Proverbs · chapter 29 · verse 26
Proverbs 29:26 in Telugu
అనేకులు ఏలువాని దయ కోరుచుందురు మనుష్యులను తీర్పు తీర్చుట యెహోవా వశము.
Anekulu eluvaani daya koruchunduru manushyulanu teerpu teerchuta yehovaa vashamu.
Proverbs 29:26 in English
- King James Version (KJV)
- Many seek the ruler’s favour; but [every] man’s judgment [cometh] from the LORD.
- World English Bible (WEB)
- Many seek the ruler’s favor, but a man’s justice comes from the LORD.
- American Standard Version (ASV)
- Many seek the ruler’s favor; But a man’s judgment [cometh] from Jehovah.
- Bible in Basic English (BBE)
- The approval of a ruler is desired by great numbers: but the decision in a man's cause comes from the Lord.
- Darby Translation (DBY)
- Many seek the ruler's face; but a man's right judgment is from Jehovah.
- Webster's Bible (WBS)
- Many seek the ruler's favor; but [every] man's judgment [cometh] from the LORD.
- Young's Literal Translation (YLT)
- Many are seeking the face of a ruler, And from Jehovah [is] the judgment of each.
Read in context
- 24దొంగతో పాలుకూడువాడు తనకుతానే పగవాడు అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు.
- 25భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును యెహోవాయందు నమ్మిక యుంచువాడు సురక్షిత ముగా నుండును.
- 26అనేకులు ఏలువాని దయ కోరుచుందురు మనుష్యులను తీర్పు తీర్చుట యెహోవా వశము.
- 27దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు.
Cross references
- Proverbs 19:6 సామెతలు 19:6అనేకులు గొప్పవారి కటాక్షము వెదకుదురు దాతకు అందరు స్నేహితులే.
- Psalm 20:9 కీర్తనలు 20:9యెహోవా, రక్షించుము మేము మొఱ్ఱపెట్టునపుడు రాజు మాకుత్తరమిచ్చును గాక.
- Proverbs 19:21 సామెతలు 19:21నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యెహోవాయొక్క తీర్మానమే స్థిరము.
- Isaiah 46:9–11 యెషయా 46:9–11చాల పూర్వమున జరిగినవాటిని జ్ఞాపకము చేసికొనుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెర వేర్చుకొనెదననియు, చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయు చున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను. తూర్పునుండి క్రూరపక్షిని రప్పించుచున్నాను దూరదేశమునుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానిని పిలుచుచున్నాను నేను చెప్పియున్నాను దాని నెరవేర్చెదను ఉద్దేశించియున్నాను సఫలపరచెదను.
- Psalm 62:12 కీర్తనలు 62:12ప్రభువా, మనుష్యులకందరికి వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు. కాగా కృపచూపుటయు నీది.
- Daniel 4:35 దానియేలు 4:35భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోక సేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడుకాడు.
- Ezra 7:27–28 ఎజ్రా 7:27–28యెరూషలేములోనుండు యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను, రాజును అతని మంత్రులును రాజుయొక్క మహాధిపతులును నాకు దయ అనుగ్రహింపజేసినందునను, మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి, నాతోకూడ వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చితిని.
- Esther 4:16 ఎస్తేరు 4:16నీవు పోయి షూషనునందు కనబడిన యూదులనందరిని సమాజమందిరమునకు సమకూర్చి, నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్న పానములు చేయకుండుడి; నేనును నా పని కత్తెలును కూడ ఉపవాసముందుము; ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును; నేను నశించిన నశించెదను.
- Genesis 43:14 ఆదికాండము 43:14ఆ మనుష్యుడు మీ యితర సహోదరుని బెన్యామీనును మీ కప్పగించునట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని యెదుట మిమ్మును కరుణించును గాక. నేను పుత్రహీనుడనై యుండవలసిన యెడల పుత్రహీనుడనగుదునని వారితో చెప్పెను.
- Proverbs 16:7 సామెతలు 16:7ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును.
- Nehemiah 1:11 నెహెమ్యా 1:11యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొఱ్ఱను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొఱ్ఱను ఆలకించి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి, ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అను గ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను, అని ప్రార్థించితిని. నేను రాజునకు గిన్నె అందించువాడనై యుంటిని.
- 1 Corinthians 4:4 1 కొరింథీయులకు 4:4నాయందు నాకు ఏ దోషమును కానరాదు; అయినను ఇందువలన నీతిమంతు డనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే.