నీతిని గూర్చియు ఆశానిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శనుగూర్చియు ప్రసంగించు చుండగా ఫేలిక్సు మిగుల భయపడిఇప్పటికి వెళ్లుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పెను. తరువాత పౌలువలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి, మాటిమాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. రెండు సంవత్సరములైన తరువాత ఫేలిక్సుకు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫేలిక్సు యూదులచేత మంచి వాడనిపించుకొనవలెనని కోరి, పౌలును బంధకములలోనే విడిచిపెట్టి పోయెను.