Psalms · chapter 101 · verse 3
Psalm 101:3 in Telugu
నా కన్నులయెదుట నేను ఏ దుష్కార్యమును ఉంచు కొనను భక్తిమార్గము తొలగినవారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనియ్యను
Naa kannulayeduta nenu e dushkaaryamunu unchu konanu bhaktimaargamu tolaginavaari kriyalu naaku asahyamulu avi naaku antaniyyanu
Psalm 101:3 in English
- King James Version (KJV)
- I will set no wicked thing before mine eyes: I hate the work of them that turn aside; [it] shall not cleave to me.
- World English Bible (WEB)
- I will set no vile thing before my eyes. I hate the deeds of faithless men. They will not cling to me.
- American Standard Version (ASV)
- I will set no base thing before mine eyes: I hate the work of them that turn aside; It shall not cleave unto me.
- Bible in Basic English (BBE)
- I will not put any evil thing before my eyes; I am against all turning to one side; I will not have it near me.
- Darby Translation (DBY)
- I will set no thing of Belial before mine eyes: I hate the work of them that turn aside; it shall not cleave to me.
- Webster's Bible (WBS)
- I will set no wicked thing before my eyes: I hate the work of them that turn aside; it shall not cleave to me.
- Young's Literal Translation (YLT)
- I set not before mine eyes a worthless thing, The work of those turning aside I have hated, It adhereth not to me.
Read in context
- 1నేను కృపనుగూర్చియు న్యాయమునుగూర్చియు పాడెదను యెహోవా, నిన్ను కీర్తించెదను.
- 2నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నాయొద్దకు వచ్చెదవు? నా యింట యథార్థహృదయముతో నడుచుకొందును
- 3నా కన్నులయెదుట నేను ఏ దుష్కార్యమును ఉంచు కొనను భక్తిమార్గము తొలగినవారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనియ్యను
- 4మూర్ఖచిత్తుడు నా యొద్దనుండి తొలగిపోవలెను దౌష్ట్యమును నేననుసరింపను.
- 5తమ పొరుగువారిని చాటున దూషించువారిని నేను సంహరించెదను అహంకార దృష్టిగలవారిని గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను
Cross references
- Psalm 119:37 కీర్తనలు 119:37వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రదికింపుము.
- Job 31:1 యోబు 31:1నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు చూచుదును?
- James 1:13–15 యాకోబు 1:13–15దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.
- 2 Samuel 11:2–3 2 సమూయేలు 11:2–3ఒకానొక దినమున ప్రొద్దు గ్రుంకువేళ దావీదు పడకమీదనుండి లేచి రాజనగరి మిద్దెమీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానముచేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతియై యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలిసికొనుటకై యొక దూతను పంపెను, అతడు వచ్చిఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబ అని తెలియజేయగా
- Proverbs 6:25 సామెతలు 6:25దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరచుకొన నియ్యకుము.
- Matthew 5:28 మత్తయి 5:28నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.
- Psalm 40:4 కీర్తనలు 40:4గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధములతట్టు తిరుగు వారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు.
- 1 Samuel 12:20–21 1 సమూయేలు 12:20–21అంతట సమూయేలు జనులతో ఇట్లనెనుభయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయి నను యెహోవాను విసర్జింపకుండ ఆయనను అనుసరించుచు పూర్ణహృదయముతో ఆయనను సేవించుడి. ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అను సరించుదురు. నిజముగా అవి మాయయే.
- Exodus 20:17 నిర్గమకాండము 20:17నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను.
- Romans 12:9 రోమీయులకు 12:9మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను. చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి.
- Deuteronomy 15:9 ద్వితీయోపదేశకాండము 15:9విడుదల సంవత్సర మైన యేడవసంవత్సరము సమీపమైనదని చెడ్డతలంపు నీ మనస్సులో పుట్టక యుండునట్లు జాగ్రత్తపడుము. బీద వాడైన నీ సహోదరునియెడల కటాక్షము చూపక నీవు వానికేమియు ఇయ్యక పోయినయెడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొఱ్ఱపెట్టును; అది నీకు పాప మగును.
- Galatians 4:9 గలతీయులకు 4:9యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బల హీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠములతట్టు మరల తిరుగనేల? మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల?