Proverbs · chapter 29 · verse 12
Proverbs 29:12 in Telugu
అబద్ధముల నాలకించు రాజునకు ఉద్యోగస్థులందరు దుష్టులుగా నుందురు
Abaddhamula naalakinchu raajunaku udyogasthulandaru dushtulugaa nunduru
Proverbs 29:12 in English
- King James Version (KJV)
- If a ruler hearken to lies, all his servants [are] wicked.
- World English Bible (WEB)
- If a ruler listens to lies, all of his officials are wicked.
- American Standard Version (ASV)
- If a ruler hearkeneth to falsehood, All his servants are wicked.
- Bible in Basic English (BBE)
- If a ruler gives attention to false words, all his servants are evil-doers.
- Darby Translation (DBY)
- If a ruler hearken to lying words, all his servants are wicked.
- Webster's Bible (WBS)
- If a ruler hearkeneth to lies, all his servants [are] wicked.
- Young's Literal Translation (YLT)
- A ruler who is attending to lying words, All his ministers [are] wicked.
Read in context
- 10నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయ జూతురు.
- 11బుద్ధిహీనుడు తన కోపమంత కనుపరచును జ్ఞానముగలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండును.
- 12అబద్ధముల నాలకించు రాజునకు ఉద్యోగస్థులందరు దుష్టులుగా నుందురు
- 13బీదలును వడ్డికిచ్చువారును కలిసికొందురు ఉభయులకు వెలుగునిచ్చువాడు యెహోవాయే.
- 14ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును.
Cross references
- Proverbs 20:8 సామెతలు 20:8న్యాయసింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును.
- 2 Kings 10:6–7 2 రాజులు 10:6–7అప్పు డతడు రెండవ తాకీదు వ్రాయించిమీరు నా పక్షమున నుండి నా మాట వినుటకు ఒప్పుకొనినయెడల మీ యజ మానుని కుమారుల తలలను తీసికొని, రేపు ఈ వేళకు యెజ్రెయేలునకు నాయొద్దకు రండని ఆజ్ఞ ఇచ్చెను. డెబ్బది మంది రాజకుమారులును వారిని పెంచిన పట్టణపు పెద్దల యొద్ద ఉండిరి. కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు డెబ్బదిమంది రాజకుమారులను పట్టుకొని చంపి, వారి తలలను గంపలలో పెట్టి, యెజ్రెయేలులోనున్న అతని యొద్దకు పంపిరి.
- 1 Samuel 22:8–23 1 సమూయేలు 22:8–23మీరెందుకు నామీద కుట్రచేయు చున్నారు? నా కుమారుడు యెష్షయి కుమారునితో నిబంధనచేసిన సంగతి మీలో ఎవడును నాకు తెలియ జేయలేదే. నేడు జరుగునట్లు నా కొరకు పొంచి యుండునట్లుగా నా కుమారుడు నా సేవకుని పురికొలిపినను నా నిమిత్తము మీలో ఎవనికిని చింతలేదే. అప్పుడు ఎదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి యుండియెష్షయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకురాగా నేను చూచితిని. అహీమెలెకు అతని పక్షముగా యెహోవాయొద్ద విచారణచేసి, ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతని కిచ్చెనని చెప్పగా రాజు యాజకుడును అహీ టూబు కుమారుడునగు అహీ మెలెకును నోబులోనున్న అతని తండ్రి యింటివారైన యాజకులనందరిని పిలు వనంపించెను. వారు రాజునొద్దకు రాగా సౌలు అహీటూబు కుమారుడా, ఆలకించు మనగా అతడు చిత్తము నా యేలినవాడా అనెను. సౌలునీవు యెష్షయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవునియొద్ద విచారణచేసి, అతడు నామీదికి లేచి నేడు జరుగుచున్నట్టు పొంచి యుండుటకై అతడును నీవును జతకూడితిరేమని యడుగగా అహీమెలెకురాజా, రాజునకు అల్లుడై నమ్మకస్థుడై, ఆలోచనకర్తయై నీ నగరిలో ఘనతవహించిన దావీదువంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? అతని పక్షముగా నేను దేవునియొద్ద విచారణచేయుట నేడే ఆరం భించితినా? అది నాకు దూరమగునుగాక; రాజు తమ దాసుడనైన నామీదను నా తండ్రి ఇంటి వారందరిమీదను ఈ నేరము మోపకుండును గాక. ఈ సంగతినిగూర్చి కొద్ది గొప్ప యేమియు నీ దాసుడనైన నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవిచేయగా రాజు అహీమెలెకూ, నీకును నీ తండ్రి ఇంటివారికందరికిని మరణము నిశ్చయము అని చెప్పి యెహోవా యాజకులగు వీరు దావీదుతో కలిసినందునను, అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయక పోయినందునను మీరు వారిమీద పడి చంపుడని తనచుట్టు నిలిచియున్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లక యుండగా రాజు దోయేగుతోనీవు ఈ యాజకులమీద పడుమని చెప్పెను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకులమీద పడిఏఫోదు ధరించుకొనిన యెనుబది యయిదుగురిని ఆదినమున హతముచేసెను. మరియు అతడు యాజకుల పట్టణ మైన నోబు కాపురస్థులను కత్తివాత హతము చేసెను; మగ వారినేమి ఆడువారినేమి బాలురనేమి పసిపిల్లలనేమి యెడ్లనేమి గార్దభములనేమి గొఱ్ఱెలనేమి అన్ని టిని కత్తివాత హతముచేసెను. అయితే అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమారులలో అబ్యాతారు అను నొకడు తప్పించుకొని పారిపోయి దావీదునొద్దకు వచ్చి సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియజేయగా దావీదుఆ దినమున ఎదోమీయుడైన దోయేగు అక్కడనున్నందున వాడు సౌలునకు నిశ్చయ ముగా సంగతి తెలుపునని నేననుకొంటిని; నీ తండ్రి యింటివారికందరికిని మరణము రప్పించుటకు నేను కారకుడ నైతిని గదా. నీవు భయపడక నాయొద్ద ఉండుము, నా యొద్ద నీవు భద్రముగా ఉందువు; నా ప్రాణము తీయచూచు వాడును నీ ప్రాణము తీయచూచువాడును ఒకడే అని అబ్యాతారుతో చెప్పెను.
- Psalm 52:2–4 కీర్తనలు 52:2–4మోసము చేయువాడా, వాడిగల మంగల కత్తివలె నీ నాలుక నాశనము చేయ నుద్దేశించుచున్నది మేలుకంటె కీడుచేయుటయు నీతి పలుకుటకంటె అబద్ధము చెప్పుటయు నీకిష్టము. (సెలా. ) కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము.
- Psalm 101:5–7 కీర్తనలు 101:5–7తమ పొరుగువారిని చాటున దూషించువారిని నేను సంహరించెదను అహంకార దృష్టిగలవారిని గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను నాయొద్ద నివసించునట్లు దేశములో నమ్మకస్థులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోషమార్గమందు నడచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయువాడు నా యింట నివసింపరాదు అబద్ధములాడువాడు నా కన్నులయెదుట నిలువడు.
- 1 Samuel 23:19–23 1 సమూయేలు 23:19–23జీఫీయులు బయలుదేరి గిబియాలోనున్న సౌలునొద్దకు వచ్చియెషీమోనుకు దక్షిణమున నున్న హకీలామన్యము లోని అరణ్యమున కొండ స్థలములయందు మా మధ్య దావీదు దాగియున్నాడే. రాజా, నీ మనోభీష్టమంతటి చొప్పున దిగిరమ్ము; రాజవైన నీ చేతికి అతనిని అప్పగించుట మా పని అని చెప్పగా సౌలు వారితో ఇట్లనెనుమీరు నాయందు కనికరపడినందుకై మీకు యెహోవా ఆశీర్వాదము కలుగును గాక. మీరు పోయి అతడు ఉండుస్థలము ఏదయినది, అతనిని చూచినవాడు ఎవడయినది నిశ్చయముగా తెలిసికొనుడి; అతడు బహు యుక్తిగా ప్రవర్తించుచున్నాడని నాకు వినబడెను గనుక మీరు బహు జాగ్రత్తగా నుండి, అతడుండు మరుగు తావులను కని పెట్టియున్న సంగతియంత నాకు తెలియజేయుటకై మరల నాయొద్దకు తప్పక రండి, అప్పుడు నేను మీతో కూడా వత్తును, అతడు దేశములో ఎక్కడనుండినను యూదావారందరిలో నేను అతని వెదకి పట్టుకొందును.
- 2 Samuel 3:7–11 2 సమూయేలు 3:7–11అయ్యా కుమార్తెయైన రిస్పా యను ఒక ఉపపత్ని సౌలుకుండెనునా తండ్రికి ఉప పత్నియగు దానిని నీ వెందుకు కూడితివని ఇష్బోషెతు అబ్నేరును అడుగగా అబ్నేరును ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొనినిన్ను దావీదు చేతి కప్పగింపక నీ తండ్రియైన సౌలు ఇంటి వారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదావారికి చేరిన కుక్కతో సమానునిగాచేసి యీ దినమున ఒక స్త్రీనిబట్టి నామీద నేరము మోపుదువా? యెహోవా దావీదునకు ప్రమాణము చేసిన దానిని అతనిపక్షమున నేను నెరవేర్చనియెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక; సౌలు ఇంటివారి వశము కాకుండ రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెయేర్షబావరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలువారిమీదను యూదా వారి మీదను నేను స్థిరపరచెదననెను. కావున ఇష్బోషెతు అబ్నేరునకు భయపడి యిక ఏ మాటయు పలుకలేక పోయెను.
- 2 Samuel 4:5–12 2 సమూయేలు 4:5–12రిమ్మోను కుమారులగు రేకాబును బయనాయును మంచి యెండవేళ బయలుదేరి మధ్యాహ్నకాలమున ఇష్బోషెతు మంచముమీద పండుకొనియుండగా అతని యింటికి వచ్చిరి. గోధుమలు తెచ్చెదమని వేషము వేసికొని వారు ఇంటిలో చొచ్చి, ఇష్బోషెతు పడకటింట మంచము మీద పరుండియుండగా అతనిని కడుపులో పొడిచి తప్పించుకొనిపోయిరి. వారతని పొడిచి చంపి అతని తలను ఛేదించి దానిని తీసికొని రాత్రి అంతయు మైదాన ములో బడి ప్రయాణమైపోయి హెబ్రోనులోనున్న దావీదునొద్దకు ఇష్బోషెతు తలను తీసికొనివచ్చిచిత్త గించుము; నీ ప్రాణము తీయచూచిన సౌలుకుమారుడైన ఇష్బోషెతు తలను మేము తెచ్చియున్నాము; ఈ దినమున యెహోవా మా యేలినవాడవును రాజవునగు నీ పక్షమున సౌలుకును అతని సంతతికిని ప్రతికారము చేసి యున్నాడని చెప్పగా దావీదు బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులైన రేకాబుతోను బయనాతోను ఇట్లనెను మంచి వర్తమానము తెచ్చితినని తలంచియొకడు వచ్చి సౌలు చచ్చెనని నాకు తెలియజెప్పగా వాడు తెచ్చిన వర్తమానమునకు బహుమానముగా సిక్లగులో నేను వానిని పట్టుకొని చంపించితిని. కావున దుర్మార్గులైన మీరు ఇష్బోషెతు ఇంటిలో చొరబడి, అతని మంచము మీదనే నిర్దోషియగువానిని చంపినప్పుడు మీచేత అతని ప్రాణదోషము విచారింపక పోవుదునా? లోకములో ఉండకుండ నేను మిమ్మును తీసివేయక మానుదునా? సకలమైన ఉపద్రవములలోనుండి నన్ను రక్షించిన యెహోవా జీవముతోడు మాననని చెప్పి, దావీదు తన వారికి ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుష్యులను చంపి వారి చేతులను కాళ్లను నరికి వారి శవములను హెబ్రోను కొలనుదగ్గర వ్రేలాడగట్టిరి. తరువాత వారు ఇష్బోషెతు తలను తీసికొనిపోయి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతి పెట్టిరి.
- 1 Kings 21:11–13 1 రాజులు 21:11–13అతని పట్టణపు పెద్దలును పట్టణమందు నివసించు సామంతులును యెజెబెలు తమకు పంపిన తాకీదు ప్రకారముగా జరిగించిరి. ఎట్లనగా వారు ఉపవాసదినము చాటించి నాబోతును జనుల యెదుట నిలువబెట్టిరి. అప్పుడు పనికిమాలిన యిద్దరు మనుష్యులు సమాజములో ప్రవేశించి అతని యెదుట కూర్చుండినాబోతు దేవునిని రాజును దూషించెనని జనుల సమక్షమున నాబోతుమీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటికి అతనిని తీసికొని పోయి రాళ్లతో చావగొట్టిరి.
- Proverbs 25:23 సామెతలు 25:23ఉత్తరపు గాలి వాన పుట్టించును కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును.