Psalms · chapter 101 · verse 1
Psalm 101:1 in Telugu
నేను కృపనుగూర్చియు న్యాయమునుగూర్చియు పాడెదను యెహోవా, నిన్ను కీర్తించెదను.
Nenu krupanugoorchiyu nyaayamunugoorchiyu paadedanu yehovaa, ninnu keertinchedanu.
Psalm 101:1 in English
- King James Version (KJV)
- A Psalm of David. I will sing of mercy and judgment: unto thee, O LORD, will I sing.
- World English Bible (WEB)
- A Psalm by David. I will sing of loving kindness and justice. To you, LORD, I will sing praises.
- American Standard Version (ASV)
- A Psalm of David. I will sing of lovingkindness and justice: Unto thee, O Jehovah, will I sing praises.
- Bible in Basic English (BBE)
- A Psalm. Of David. I will make a song of mercy and righteousness; to you, O Lord, will I make melody.
- Darby Translation (DBY)
- A Psalm of David. I will sing of loving-kindness and judgment: unto thee, Jehovah, will I sing psalms.
- Webster's Bible (WBS)
- A Psalm of David. I will sing of mercy and judgment: to thee, O LORD, will I sing.
- Young's Literal Translation (YLT)
- A Psalm of David. Kindness and judgment I sing, To Thee, O Jehovah, I sing praise.
Read in context
- 1నేను కృపనుగూర్చియు న్యాయమునుగూర్చియు పాడెదను యెహోవా, నిన్ను కీర్తించెదను.
- 2నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నాయొద్దకు వచ్చెదవు? నా యింట యథార్థహృదయముతో నడుచుకొందును
- 3నా కన్నులయెదుట నేను ఏ దుష్కార్యమును ఉంచు కొనను భక్తిమార్గము తొలగినవారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనియ్యను
Cross references
- Psalm 89:1 కీర్తనలు 89:1యెహోవాయొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియ జేసెదను.
- Psalm 71:22–23 కీర్తనలు 71:22–23నా దేవా, నేనుకూడ నీ సత్యమునుబట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారాతో నిన్ను కీర్తించెదను. నేను నిన్ను కీర్తించునప్పుడు నా పెదవులును నీవు విమోచించిన నా ప్రాణమును నిన్నుగూర్చి ఉత్సాహధ్వని చేయును. నాకు కీడు చేయజూచువారు సిగ్గుపడియున్నారు
- Psalm 145:7 కీర్తనలు 145:7నీ మహా దయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతినిగూర్చి వారు గానము చేసెదరు
- Revelation 19:1–3 ప్రకటన 19:1–3అటుతరువాత బహు జనులశబ్దమువంటి గొప్పస్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును; ఆయన తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవి; తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమునుబట్టి దానికి ప్రతిదండన చేసెను; మరి రెండవసారి వారుప్రభువును స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది.
- Psalm 51:14 కీర్తనలు 51:14దేవా, నా రక్షణకర్తయగు దేవా రక్తాపరాధమునుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతినిగూర్చి ఉత్సాహగానము చేయును.
- Psalm 103:6–8 కీర్తనలు 103:6–8యెహోవా నీతిక్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికి న్యాయము తీర్చును ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపాసమృద్ధిగలవాడు.
- Psalm 97:8 కీర్తనలు 97:8యెహోవా, సీయోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయవిధులనుబట్టి సంతోషించుచున్నారు యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు.
- Romans 9:15–18 రోమీయులకు 9:15–18అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును; ఎవనియెడల జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును. కాగా పొందగోరువానివలననైనను, ప్రయాసపడువాని వలననైనను కాదు గాని, కరుణించు దేవునివలననే అగును. మరియు లేఖనము ఫరోతో ఈలాగు చెప్పెను నేను నీయందు నా బలము చూపుటకును, నా నామము భూలోకమందంతట ప్రచురమగుటకును, అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. కావున ఆయన ఎవనిని కనికరింప గోరునో వానిని కనికరించును; ఎవని కఠినపరచ గోరునో వాని కఠిన పరచును.
- Revelation 15:3–4 ప్రకటన 15:3–4వారు ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి; ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారముచేసెదరని చెప్పుచు, దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొఱ్ఱెపిల్ల కీర్తనయు పాడుచున్నారు.
- Psalm 136:10–22 కీర్తనలు 136:10–22ఐగుప్తుదేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును. వారి మధ్యనుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను ఆయన కృప నిరంతరముండును. చేయి చాచి తన బాహుబలముచేత వారిని రప్పించెను ఆయన కృప నిరంతరముండును. ఎఱ్ఱసముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపో జేసెను ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎఱ్ఱసముద్రములో ఆయన ముంచివేసెను ఆయన కృప నిరంతరముండును. అరణ్యమార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతముచేసెను ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధినొందిన రాజులను ఆయన హతముచేసెను ఆయన కృప నిరంతరముండును. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను ఆయన కృప నిరంతరముండును.
- Romans 11:22 రోమీయులకు 11:22కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారిమీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్న యెడల నీమీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము; అట్లు నిలువని యెడల నీవును నరికివేయబడుదువు.
- Romans 9:22–23 రోమీయులకు 9:22–23ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ఇచ్చయించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు ధీర్ఘశాంతముతో సహించిన నేమి? మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల, అనగా యూదులలోనుండి మాత్రము కాక,